E-Paper
Advertisement

సామాన్యులకు పండగే.. రోజుకు 3GB డేటా, ఫ్రీ కాల్స్.. BSNL నుంచి మరో చౌకైన ప్లాన్!

సామాన్యులకు పండగే.. రోజుకు 3GB డేటా, ఫ్రీ కాల్స్.. BSNL నుంచి మరో చౌకైన ప్లాన్!
Advertisement

BSNL Plan: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) చౌకైన రీఛార్జ్ ప్లాన్లతో తన కస్టమర్లకు ఎప్పుడూ సర్ ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే రూ.300 కంటే తక్కువ ధరకే ఒక ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్ ను అందుబాటులో ఉంచింది. నెల రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ పై పెద్ద మెుత్తంలో డేటా, ఫ్రీ కాల్స్, ఎస్ఎంఎస్ లు యూజర్లకు లభించనున్నాయి. ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.

ప్రతీరోజూ 3GB డేటా..

బీఎస్ఎన్ఎల్ ఈ రూ.299 ప్లాన్ ను 30 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఇందులో ప్రతీ రోజూ 3 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే ప్లాన్ గడువు ముగిసే నాటికి ఏకంగా 90 జీబీ డేటాను యూజర్లు వినియోగించుకోవచ్చు. ఆన్‌లైన్ గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియాను ఎక్కువగా వాడేవారికి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు చెబుతున్నాయి.

డేటా అయిపోయినా.. డోంట్ వర్రీ!

Advertisement

ఒకవేళ రోజువారీ 3GB డేటా లిమిట్ అయిపోయినా ఈ ప్లాన్ లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది. డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40 Kbps వేగంతో అపరిమితంగా డేటా వాడుకోవచ్చని పేర్కొంది. వాట్సప్ మెసేజ్ లు, వెబ్ బ్రౌజింగ్ వంటి పనులకు ఈ వేగం సరిపోతుందని తెలియజేస్తోంది.

ఫ్రీ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు

ఈ రూ.299 ప్లాన్‌ లో ఫ్రీకాల్స్ ను సైతం బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా వాయిస్ కాల్స్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. దీంతో పాటు ప్రతిరోజూ 100 ఫ్రీ ఎస్‌ఎంఎస్‌లు పంపుకునే సదుపాయం కూడా లభిస్తుంది.

Advertisement

Also Read: చాణక్యనీతి.. అమ్మాయిలు ఈ 5 విషయాలు ఇతరులకు చెప్పకూడదు

వారికి ఈ ప్లాన్ బెస్ట్!

ప్రతీ రోజూ అధికమెుత్తంలో డేటాను వినియోగించేవారికి ఈ ప్లాన్ పర్ఫెక్ట్ గా సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ధరలో 90 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 30 రోజుల వాలిడిటీ లభిస్తుండటం అడ్వాంటేజీగా పేర్కొంటున్నారు. అయితే యూజర్లు.. ఈ రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేసుకునేముందు తమ ఏరియాలో బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ లభ్యత, ఇంటర్నెట్ వేగాన్ని సరిచూసుకుంటే బెటర్.

Also Read: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కేస్ ఫైల్.. యువతికి హత్యా బెదిరింపులు!

Tags

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×