E-Paper
Advertisement

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!
Advertisement

Mobile OS Updates: సాధారణం మనం ఫోన్ వాడుతున్నప్పుడు స్క్రీన్ మీద Update Available అని రాగానే.. వెంటనే డౌన్‌లోడ్ నొక్కేస్తుంటాం. ఆ ఒక్క క్లిక్‌తో కొత్త ఫీచర్లు, సెక్యూరిటీ మన ఫోన్‌లోకి వచ్చేస్తాయి. కానీ ఆ చిన్న బటన్ వెనుక నెలల తరబడి సాగే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. డెవలపర్లు, చిప్‌సెట్ కంపెనీలు, ఫోన్ బ్రాండ్లు అందరూ కలిసి పనిచేస్తేనే ఈ అప్‌డేట్ మన మొబైల్‌ దాకా చేరుతుంది.

కోడింగ్ నుండి హార్డ్‌వేర్ వరకు:

మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారీ డెవలపర్లు రాసే కొత్త కోడింగ్‌తో మొదలవుతుంది. అయితే కేవలం సాఫ్ట్‌వేర్ ఉంటే సరిపోదు.. అది ఫోన్‌లోని కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీతో సరిగ్గా కమ్యూనికేట్ అవ్వాలి. అందుకే ప్రాసెసర్ కంపెనీలు ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌కు తగిన డ్రైవర్లను తయారు చేస్తాయి. ఆ తర్వాతే ఫోన్ బ్రాండ్లు తమ సొంత ఫీచర్లను దీనికి జోడించి సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తాయి.

Advertisement

Also Read: ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

పరీక్షలు, నెట్‌వర్క్ తనిఖీలు:

తయారైన సాఫ్ట్‌వేర్‌ను ప్రజల్లోకి వదిలేముందు అనేక రకాల టెస్టింగ్‌లు చేస్తారు. కాలింగ్, వైఫై, ఇంటర్నెట్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని ఇంజనీర్లు పరిశీలిస్తారు. కొంతమంది యూజర్లతో బీటా టెస్టింగ్ చేయించి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. దీనికితోడు నెట్‌వర్క్ కంపెనీలు కూడా తమ సిగ్నల్స్‌కు ఈ అప్‌డేట్ వల్ల ఎలాంటి ఇబ్బంది కలగదని నిర్ధారించుకున్నాకే ముందుకు వెళ్తాయి.

విడతలవారీగా సాగే డిస్ట్రిబ్యూషన్:

Advertisement

అన్ని పరీక్షలు పూర్తయ్యాక కంపెనీలు ఒకేసారి అందరికీ అప్‌డేట్ ఇవ్వవు. ముందుగా కొంతమంది యూజర్లకు మాత్రమే పంపిస్తారు. ఏమైనా తీవ్రమైన బగ్స్ లేదా సమస్యలు బయటపడితే వెంటనే ఆపివేసి సరిచేస్తారు. ప్రతి ఫోన్ మోడల్, ప్రాసెసర్ వేర్వేరుగా ఉండటం వల్ల ఒక్కో బ్రాండ్, ఒక్కో రీజియన్‌కు వేర్వేరు సమయాల్లో ఈ అప్‌డేట్లు అందుతాయి.

ఇన్‌స్టాలేషన్, ఆప్టిమైజేషన్:

మనం డౌన్‌లోడ్ నొక్కినప్పుడు ఫోన్ ఆ ఫైల్ సురక్షితమైనదో కాదో తనిఖీ చేస్తుంది. ఇన్‌స్టాలేషన్ సమయంలో ఫోన్ రీస్టార్ట్ అవుతూ.. సిస్టమ్ ఫైళ్లను అప్‌డేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ పూర్తయ్యాక బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్ అన్నీ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌కు తగ్గట్టు ఆప్టిమైజ్ అవుతాయి. ఆ తర్వాతే మనకు సరికొత్త ఫీచర్లు, మెరుగైన పర్ఫార్మెన్స్ అనుభవంలోకి వస్తాయి.

Also Read: ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

Tags

Related News

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

వాషింగ్ మెషీన్ వాడుతున్నారా? మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే!

Big Stories

Advertisement
×