Android Storage Tips: స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. రోజూ ఎన్నో ఫోటోలు, వీడియోలు తీస్తుంటాం. రకరకాల యాప్‌లు, పాటలు, సినిమాలు డౌన్‌లోడ్ చేస్తూనే ఉంటాం. అయితే ఉన్నట్టుండి ఎప్పుడైనా ఫోన్ స్క్రీన్ మీద Storage Full అని నోటిఫికేషన్ వస్తే చాలా చిరాకు వస్తుంది. ఆ టైంలో ఏదైనా ముఖ్యమైన ఫోటో తీయాలన్నా, కొత్త యాప్ డౌన్‌లోడ్ చేయాలన్నా కుదరదు. ఇలాంటప్పుడు కంగారుపడి మనకిష్టమైన ఫోటోలు, వీడియోలను డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు తెలియకుండానే ఫోన్ స్టోరేజ్‌ను సగం ఆక్రమించే వేస్టేజ్ చాలా ఉంటుంది. కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే.. ఒక్క ఫైల్ కూడా పోకుండా మీ ఫోన్‌లో జీబీల కొద్దీ మెమొరీని ఉచితంగా, వేగంగా ఖాళీ చేసుకోవచ్చు.
మనం ఫోన్‌లో రోజూ వాడని యాప్‌లు చాలా ఉంటాయి. వాటిని పూర్తిగా డిలీట్ చేయకుండా ఆర్కైవ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆటోమేటిక్‌గా ఆర్కైవ్ యాప్స్ ఆప్షన్ ఆన్ చేస్తే చాలు. ఇది మీరు తరచుగా వాడని యాప్‌ల సైజ్‌ను తగ్గించి, మీ డేటాను అలాగే భద్రంగా ఉంచుతుంది. మళ్లీ కావలసినప్పుడు ఒక క్లిక్‌తో ఆ యాప్‌ను రీస్టోర్ చేసుకోవచ్చు.
Also Read: గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?
మన ఫోన్ స్టోరేజ్ త్వరగా నిండిపోవడానికి ముఖ్యమైన కారణం డౌన్‌లోడ్స్ ఫోల్డర్. దాంట్లో ఎప్పుడో చూసిన పీడీఎఫ్‌లు, అక్కర్లేని ఫోటోలు, పెద్ద పెద్ద వీడియోలు ఉండిపోతాయి. అంతేకాకుండా.. యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి యాప్‌లలో ఆఫ్‌లైన్ కోసం డౌన్‌లోడ్ చేసిన వీడియోలు కూడా ఎక్కువ స్పేస్ తింటాయి. కాబట్టి గూగుల్ ఫైల్స్ యాప్‌లోకి వెళ్లి ఈ వేస్ట్ ఫైల్స్ అన్నింటినీ వెంటనే డిలీట్ చేయడం మంచిది.
ఆండ్రాయిడ్ ఫోన్లలో స్మార్ట్ స్టోరేజ్ అనే అద్భుతమైన ఫీచర్ ఉంటుంది. మీ ఫోటోలు, వీడియోలు ఇప్పటికే గూగుల్ ఫోటోస్‌లో బ్యాకప్ అయి ఉంటే.. ఈ ఫీచర్ సహాయంతో ఫోన్ లోకల్ మెమొరీలో ఉన్న ఆ ఫైల్స్‌ను సేఫ్‌గా క్లియర్ చేయవచ్చు. దీనివల్ల మీ మెమోరీస్ ఆన్‌లైన్‌లో భద్రంగా ఉంటాయి. అలాగే ఫోన్ మెమోరీ కూడా చాలా వరకు ఖాళీ అవుతుంది.
ప్రతి యాప్ వాడే కొద్దీ కొంత క్యాషే డేటాను స్టోరేజ్‌లో జమ చేస్తుంది. సెట్టింగ్స్‌లోకి వెళ్లి అనవసరమైన యాప్‌ల క్యాషే క్లియర్ చేస్తే మెమోరీ ఖాళీ అవుతుంది. అయితే క్లియర్ డేటా లేదా క్లియర్ స్టోరేజ్ ఆప్షన్లను చూసి జాగ్రత్తగా వాడాలి. ఈ చిన్న మార్పులు చేస్తే మీ ఫోన్ స్టోరేజ్ సమస్య తీరిపోవడమే కాకుండా ఫోన్ వేగం కూడా పెరుగుతుంది.
Also Read: బ్యాటరీ కింగ్ Vivo Y21 5Gపై ఏకంగా 25,500 తగ్గింపు.. కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి!