E-Paper
Advertisement

Airtel ఆల్‌ రౌండర్ ప్లాన్.. 3 నెలల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ 5G, ఫ్రీగా 20+ ఓటీటీలు!

Airtel ఆల్‌ రౌండర్ ప్లాన్.. 3 నెలల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ 5G, ఫ్రీగా 20+ ఓటీటీలు!
Advertisement

Airtel 979 Plan: ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం ఎన్నో రకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. అయితే అందులో రూ.979 ప్లాన్ బాగా పాపులర్ అయ్యింది. లాంగ్ వ్యాలిడిటీతో పాటు అపరిమిత 5G డేటా, ఫ్రీ ఓటీటీ సబ్ స్క్రిప్షన్లతో ఈ ప్లాన్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్లాన్ కు సంబంధించి పూర్తి వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.

వ్యాలిడిటీ, రోజువారీ డేటా

ఎయిర్‌టెల్ ఈ రూ. 979 ప్లాన్ ను మొత్తం 84 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు ప్రతిరోజూ 2GB హై స్పీడ్ 4G డేటాను పొందుతారు. అంటే 84 రోజుల్లో మొత్తంగా 168GB డేటా లభించనుంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా మాట్లాడుకునేలా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు చేసుకునే వెసులుబాటును ఈ ప్లాన్ కల్పిస్తోంది.

అన్‌లిమిటెడ్ 5G డేటా ఆఫర్

Advertisement

ఈ ప్లాన్ కింద అర్హులైన యూజర్లు అపరిమిత 5G డేటాను సైతం ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోంది. 5G స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తూ ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్ పరిధిలో ఉంటే ఈ ప్లాన్‌తో అపరిమిత 5G డేటాను పొందొచ్చు. డైలీ 2GB లిమిట్‌తో సంబంధం లేకుండా ఉచితంగా అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

ఫ్రీ ఓటీటీ బెనిఫిట్స్

ఈ ప్లాన్ లో మరో ప్రధాన అడ్వాంటేజీగా ఫ్రీ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ నిలుస్తున్నాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే సబ్‌స్క్రిప్షన్ ద్వారా 84 రోజుల పాటు సోనీలివ్, ఆహా, సన్‌నెక్స్ట్, లయన్స్ గేట్ ప్లే, ఫ్యాన్‌కోడ్, సన్‌నెక్స్ట్ సహా 20కి పైగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్‌ను ఫ్రీగా వీక్షించవచ్చు.

అదనపు ప్రయోజనాలు

Advertisement

మరోవైపు ఇదే ప్లాన్ లో మరికొన్ని అడిషనల్ బెనిఫిట్స్ ను సైతం ఎయిర్ టెల్ అందిస్తోంది. కంటెంట్ క్రియేటర్లు, డిజైనింగ్ ప్రియుల కోసం 12 నెలల అడోబ్ ఎక్స్ ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది. అలాగే అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత హెల్త్ కేర్ యాక్సెస్ పొందొచ్చు. దీంతో పాటు నెలకు ఒక సరికొత్త పాటను వింక్ మ్యూజిక్ ద్వారా హలో ట్యూన్‌గా మార్చుకోవచ్చు.

Also Read: స్పేస్‌లోకి 3,301 తేనెటీగలు.. 1984లో నాసా చేసిన ఈ ప్రయోగం చూస్తే.. ఇప్పటికీ గూస్‌బంప్స్ పక్కా!

ఈ ప్లాన్ ఎవరికి లాభం?

పదే పదే రీచార్జ్ చేసుకునే తిప్పలు లేకుండా 3 నెలల పాటు నిరంతర సేవలు కావాలని కోరుకునేవారికి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. అలాగే రోజువారీ డేటాతో పాటు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎక్కువగా చూసే వారికి.. 5G నెట్‌వర్క్ వినియోగదారులకు ఈ రూ. 979 రీచార్జ్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందని చెప్పవచ్చు.

Also Read: కిచెన్‌లో కింగ్ లాంటి టాప్ మైక్రోవేవ్ ఓవెన్లు..అన్ని వంటకాలు చిటికెలో!

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×