E-Paper
Advertisement

గేమర్స్‌కు బంపర్ ఆఫర్.. కొత్త Alienware ల్యాప్‌టాప్ కొంటే రూ.22 వేల మానిటర్ సగం ధరకే!

గేమర్స్‌కు బంపర్ ఆఫర్.. కొత్త Alienware ల్యాప్‌టాప్ కొంటే రూ.22 వేల మానిటర్ సగం ధరకే!
Advertisement

Alienware 15: గేమింగ్ ప్రియుల కోసం డెల్ టెక్నాలజీస్ సరికొత్త ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘ఎలియన్‌వేర్ 15’ పేరుతో విడుదలైన ఈ మోడల్‌ను బ్రాండ్‌లోనే అత్యంత అందుబాటు ధరలో లభించే గేమింగ్ లాప్‌టాప్‌గా కంపెనీ పరిచయం చేసింది. ఇది నోవా బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది. ప్రస్తుతం ఈ లాప్‌టాప్ ప్రీ-ఆర్డర్ల కోసం అందుబాటులో ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, డెల్ అధికారిక వెబ్‌సైట్లతో పాటు డెల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో దీనిని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ డే, ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్స్ సందర్భంగా దీని విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

లాంచింగ్ ఆఫర్లు:

భారత మార్కెట్లో ఈ ఎలియన్‌వేర్ 15 ప్రారంభ ధర రూ.1,15,990గా ఉంది. అయితే లాంచ్ ఆఫర్ కింద ఎంపిక చేసిన బ్యాంక్ లావాదేవీలపై పది శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు గరిష్టంగా రూ.10వేల వరకు ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ లాప్‌టాప్ కొనేవారికి మరో బంపర్ ఆఫర్ కూడా ఉంది. దాదాపు రూ.22,632 విలువైన ఎలియన్‌వేర్ 320హెర్ట్జ్ గేమింగ్ మానిటర్‌ను కేవలం రూ.9,999కే సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: రెడ్ కలర్‌లో Nothing సరికొత్త ఫోన్.. RCB లోగోతో క్రేజీ లుక్.. ఆ ఒక్క స్టోర్‌లోనే లభ్యం!

మెరుగైన పనితీరు:

ఈ లాప్‌టాప్‌లో 15.3 అంగుళాల డబ్ల్యుయుఎక్స్‌జిఏ డిస్‌ప్లేను అందించారు. ఇది 165హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 300 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో గేమింగ్‌కు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ప్రస్తుత మోడల్ ఎఎమ్‌డి రైజెన్ 5, రైజెన్ 7 ప్రాసెసర్లతో పాటు ఎన్విడియా జిఫోర్స్ ఆర్‌టిఎక్స్ 3050 లేదా 4050 గ్రాఫిక్స్ కార్డ్‌తో వస్తోంది. దీనిలో 32GB వరకు ర్యామ్, 1TB ఎస్‌ఎస్‌డి స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. అయితే వచ్చే రోజుల్లో ఇంటెల్ కోర్ ప్రాసెసర్లు, ఎన్విడియా ఆర్‌టిఎక్స్ 5050, 5060 గ్రాఫిక్స్ కార్డ్స్ ఉండే మరికొన్ని ప్రీమియం వేరియంట్లను కూడా లాంచ్ చేయనున్నట్లు డెల్ ప్రకటించింది.

సరికొత్త కూలింగ్ టెక్నాలజీ:

Advertisement

ఎక్కువ సమయం గేమ్స్ ఆడినా ల్యాప్‌టాప్ వేడెక్కకుండా ఉండేందుకు దీనిలో ఎలియన్‌వేర్ క్రయో-టెక్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. ఇది కీబోర్డ్ పైభాగం, కింది భాగం నుండి చల్లటి గాలిని లోపలికి లాక్కొని, వెనుక వైపు నుండి వేడి గాలిని బయటకు పంపుతుంది. అలాగే రాత్రి వేళల్లో ఫ్యాన్ శబ్దం రాకుండా ఉండేందుకు ప్రత్యేకమైన స్టెల్త్ మోడ్‌ను కూడా ఇచ్చారు.

కింద పడినా తట్టుకునేలా:

కనెక్టివిటీ కోసం వై-ఫై 6, బ్లూటూత్, టైప్-సి పోర్టులు ఉన్నాయి. మోడల్‌ను బట్టి 54వాట్ అవర్ లేదా 70వాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో వచ్చే ఈ ల్యాప్‌టాప్.. ఎక్స్‌ప్రెస్ ఛార్జ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. అనుకోకుండా నీళ్లు పడినా, తక్కువ ఎత్తుల నుండి కిందపడినా తట్టుకునేలా దీని బాడీని బలంగా డిజైన్ చేశారు.

Also Read: ఆండ్రాయిడ్ 16, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్.. ఐకూ నుంచి అదిరిపోయే బడ్జెట్ 5G ఫోన్ వచ్చేసింది!

Related News

రూ.6,599కే బెస్ట్ టీవీ..ఆఫర్ పూర్తవకముందే కొనేయండి!

వేల రూపాయల ఫీచర్లు రూ.999కే..ఆఫర్ మాములుగా లేదుగా!

అమెజాన్ సేల్‌లో సగం ధరకే..బ్రాండెడ్ ఫ్రిజ్‌లు, వెంటనే కొనేయండి

రూ.1,500లోపు బెస్ట్ ఇయర్‌బడ్స్..బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ సౌండ్

బ్రాండెడ్ ల్యాప్ టాప్‌పై భారీ డిస్కౌంట్..ఇంతకంటే బెస్ట్ మోడల్ ఉండదు!

తక్కువ కరెంట్ బిల్లుతో అద్భుతమైన కూలింగ్..హయర్ ఫ్రిజ్‌పై భారీ డిస్కౌంట్

రూ.5,999కే వాషింగ్ మెషీన్..ఆఫర్ అంటే ఇలా ఉండాలి!

ఆన్ లైన్‌లో బట్టలు కొనక ముందే.. ఫిట్టింగ్ సరిపోతుందో లేదో ముందే చూసుకోవచ్చు!

Big Stories

Advertisement
×