E-Paper
Advertisement

కిటికీలకు అల్యూమినియం ఫాయిల్.. నిజంగానే ఇల్లు చల్లబడుతుందా? సైన్స్ ఏం చెబుతోంది?

కిటికీలకు అల్యూమినియం ఫాయిల్.. నిజంగానే ఇల్లు చల్లబడుతుందా? సైన్స్ ఏం చెబుతోంది?
Advertisement

Aluminium Foil: సాధారణంగా ఎండలు ఏమాత్రం ముదిరినా.. చాలా మంది వెంటనే ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తుంటారు. దీని వల్ల కొత్తది కొనడానికి రూ.వేలల్లో ఖర్చు కావడంతో పాటు.. నెల చివరి నాటికి కరెంటు బిల్లు సైతం తడిచి మోపెడు అవుతుంది. అయితే ఏసీతో పని లేకుండా కేవలం అల్యూమినియం ఫాయిల్ ను ఉపయోగించి.. ఇంట్లో చల్లగా, హాయిగా ఉండొచ్చని నిపుణలు చెబుతున్నారు. వినడానికి కాస్త వింతగా, జోక్ గా ఉన్నప్పటికీ.. అమెరికా ప్రభుత్వ అత్యవసర నిర్వహణ విభాగం ఏకంగా తన అధికారిక వెబ్ సైట్ లో ఈ చిట్కాను ప్రతిపాదించింది. ఇంతకీ అల్యూమినియం ఫాయిల్ ఏ విధంగా ఉక్కపోతను నియంత్రిస్తుందో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి?

అల్యూమినియం ఫాయిల్ ను కిటికీ అద్దాలకు అంటిచడం ద్వారా గది ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇది అపోహ కాదని.. దీని వెనుక సైన్స్ దాగుందని స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా సూర్యకాంతిలో ఉండే ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్ వల్ల వేడి పుడుతుంది. ఈ వేడి కిటికీ అద్దాల గుండా ఇంట్లోకి ప్రవేశించి లోపలే ఉండటం వల్ల అధిక వేడి, ఉక్కపోత ఫీలింగ్ కలుగుతుంటుంది. అయితే అల్యూమినియం ఫాయిల్ కు ఉన్న మెరిసే గుణం దీనిని అడ్డుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రేడియంట్ ఎనర్జీని (ఉష్ణాన్ని) ఇంట్లోకి రానివ్వకుండా బయటకే పరావర్తనం (Reflect) చేస్తుందని తెలియజేస్తున్నారు.

రేడియేషన్ వేడిని మాత్రమే

Advertisement

అమెరికా ఇంధన శాఖ (డీఓఈ) ప్రకారం.. అల్యూమినియం ఫాయిల్ వంటి రిఫ్లెక్టివ్ మెటీరియల్స్ ఉష్ణాన్ని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. అయితే ఇవి కేవలం రేడియేషన్ ద్వారా వచ్చే వేడిని మాత్రమే అడ్డుగోగలవని డీఓఈ స్పష్టం చేసింది. లీకేజీలు, గోడల ద్వారా వచ్చే వేడిని ఏమాత్రం ఆపలేవని తెలియజేసింది. అయితే గోడలు, టెర్రస్ మీద వేడిని రిఫ్లెక్ట్ చేసే కూల్ పెయింట్ వేయడం వల్ల.. ఇంటిని మరింత చల్లగా ఉంచుకోవచ్చని సూచించింది.

కిటికీలకు ఎలా అంటించాలి?

అయితే కిటికీలకు అల్యూమినియం ఫాయిల్ ను బయటి వైపు అంటించాలా? లోపలి నుంచా? అన్న దానిపై కూడా నిపుణులు క్లారిటీ ఇచ్చారు. కిటికీ బయటి నుంచే ఫాయిల్ అంటిస్తే బెటరని సూచించారు. సూర్యరశ్మి అద్దాన్ని తాకకముందే దాన్ని అడ్డుకోవడం చాలా ముఖ్యమని.. పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఈపీఏ) సైతం స్పష్టం చేసింది.

Advertisement

Also Read: 5G వద్దు.. 4Gనే ముద్దు అనుకునేవారికి.. జియో అదిరిపోయే బడ్జెట్ ప్లాన్స్ ఇవే!

ఏసీలకు సరైన ప్రత్యామ్నాయమా?

అయితే అల్యూమినియం ఫాయిల్ చిట్కా.. ఏసీలకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని నిపుణులు తేల్చేస్తున్నారు. ఇంట్లో ఏసీలు, కూలర్లు లేని వారు.. అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు ఇది చక్కటి మార్గమని పేర్కొంటున్నారు. ఇంట్లోని ఉష్ణోగ్రతను ఫాయిల్ ఏ స్థాయిలో తగ్గించిందని చెప్పేందుకు ఎలాంటి కచ్చితమైన సమాచారం కూడా లేదని.. నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఫాయిల్ అంటించడం ద్వారా గది ఉష్ణోగ్రతలో స్వల్ప మార్పులను గమనించినట్లు యూజర్లు సైతం చెప్పడం గమనార్హం.

Also Read: ఇప్పుడంటే బిర్యానీ ఫేమస్.. పూర్వం హైదరాబాదీలు ఇష్టంగా తిన్న ఫుడ్ ఏది? మీ ఊహకు సైతం అందదు!

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×