E-Paper
Advertisement

5G వద్దు.. 4Gనే ముద్దు అనుకునేవారికి.. జియో అదిరిపోయే బడ్జెట్ ప్లాన్స్ ఇవే!

5G వద్దు.. 4Gనే ముద్దు అనుకునేవారికి.. జియో అదిరిపోయే బడ్జెట్ ప్లాన్స్ ఇవే!
Advertisement

Jio 4G Prepaid Plans: ప్రస్తుతం 5G యుగం నడుస్తోంది. ఇందుకు తగ్గట్లే జియో, ఎయిర్ టెల్, వీఐ వంటి టెలికాం కంపెనీలు.. 5G ప్లాన్స్ ప్రమోట్ చేస్తూ.. ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. అయితే 5Gపై ఆసక్తిలేని వారు.. ఇప్పటికీ 4G ప్రీపెయిడ్ ప్లాన్లపైనే మెుగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారి కోసం రెండు ఆకర్షణీయమైన ప్లాన్లను జియో అందుబాటులో ఉంచింది. ఇంతకీ ఆ బడ్జెట్ ప్లాన్స్ ఏవి? వాటి వల్ల యూజర్లకు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.

జియో రూ. 889 ప్లాన్

జియో ఈ ప్లాన్ ను 84 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. దీనిని రీఛార్జ్ చేసుకుంటే ప్రతీ 1.5GB చొప్పున హై స్పీడ్ 4G డేటా యూజర్లకు పొందొచ్చు. ఒకవేళ డేటా లిమిట్ అయిపోతే.. 64kbps స్పీడ్ తో అన్ లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు. మరోవైపు ఈ ప్లాన్ కింద అపరిమిత ఫ్రీ కాల్స్, రోజుకు 100 SMSలు కూడా యూజర్లకు లభిస్తాయి. అలాగే అడిషనల్ బెనిఫిట్స్ కింద.. జియో సావన్ ప్రో ఫ్రీ సబ్ స్క్రిప్షన్, రూ. 35,100 విలువైన ‘గూగుల్ ఏఐ ప్రో’ ప్లాన్ 18 నెలల పాటు ఫ్రీగా వాడుకోవచ్చు.

జియో రూ. 666 ప్లాన్

Advertisement

దీనిని 70 రోజుల వ్యాలిడిటీతో జియో తీసుకొచ్చింది. ప్రతీ రోజు 1.5GB 4G డేటా, ఫ్రీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను ఈ ప్లాన్ కింద యూజర్లు పొందొచ్చు. ఇక అడిషనల్ బెనిఫిట్స్ విషయానికి వస్తే.. ఇందులో జియో సావన్ ప్రో మ్యూజిక్ సబ్ స్క్రిప్షన్ లేకపోవడం.. మైనస్ గా చెప్పవచ్చు. అయితే 18 నెలల గూగుల్ ఏఐ ప్రో సబ్ స్క్రిప్షన్ ను ఈ ప్లాన్ లోనూ జియో అందిస్తుండటం విశేషం.

Also Read: గోల్కండ కోటలో హిందువులు బోనాలు ఎందుకు చేస్తారో తెలుసా? ఇదే కదా మన దేశం ప్రత్యేకత!

రెండింటిలో ఏది బెస్ట్?

Advertisement

5Gతో పనిలేని వారికి.. జియో ఇస్తున్న ఈ రెండు ప్లాన్లు పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. అయితే అదనపు బెనిఫిట్స్ పరంగా చూస్తే.. రూ.889 ప్లాన్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఇది 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అయితే తక్కువ రోజులైనా పర్లేదు, జియో సావన్ ప్రో సబ్ స్క్రిప్షన్ తో అవసరం లేదనుకుంటే మాత్రం.. హ్యాపీగా రూ. 666 ప్రీపెయిడ్ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్ లోనే ఉండటం వల్ల యూజర్లకు కలిసిరానుంది.

Also Read: ఇప్పుడంటే బిర్యానీ ఫేమస్.. పూర్వం హైదరాబాదీలు ఇష్టంగా తిన్న ఫుడ్ ఏది? మీ ఊహకు సైతం అందదు!

Related News

Incognito Mode వాడుతున్నారా? ఈ ఒక్క తప్పు చేస్తే మీ బ్రౌజింగ్ హిస్టరీ అందరికీ తెలిసిపోతుంది!

కిటికీలకు అల్యూమినియం ఫాయిల్.. నిజంగానే ఇల్లు చల్లబడుతుందా? సైన్స్ ఏం చెబుతోంది?

బల్బు ఆన్ చేస్తే చాలు.. Wi-Fi కంటే 100 రెట్లు వేగంతో ఇంటర్నెట్ ఇచ్చే Li-Fi టెక్నాలజీ!

స్టైలిష్ లుక్, టచ్ కంట్రోల్స్.. ఈ స్మార్ట్ రింగ్ ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు

రూ.30,999 ధరలో.. లగ్జరీ టీవీ, Xiaomi X Pro లేటెస్ట్ మోడల్ పై ఓ లుక్కేయండి!

డిస్కౌంట్‌లో రూ.7,490కే వాషింగ్ మెషీన్.. బడ్జెట్‌లోనే బెస్ట్ ఛాయిస్!

రోబోట్ వాక్యూమ్ కొనాలా? ఇంతకంటే.. బెస్ట్ టైం ఉండదు బాస్

ప్రపంచంలోని ప్రతి అంగుళాన్ని చూపించే Google Maps.. ఆ ప్రాంతాలను మాత్రం ఎందుకు బ్లర్ చేస్తుంది?

Big Stories

Advertisement
×