E-Paper
Advertisement

ఫ్రిజ్ దగ్గర గ్యాస్ సిలిండర్ ఉందా? వెంటనే ఈ తప్పు సరిదిద్దుకోండి!

ఫ్రిజ్ దగ్గర గ్యాస్ సిలిండర్ ఉందా? వెంటనే ఈ తప్పు సరిదిద్దుకోండి!
Advertisement

Placing gas cylinder near fridge: ఇంట్లో కిచెన్ ఎప్పుడూ సేఫ్‌గా ఉండాలి. కానీ స్పేస్ లేదనే.. కారణంతో చాలా మంది రిఫ్రిజిరేటర్ పక్కనే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ను పెట్టేస్తుంటారు. బయటికి ఇది చిన్న విషయంగా అనిపించినా.. దీని వల్ల మీ ప్రాణాలకే ముప్పు వాటిల్లే అతి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఫ్రిజ్ వాడే ప్రతీ ఒక్కరూ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఫ్రిజ్, గ్యాస్ సిలిండర్‌ను పక్క పక్కనే ఉంచడం ఎందుకు ప్రమాదమో ఇప్పుడు తెలుసుకుందాం.

1. హీటింగ్ టెన్షన్.. పేలుడు ప్రమాదం:

ఫ్రిజ్ వెనక భాగంలో కంప్రెసర్ ఉంటుంది. ఇది 24 గంటలూ రన్ అవ్వడం వల్ల ఆ ప్రాంతంలో విపరీతమైన వేడి పుడుతుంది. ఒకవేళ గ్యాస్ సిలిండర్ దానికి ఆనుకుని ఉంటే.. ఆ వేడికి సిలిండర్ లోపలి పీడనం అమాంతం పెరుగుతుంది. సిలిండర్‌పై ఇలాంటి అధిక ఉష్ణోగ్రత తగిలితే క్షణాల్లో పెద్ద పేలుడు జరిగే అవకాశం కూడా ఉంది.

2. గ్యాస్ లీకేజ్.. చిటికెలో షార్ట్ సర్క్యూట్:

Advertisement

కొన్నిసార్లు సిలిండర్ వాల్వ్ లేదా రెగ్యులేటర్ నుంచి మైక్రో లెవెల్‌లో.. గ్యాస్ లీక్ అవుతుంటుంది. గ్యాస్ గాలి కంటే.. బరువుగా ఉండటం వల్ల నేల మీద పరుచుకుంటుంది. ఇదే సమయంలో ఫ్రిజ్‌లోని.. థర్మోస్టాట్ ఆన్/ఆఫ్ అయ్యేటప్పుడు చిన్నపాటి స్పార్క్ వస్తుంది. గ్యాస్ లీకైన గాలికి ఈ చిన్న స్పార్క్ తగిలిందంటే… ఇల్లంతా క్షణాల్లో బూడిదవ్వడానికి ఎంతో సమయం పట్టదు.

3. ఎంత దూరం మెంటైన్ చేయాలి?

వంటగదిలో గ్యాస్ సిలిండర్‌ను.. ఎప్పుడూ స్టవ్‌కు మరియు ఫ్రిజ్, మైక్రోవేవ్ ఓవెన్ వంటి ఎలక్ట్రిక్ గాడ్జెట్లకు దూరంగా ఉంచాలి. అందుకే.. ఫ్రిజ్‌కు, సిలిండర్‌కు మధ్య కనీసం 3 నుంచి 4 అడుగుల సేఫ్ దూరం ఉండేలా.. ప్లాన్ చేసుకోండి.అలాగే సిలిండర్‌ను ఎల్లప్పుడూ చల్లని, గాలి బాగా ఆడే నేల మీద మాత్రమే నిటారుగా ఉంచాలి.

Advertisement

Also Read: లేటెస్ట్ వాషింగ్ మెషీన్లు..ఆటో రీస్టార్ట్ ఫీచర్‌తో అదుర్స్!

4. సేఫ్టీ కోసం బెస్ట్ గ్యాడ్జెట్స్ & వాటి ధరలు:

వంటగదిలో ఇలాంటి రిస్క్‌లను ముందే పసిగట్టి అలర్ట్ అయ్యేందుకు కొన్ని అద్భుతమైన సేఫ్టీ పరికరాలు మార్కెట్లో ట్రెండ్‌లో ఉన్నాయి.

గ్యాస్ లీకేజ్ డిటెక్టర్ అలారం : గ్యాస్ లీక్ కాగానే పెద్ద శబ్దంతో అలారం మోగించే ఈ డిటెక్టర్ ధర సుమారు రూ. 600 నుండి రూ. 1,500 వరకు ఉంది.

ఫైర్ ఎక్స్టింగ్విషర్ : చిన్నపాటి అగ్నిప్రమాదాలను ఇప్పుడే కంట్రోల్ చేయడానికి 2 కేజీల సిలిండర్ ధర సుమారు రూ. 1,200 నుంచి రూ. 2,000 వరకు లభిస్తుంది.

ఆటోమేటిక్ గ్యాస్ షట్-ఆఫ్ వాల్వ్: గ్యాస్ లీక్ అయిన వెంటనే సప్లై ఆటోమేటిక్‌గా కట్ చేసే ఈ సేఫ్టీ వాల్వ్ ధర సుమారు రూ. 800 నుంచి రూ. 1,500 వరకు ఉంటుంది.

చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి. మీ కిచెన్‌లో గనక ఫ్రిజ్ పక్కనే గ్యాస్ సిలిండర్ ఉంటే.. ఇప్పుడే దాన్ని సేఫ్ డిస్టెన్స్‌కి మార్చండి. మీ ఫ్యామిలీ సేఫ్టీనే మన ఫస్ట్ ప్రయారిటీ అని గుర్తుంచుకోండి !

Related News

వింటర్ వచ్చేసింది..గీజర్ సర్వీసింగ్ చేయించకుండా ఆన్ చేస్తే భారీ మూల్యం తప్పదు!

పాటలు వినొచ్చు, ఫోన్ కాల్స్ మాట్లాడొచ్చు.. హ్యాండ్స్‌ఫ్రీ ఎక్స్‌పీరియన్స్‌తో శాంసంగ్ ఏఐ గ్లాసెస్!

నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?ఇంట్లోనే ఇలా రీసెట్ చేసుకోండి!

సంచలనం సృష్టిస్తున్న Google Pixel 11a లీక్స్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

ఎయిర్‌టెల్ vs వీఐ.. ఒకే ధరకు రూ.3,999 వార్షిక ప్లాన్.. ఏది రీఛార్జ్ చేస్తే ఎక్కువ బెనిఫిట్?

BSNL సంచలన ఆఫర్.. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్లతో ఉచితంగా ఇన్సూరెన్స్.. పూర్తి వివరాలు ఇవే!

కాలేజ్ స్టూడెంట్స్ కోసం బెస్ట్ బడ్జెట్ ల్యాప్‌టాప్స్.. ఏది కొంటే బెటర్?

Big Stories

Advertisement
×