E-Paper
Advertisement

ఇస్త్రీ బల్లపై అల్యూమినియం ఫాయిల్.. తర్వాత జరిగే మ్యాజిక్ చూస్తే ఆశ్చర్యమే!

ఇస్త్రీ బల్లపై అల్యూమినియం ఫాయిల్.. తర్వాత జరిగే మ్యాజిక్ చూస్తే ఆశ్చర్యమే!
Advertisement

Ironing Trick: రోజూవారీ పనుల్లో సమయాన్ని, శ్రమను ఆదా చేసుకునేందుకు చాలా మంది రకరకాల చిట్కాలను పాటిస్తుంటారు. అందులో భాగంగా ఇటీవల కాలంలో చాలామంది అనుసరిస్తున్న ఒక వినూత్నమైన ట్రిక్.. ఇస్త్రీ బల్ల (ఐరనింగ్ బోర్డ్)పై అల్యూమినియం ఫాయిల్. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా.. ఈ చిన్న చిట్కాతో ఇస్త్రీ చేయడం చాలా ఈజీ అయిపోతోందని గృహిణులు, ఉద్యోగులు చెబుతున్నారు.

ఈ ట్రిక్ ఎలా పనిచేస్తుంది?

సాధారణంగా మనం దుస్తులను ఇస్త్రీ చేస్తున్నప్పుడు.. ఐరన్ బాక్స్ నుండి వచ్చే వేడి బట్టల గుండా వెళ్లి కవర్ ద్వారా కింద ఉన్న బోర్డ్‌కు చేరుకుంటుంది. కానీ ఇస్త్రీ బల్ల కవర్ కింద అల్యూమినియం ఫోయిల్‌ను అమర్చినప్పుడు.. అది ఒక ‘రిఫ్లెక్టర్’ లా పనిచేస్తుంది. అంటే ఐరన్ బాక్స్ నుండి వచ్చే వేడిని ఫాయిల్ తిరిగి దుస్తుల వైపునకు ప్రతిబింబిస్తుంది. దీనివల్ల బట్టల పైభాగంతో పాటు కింది భాగం కూడా ఒకేసారి వేడెక్కి.. ఐరన్ అవుతుందని చిట్కా ఫాలో అవుతున్నవారు చెబుతున్నారు.

ఫాయిల్ వల్ల బెనిఫిట్స్

Advertisement

ఐరన్ చేసేటప్పుడు అల్యూమినియం ఫాయిల్ వినియోగించడం వల్ల బట్టలను రెండు వైపులా తిప్పి ఇస్త్రీ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవైపు ఇస్త్రీ చేస్తే.. ఫాయిల్ వల్ల వేడి రిఫ్లెక్ట్ అయ్యి రెండో వైపు కూడా ఐరన్ అయిపోతుంది. దీనివల్ల సమయంతో పాటు, శ్రమ ఆదా కానుంది. అంతేకాదు దుస్తులను రెండోవైపు ఐరన్ చేయాల్సిన అవసరం లేకపోవడం వల్ల విద్యుత్ ను సైతం ఆదా చేసినవారవుతారు. కాటన్ జీన్స్, ఎక్కువ నలిగిపోయిన బట్టలపై ఉన్న మొండి మడతలు కూడా ఫోయిల్ అందించే డబుల్ హీట్ వల్ల చాలా ఫాస్ట్ తొలగిపోనున్నాయి.

Also Read: ఇది కలా? నిజమా?.. కళ్లు లేకపోయినా చూడొచ్చట.. మస్క్ కొత్త ‘చిప్’ మాయాజాలం!

ఈ చిట్కా ఎలా పాటించాలి?

Advertisement

ఈ చిన్న చిట్కాను పాటించడం ఎంతో ఈజీ. ముందుగా ఐరనింగ్ బోర్డ్ ఉపరితలంపై మెరిసే వైపు పైకి ఉండేలా అల్యూమినియం ఫాయిల్‌ను పరవండి. మడతలు లేకుండా సమానంగా సర్దిన తర్వాత.. దానిపై మళ్లీ ఐరనింగ్ బోర్డ్ కవర్‌ను తొడిగేయండి. ఆపై ఇస్త్రీ చేయడం ప్రారంభిస్తే.. తక్కువ శ్రమతో, తక్కువ సమయంలో దుస్తులను పర్ఫెక్ట్ గా ఐరన్ చేసుకోవచ్చు.

Also Read: BSNL రూ. 485 vs Jio రూ. 749.. 72 రోజుల వ్యాలిడిటీ.. సామాన్యులకు ఏ ప్లాన్ బెస్ట్?

Tags

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×