E-Paper
Advertisement

ఎండ తగిలితే చాలు ఛార్జ్ అయిపోతుంది! ఏకంగా 51 రోజుల బ్యాటరీతో Amazfit T Rex Dual Solar లాంచ్!

ఎండ తగిలితే చాలు ఛార్జ్ అయిపోతుంది! ఏకంగా 51 రోజుల బ్యాటరీతో Amazfit T Rex Dual Solar లాంచ్!
Advertisement

Amazfit T Rex Dual Solar: అవుట్‌డోర్ అడ్వెంచర్లు, ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉన్నవారికి ప్రముఖ అమేజ్‌ఫిట్ కంపెనీ సరికొత్త రగ్గడ్ స్మార్ట్‌వాచ్‌ను పరిచయం చేసింది. ‘టీ-రెక్స్ డ్యూయల్ సోలార్’ పేరుతో వచ్చిన ఈ వాచ్‌లో భారీ బ్యాటరీ బ్యాకప్‌తో పాటు కఠినమైన పరిస్థితులను తట్టుకునే బిల్డ్‌ను అందించారు. ముఖ్యంగా తరచూ ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా డ్యూయల్ సోలార్ టెక్నాలజీని ఇందులో తీసుకొచ్చారు.

డ్యూయల్ సోలార్ ఛార్జింగ్..

ఈ వాచ్‌లో 660mah బ్యాటరీ ఉంది. సాధారణ వినియోగంలో ఎలాంటి సూర్యకాంతి సహాయం లేకుండానే 21 రోజుల వరకు బ్యాటరీ పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. రోజుకు కనీసం 3 గంటలు ఎండలో ఉంటే సోలార్ ఛార్జింగ్‌తో బ్యాటరీ లైఫ్ 34 రోజులకు పెరుగుతుంది. రెండు వైపులా ఉన్న సోలార్ ప్యానెల్స్‌కు సరిపడా సూర్యకాంతి అందితే 51 రోజుల వరకు ఛార్జింగ్ అవసరం ఉండదని అమేజ్‌ఫిట్ వెల్లడించింది.

Advertisement

Also Read: ఎవరైనా మీ పేరు పిలిస్తే ఐఫోన్ అలర్ట్ చేస్తుంది.. ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?

బ్రైట్ స్క్రీన్, రగ్గడ్ బాడీ..

T Rex Dual Solar సోలార్‌లో 1.32 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 3,000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అందువల్ల ఎండలోనూ స్క్రీన్‌ను సులభంగా చూడొచ్చు. డిస్‌ప్లే రక్షణ కోసం సఫైర్ గ్లాస్‌ను ఉపయోగించారు. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ వాచ్‌ను ఉపయోగించేలా రగ్గడ్ డిజైన్ ఇచ్చారు. చీకటిలో అవసరమైనప్పుడు ఉపయోగించేందుకు ఇన్‌బిల్ట్ LED ఫ్లాష్‌లైట్ కూడా ఉంది.

ఫిట్‌నెస్, వాటర్ రెసిస్టెన్స్..

Advertisement

ఫిట్‌నెస్ ప్రియుల కోసం 180కి పైగా వర్కౌట్ మోడ్‌లను ఇందులో అందించారు. 10ATM వాటర్ రెసిస్టెన్స్ ఉండటంతో స్విమ్మింగ్, వాటర్ స్పోర్ట్స్ సమయంలోనూ వాడుకోవచ్చు. అదనంగా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉండటంతో స్మార్ట్‌ఫోన్‌ను ప్రతిసారీ చేతిలోకి తీసుకోకుండానే కాల్స్ మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఫీచర్లతో ఎక్కువగా ప్రయాణించే, అవుట్‌డోర్ యాక్టివిటీలను ఇష్టపడే వారికి ఈ వాచ్ బెస్ట్ ఆప్షన్‌.

ధర ఎంతంటే?

ప్రస్తుతం బసాల్ట్ బ్లాక్ కలర్‌లో సిలికాన్ స్ట్రాప్‌తో అమెరికా మార్కెట్‌లో T Rex Dual Solar వాచ్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.57,000గా ఉంది. అయితే భారత్‌లో పన్నులు, ఇతర ఛార్జీల కారణంగా తుది ధర మారవచ్చు. దేశీయ మార్కెట్‌లో లాంచ్ తేదీ, అధికారిక ధరను అమేజ్‌ఫిట్ ఇంకా వెల్లడించలేదు. ఈ వాచ్ భారత్‌కు వచ్చినప్పుడు ధర, లభ్యత వివరాలు స్పష్టంగా తెలియనున్నాయి.

Also Read: అమెజాన్ సేల్ వచ్చేస్తోంది భయ్యో.. ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా తగ్గే అవకాశం!

Tags

Related News

ఐఫోన్ డ్యూయో కంటే తక్కువ ధరకే అద్భుతమైన ఫోల్డబుల్ ఫోన్లు.. ఇవే ఆ 4 మోడల్స్!

750+ సిబిల్ స్కోర్ సీక్రెట్..బ్యాంకులు రిజెక్ట్ చేయకుండా ఉండాలంటే ఈ 3 రూల్స్ మస్ట్!

వ్యాక్యూమ్, మాప్, బ్లోయర్.. మూడు పనులు చేసే ఈ గ్యాడ్జెట్ ధర రూ.4,099 మాత్రమే!

ఫెస్టివల్ సేల్స్‌లో మోసపోకండి..ఆన్‌లైన్ షాపింగ్ చేసే ముందు ఈ విషయాలు మర్చిపోవద్దు!

అమెజాన్ సేల్ వచ్చేస్తోంది భయ్యో.. ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా తగ్గే అవకాశం!

హెడ్‌ఫోన్స్‌ను ఇలా కూడా మార్చుకోవచ్చా? Beats 360లో అదిరిపోయే ఫీచర్లు.. ధర ఎంతంటే?

AI మెమరీతో కొత్త స్మార్ట్ గ్లాసెస్.. కెమెరా, స్క్రీన్ లేకుండానే ఎలా పనిచేస్తాయంటే?

Big Stories

Advertisement
×