Washing machine deals Amazon Flipkart: ఇంట్లో బట్టలు ఉతకడం అంటే.. ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది. కానీ కాలం మారింది. ఇప్పుడు టెక్నాలజీ మన పనులను ఎంతో ఈజీ చేసింది. రోజూ ఆఫీసులు, పనులతో బిజీగా ఉండే వాళ్లకు వాషింగ్ మెషీన్ అనేది ఇప్పుడు లగ్జరీ కాదు, ప్రతి ఇంటా నిత్యవసర వస్తువుగా మారిపోయింది. మీరు కూడా కొత్తగా వాషింగ్ మెషీన్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్! ప్రస్తుతం ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ సేల్స్ గ్రాండ్‌గా ప్రారంభమయ్యాయి. ఎల్‌జీ, సమ్‌సంగ్ వంటి బ్రాండ్లపై భారీ తగ్గింపులు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్ వస్తుంది, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మోడల్ చిన్న,మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు పెర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులో.. ఇన్ బిల్ట్ హీటర్, 6 మోషన్ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ ఉన్నాయి. బట్టలపై.. ఉన్న మొండి మురికిని ఈజీగా వదిలించడంతో పాటు తక్కువ సౌండ్ చేస్తుంది. ఈ సేల్‌లో దీని ధర దాదాపు రూ.26,490 నుంచి లభిస్తోంది.
సమ్‌సంగ్ బ్రాండ్‌లో లభించే ఈ టాప్ లోడ్ మెషీన్ ఎకోబబుల్ టెక్నాలజీతో వస్తుంది. ఇది తక్కువ నీటితో.. తక్కువ పవర్‌తో బట్టలను అద్భుతంగా ఉతుకుతుంది. డిజిటల్ ఇన్వెర్టర్ మోటార్ దీని ప్రత్యేకత. అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో ఇది సుమారు రూ.15,240 ధరలో అందుబాటులో ఉంది.
పెద్ద కుటుంబాలకు లేదా ఎక్కువ బట్టలు ఉతికే వారికి ఇది మంచి ఆప్షన్. వై-ఫై ఎనేబుల్ అయి ఉండటం వల్ల స్మార్ట్‌ఫోన్ ద్వారా కూడా దీన్ని రిమోట్‌గా ఆపరేట్ చేయెచ్చు. స్టీమ్ వాష్ ఫీచర్ జెర్మ్స్, అలర్జెన్స్ తొలగిస్తుంది. దీని సేల్ ధర సుమారు రూ.36,490 వరకు ఉంది.
Also Read: రూ.799కే బోట్ సౌండ్‌బార్..దీని ముందు హోం థియేటర్ బలాదూర్
అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కోరుకునే.. వారికి ఇది అద్భుతమైన ఛాయిస్. ఏఐ కంట్రోల్ మీ వాషింగ్ అలవాట్లను గుర్తు పెట్టుకుని తగిన సైకిల్‌ను సూచిస్తుంది. ఈ ప్రీమియం మోడల్ ధర సేల్‌లో సుమారు రూ.30,240 నుంచి ప్రారంభమవుతోంది.
హార్డ్ వాటర్ సమస్య ఉన్నవారికి విర్ల్‌పూల్ బ్రాండ్ మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇన్‌బిల్ట్ హీటర్ ,జెడ్పీఎఫ్ టెక్నాలజీ తక్కువ నీటి ఒత్తిడిలోనూ టబ్‌ను వేగంగా నింపుతాయి. ఈ మోడల్ ధర సుమారు రూ.15,400 నుంచి అందుబాటులో ఉంది.
మీరు వాషింగ్ మెషీన్ కొనాలని చూస్తున్నట్లయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో వచ్చే బ్యాంక్ డిస్కౌంట్లను ఉపయోగించుకోవడం ద్వారా వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. కొనే ముందు మీ కుటుంబ సభ్యుల సంఖ్య, అవసరానికి తగిన కెపాసిటీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. సేల్ ముగిసేలోపు మంచి డీల్‌ను సొంతం చేసుకోండి!