E-Paper
Advertisement

రూ.799కే బోట్ సౌండ్‌బార్..దీని ముందు హోం థియేటర్ బలాదూర్

రూ.799కే బోట్ సౌండ్‌బార్..దీని ముందు హోం థియేటర్ బలాదూర్
Advertisement

BoAt Aavante Bar 490 review:  తక్కువ బడ్జెట్‌లో అదిరి పోయే మ్యూజిక్ ఫీల్ కోరుకునే వారికి ప్రముఖ ఆడియో బ్రాండ్ ‘బోట్’ మరో అద్భుతమైన ప్రొడక్ట్‌ను అందించింది. అదే బోట్ అవాంటే బార్ 490. కేవలం రూ. 799ధరకే లభిస్తున్న ఈ పోర్టబుల్ సౌండ్‌ బార్ 10W సిగ్నేచర్ సౌండ్ , డ్యూయల్ ఫుల్-రేంజ్ డ్రైవర్లతో మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. చిన్న పార్టీలు, ఎంటర్‌ టైన్‌మెంట్ కోసం పర్ఫెక్ట్‌గా సరి పోయే ఈ స్పీకర్ అద్భుతమైన సౌండ్ అందిస్తుంది. వేలకు వేలు ఖర్చు చేసి కొన్ని మోడల్స్ కూడా దీని సౌండ్ ముందు బలాదూర్ అని చెప్పొచ్చు. ఈ గాడ్జెట్ ధర, ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

1. కాంపాక్ట్ డిజైన్,లుక్స్:

ఈ సౌండ్‌ బార్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, కాంపాక్ట్‌గా ఉంటుంది. న్ని ఎక్కడికైనా ఈజీగా బ్యాగ్ లో వే సుకుని తీసుకెళ్లొచ్చు . దీని మినిమలిస్టిక్ డిజైన్ మీ టేబుల్ లేదా టీవీ స్టాండ్‌కు మంచి లుక్‌ని ఇస్తుంది. అంతే కాకుండా మెటీరియల్ క్వాలిటీ కూడా ధర రూ. 799 కి తగ్గట్టుగా ఉంటుంది.

2. 10W RMS సిగ్నేచర్ సౌండ్ ,డ్రైవర్లు:

Advertisement

ఈ చిన్న సైజు స్పీకర్ బేస్ విషయంలో మాత్రం తక్కువ కాదు! ఇందులో 10W RMS పవర్ అవుట్‌పుట్, డ్యూయల్ ఫుల్-రేంజ్ డ్రైవర్లు దీనిలో ఉన్నాయి. బోట్ సిగ్నేచర్ సౌండ్ టెక్నాలజీ తో ఇది రావడం వల్ల పాటల్లోని బేస్ , క్రిస్టల్ క్లియర్ వోకల్స్ చక్కగా వినబడతాయి. చిన్న రూమ్‌లో మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి ఇది సరిగ్గా సరిపోతుంది.

3. కనెక్టివిటీ ఆప్షన్లు:

ఈ ప్రైస్ రేంజ్‌లో ఎక్కవ కనెక్టివిటీ ఆప్షన్లు ఉండటం దీని ప్రత్యేకత. ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ సపోర్ట్ ఉంది, దీని వల్ల ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌కు క్షణాల్లో కనెక్ట్ అవుతుంది. బ్లూటూత్‌తో .. పాటు USB పోర్ట్, AUX కేబుల్ ,ఇన్-బిల్ట్ ఎఫ్ఎం (FM) రేడియో సపోర్ట్ కూడా ఉంది.కాబట్టి మీ దగ్గర పెన్ డ్రైవ్ ఉన్నా నేరుగా పాటలు ప్లే చేసుకోవచ్చు.

Advertisement

Also Read: టెక్కీలకు పండగే.. ఒకేసారి మల్టిపుల్ డివైజ్ ఛార్జ్ చేసే షావోమి పవర్ బ్యాంక్!

4. బ్యాటరీ లైఫ్,ఛార్జింగ్:

ఇది కేవలం వైర్డు సౌండ్‌బార్ మాత్రమే కాదు..ఇన్-బిల్ట్ బ్యాటరీతో పని చేసే వైర్‌ లెస్ స్పీకర్ కూడా! ఇందులో 1200mAh బ్యాటరీ ఉంటుంది. ఒక్క సారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 7 గంటల వరకు మ్యూజిక్ వినొచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు లేదా కరెంట్ లేనప్పుడు కూడా ఇది నాన్‌ స్టాప్ ఎంటర్‌ టైన్‌మెంట్‌ను ఇస్తుంది. దీంతో పాటు బిల్ట్-ఇన్ మైక్రో ఫోన్ ఉండటంతో హ్యాండ్స్-ఫ్రీ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు.

ధర :

ఈ బోట్ అవాంటే బార్ 490 అసలు ధర మార్కెట్లో రూ.3,490 వరకు ఉండగా..ప్రస్తుతం వివిధ ఆన్‌లైన్ సేల్స్ , బోట్ అధికారిక వెబ్‌సైట్‌లో భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ.799 కే అందుబాటులో ఉంది.

కేవలం వేయి రూపాయల బడ్జెట్‌లో మంచి లుక్, వైర్‌లెస్ పోర్టబిలిటీ , డీసెంట్ సౌండ్ క్వాలిటీ కోరుకునే వారికి బోట్ అవాంటే బార్ 490 ఒక బెస్ట్ అండ్ వర్త్ వైల్డ్ ఛాయిస్ అని చెప్పొచ్చు! ఇంకెందుకు ఆలస్యం ఆఫర్ ఫ్రైజ్ లోనే ఈ స్పీకర్ ఇంటికి తెచ్చేసుకోండి.

Related News

క్యూఆర్ కోడ్ వైపు చూస్తే చాలు.. జియో ఏఐ గ్లాసెస్‌తో పేమెంట్స్ సక్సెస్!

డిస్‌ప్లే ఇయర్‌బడ్స్ చూశారా?మార్కెట్‌లో జెబీఎల్ లైవ్ బీమ్ 4 లాంచ్

పార్టీ లవర్స్ కోసం JBL కొత్త పార్టీబాక్స్ స్పీకర్లు.. 18 గంటల బ్యాటరీ, AI కారోకే మైక్స్‌తో లాంచ్!

టెక్కీలకు పండగే.. ఒకేసారి మల్టిపుల్ డివైజ్ ఛార్జ్ చేసే షావోమి పవర్ బ్యాంక్!

ఫోన్ అప్‌డేట్ చేయకపోతే వాట్సప్ గోవిందా.. సీక్రెట్‌గా టెస్టింగ్ మొదలుపెట్టిన మెటా సంస్థ!

అమెజాన్ పండగు సేల్ షురూ.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కళ్లుచేదిరే డిస్కౌంట్లు!

కిడ్స్ సేఫ్టీ కోసం మెటా మాస్టర్ ప్లాన్..హానికరమైన లింక్స్, ఫేక్ యాడ్స్ మాయం!

Big Stories

Advertisement
×