Dinesh Karthik On Sanju vs Vaibhav: టీమిండియా టీ20 జట్టులో సంజు శాంసన్ కు చాన్సులు తక్కువైపోతున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో టీమిండియాను గెలిపించిన సంజు శాంసన్ ను కాదని వైభవ్ సూర్యవంశీకి గౌతమ్ గంభీర్ ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నట్టు చర్చ జరుగుతోంది. మాజీ క్రికెటర్లు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే వైభవ్ సూర్యవంశీని పక్కకు పెట్టి, సంజు శాంసన్ ను ఓపెనర్ గా బరిలో దింపాలని దినేష్ కార్తీక్ కోరారు. లేకపోతే, సంజు శాంసన్ కెరీర్ నాశనం అవుతుందని ఫైర్ అయ్యారు.
సంజుపై కోపంతో గౌతమ్ గంభీర్ ఇలా వ్యవహరిస్తోన్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని డీకే మండిపడ్డారు. వైభవ్ సూర్యవంశీ మరో 20 ఏళ్లు టీమిండియాలో కొనసాగే చాన్స్ ఉందని, కానీ సంజుకు మరో రెండు లేదా మూడేళ్లు మాత్రం అవకాశాలు ఉంటాయన్నారు. 31 ఏళ్లు ఉన్న సంజుకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చి, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలా కాదని సంజు శాంసన్ జోలికి వస్తే తాట తీస్తానని హెచ్చరించారు. హెడ్ కోచ్ పదవి చేతకాకపోతే తప్పుకోవాలంటూ గంభీర్ కు వార్నింగ్ ఇచ్చారు. దీంతో గంభీర్ పై దినేష్ కార్తిక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని భవిష్యత్తులో టీమిండియా కోసం వాడుకోవాలని గంభీర్ కు సూచనలు చేశారు దినేష్ కార్తిక్. అతనికి మంచి ఫ్యూచర్ ఉందని తెలిపారు. ప్రమాదకరంగా ఆడతాడని తెలిపారు. కానీ ఇప్పుడు వైభవ్ పై ఒత్తిడి పెట్టి, ఓపెనర్ గా పంపించకూడదని కోరారు. దాని వల్ల అతని కెరీర్ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. మరో మూడేళ్ల తర్వాత వైభవ్ పై ఒత్తిడి పెడితే తట్టుకుంటాడని, అప్పటి వరకు అతన్ని ఫ్రీగా వదిలేయాలని సూచనలు చేశారు. 3 ఏళ్ల తర్వాత వైభవ్ ను ఎవడూ ఆపలేడని అంచనా వేశారు.
కానీ అనవసరంగా 15 ఏళ్ల వైభవ్ కోసం సంజు శాంసన్ కెరీర్ నాశనం చేస్తున్నట్టు మండిపడ్డారు. కేవలం వైభవ్ సూర్యవంశీ కోసం సంజును పక్కకు పెట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదని ఫైర్ అయ్యారు. అలాంటి ఏ హెడ్ కోచ్ చేయడంటూ గంభీర్ పై మండిపడ్డారు. వీలైనన్ని అవకాశాలు సంజు శాంసన్ కు ఇవ్వాలని కోరారు. దీంతో దినేష్ కార్తిక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా, ఇవాళ జరిగే టీమిండియా, విండీస్ టీ20 సందర్భంగా వైభవ్ ఓపెనర్ గా వచ్చే ఛాన్సులు కన్పిస్తున్నాయి. సంజును పక్కకు పెడతారని సమాచారం.