E-Paper
Advertisement

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026..ఈ 5 మోడల్స్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్ !

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026..ఈ 5 మోడల్స్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్ !
Advertisement

Amazon Great Freedom Sale 2026 mobile deals: కొత్త స్మార్ట్‌ ఫోన్ కొనాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్! ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026’ ను తీసుకొస్తోంది. ఈ సేల్‌లో భాగంగా చాలా మోడల్స్ డిస్కౌంట్ లో సొంతం చేసుకోవచ్చు. మార్కెట్లో దుమ్మురేపుతున్న టాప్-5 స్మార్ట్‌ మోడల్స్ పై కూడా ఊహించని డిస్కౌంట్లు లభించనున్నాయి.

 టాప్ 5 మోడల్స్ పై.. భారీ డిస్కౌంట్:

1. ఆపిల్ ఐఫోన్ (Apple iPhone Series):

మనలో చాలా మందికి ఐఫోన్ కొనాలనే కల ఉంటుంది. కానీ.. దాని ధర కాస్త ఎక్కువగా ఉండటంతో వెనకడుగు వేస్తుంటాం. కానీ ఈ అమెజాన్ సేల్‌లో ఐఫోన్ లేటెస్ట్, ప్రీవియస్ మోడల్స్‌పై భారీ ప్రైస్ కట్ ఉండనుంది. బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ అన్నీ కలుపుకుంటే.. మీరు ఎంతో ఆశపడిన ఐఫోన్‌ను ఊహించని బడ్జెట్‌లో సొంతం చేసుకోవచ్చు. దీని అసలు మార్కెట్ ధర రూ. 65,000 నుంచి ప్రారంభం కాగా.. సేల్ లో రూ.50,000 లోపు లేదా ఆఫర్లతో మరింత తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది.

2. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు (OnePlus 5G Phones):

Advertisement

స్పీడ్, కెమెరా పర్ఫార్మెన్స్ లో వన్‌ప్లస్ ఫోన్లకు ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా యూత్ ఈ బ్రాండ్ మొబైల్స్ కొనేందుకు ఎంతో ఆసక్తి చూపుతారు. వన్‌ప్లస్ నార్డ్ సిరీస్, ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌పై అమెజాన్ ఈ సేల్‌లో ప్రత్యేక కూపన్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఇఎంఐ ఆప్షన్లను ప్రకటిస్తోంది. సాధారణంగా రూ.30,000 నుంచి రూ. 40,000 ఉండే ఈ ఫోన్లు సేల్ సమయంలో రూ.25,000 బడ్జెట్‌లోనే కొనొచ్చు.

3. శామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ (Samsung Galaxy Series):

బ్రాండ్ వాల్యూకి మారుపేరైన శామ్‌సంగ్ గెలాక్సీ ఏ (Galaxy A), ఎస్ (Galaxy S) సిరీస్ ఫోన్లపై ఈ సేల్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు వస్తున్నాయి. అద్భుతమైన కెమెరా క్వాలిటీ, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కోరుకునే వారికి శామ్‌సంగ్ బెస్ట్ ఛాయిస్. ఈ సేల్ సందర్భంగా రూ.25,000 విలువైన శామ్‌సంగ్ 5జీ ఫోన్ సుమారు రూ. 19,000 నుంచి రూ. 21,000 ధరలలో లభించేలా డిస్కౌంట్ లు ఉండనున్నాయి.

4. రెడ్మి / షియోమి ఫోన్లు (Redmi / Xiaomi 5G Phones):

Advertisement

తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు అందించడంలో రెడ్మి ఎప్పుడూ ముందుంటుంది. మిడిల్ క్లాస్ బడ్జెట్‌కు సరిగ్గా సరిపోయే.. ఈ ఫోన్లపై అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌లో భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.రూ.15,000 నుంచి రూ.20,000 లోపు ధర ఉండే బెస్ట్ 5జీ రెడ్మి ఫోన్లు బ్యాంకు డిస్కౌంట్లతో మరింత తక్కువ ధరకు, అంటే.. సుమారు రూ.12,000 కే మీ చేతికి అందే ఛాన్స్ ఉంది.

Also Read: చిన్న టీవీలతో విసిగిపోయారా? ఈ ప్రొజెక్టర్ ఉంటే..ఇల్లే థియేటర్ అయిపోద్ది!

5. రియల్ మీ స్మార్ట్‌ఫోన్లు (Realme 5G Phones):

స్టైలిష్ డిజైన్, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో యూత్ ను ఆకట్టుకుంటున్న రియల్ మీ ఫోన్లు కూడా ఈ లిస్ట్‌లో ముందున్నాయి. గేమింగ్ ఫొటోగ్రాఫీ ప్రియుల కోసం రియల్ మీ తీసుకొచ్చిన వివిధ మోడల్స్‌పై రూ.3,000 నుంచి రూ. 6,000 వరకు నేరుగా డిస్కౌంట్ లభించనుంది. రూ. 18,000 ధర గల రియల్ మీ ఫోన్ ఈ సేల్ లో కేవలం రూ. 14,000 ధరకే కొనొచ్చు.

కొత్త ఫోన్ కొనాలనుకొని బడ్జెట్ సరిపోక.. ఆగిపోయిన వారికి ‘అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026’ ఒక చక్కటి అవకాశం. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను సరిగ్గా వాడుకుంటే మీరు అనుకున్న ఫోన్‌ను చాలా తక్కువ ధరకే సేల్ లో దక్కించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీ డ్రీమ్ మొబైల్ ను విష్‌లిస్ట్ లో చేర్చుకుని ఈ సేల్ కోసం సిద్ధంగా ఉండండి!

Related News

తప్పు నంబర్‌కు రీఛార్జ్ చేశారా? టెన్షన్ వద్దు.. ఇలా చేస్తే డబ్బు రిఫండ్!

భారీ బ్యాటరీ, ఉచితంగా క్లౌడ్ స్టోరేజ్.. భారత్‌లో విడుదలైన Vivo S2 ఫోన్ పూర్తి వివరాలు!

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో.. టీవీలపై భారీ తగ్గింపు, అస్సలు మిస్ కాకూడని టాప్ డీల్స్!

ఛార్జింగ్ కేబుల్స్ మురికిగా మారాయా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!

చిన్న టీవీలతో విసిగిపోయారా? ఈ ప్రొజెక్టర్ ఉంటే..ఇల్లే థియేటర్ అయిపోద్ది!

క్వాలిటీకే కట్టుబడిన యాపిల్.. భారత్‌లో రూ.83,000 కోట్ల చారిత్రాత్మక మైలురాయి!

BSNL మరో పిచ్చేక్కించే ప్లాన్.. రూ.1,499తో 300 రోజులు ఫుల్ హ్యాపీ.. ఇది చాలా చౌక గురూ!

Big Stories

Advertisement
×