Amazon Great Indian Festival 2026: కొత్త ల్యాప్‌టాప్ కొనాలన్నా లేదా ఉన్నదాన్ని అప్‌గ్రేడ్ చేయాలన్నా ఈ మధ్య కాలంలో ధరలు బాగా పెరిగిపోయాయి. దాంతో మంచి డీల్ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి కోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 మంచి అవకాశం తెచ్చింది. అక్టోబర్ 8న ప్రారంభమైన ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, టీవీలతో పాటు ప్రముఖ బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ఎస్‌బిఐ క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ అందుతోంది. పాత ల్యాప్‌టాప్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా అదనపు బోనస్ కూడా పొందవచ్చు.
యాపిల్ ల్యాప్‌టాప్ కొనాలని డ్రీమ్ ఉన్నవారికి ఇది సరైన సమయం. ఇటీవల ధర పెరిగిన మ్యాక్‌బుక్ నియో బేస్ మోడల్ సాధారణంగా రూ.79,900 వరకు ఉంటుంది. కానీ ఈ సేల్‌లో డైరెక్ట్ డిస్కౌంట్ ద్వారా రూ.68,390కే అందుబాటులోకి వచ్చింది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ లెక్కిస్తే ఈ ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది. ప్రీమియం లుక్, మెరుగైన పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
Also Read: ఇంట్లోనే కెఫే లాంటి కాఫీ రావాలా? రూ.15,000 బడ్జెట్‌లో బెస్ట్ కాఫీ మెషిన్స్ ఇవే!
హెవీ ప్రాసెసింగ్, ఆఫీస్ వర్క్ కోసం లెనోవో మోడల్స్ చాలా బాగుంటాయి. లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 మోడల్ రూ.1,85,790 వద్ద లిస్ట్ కాగా.. సేల్‌లో కేవలం రూ.75,990కే డిస్కౌంట్ ధరకు వస్తోంది. అలాగే లెనోవో V15 రైజెన్ 7 ప్రాసెసర్ వేరియంట్ రూ.69,490కి లభిస్తోంది. హెచ్‌పి ఒమ్నిబుక్ 3 స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో రూ.62,990కే సొంతం చేసుకోవచ్చు.
డైలీ యూసేజ్, వర్క్‌ఫ్రమ్ హోమ్ చేసేవారి కోసం హెచ్‌పి 15 ఇంటెల్ కోర్ 5 మోడల్ రూ.66,990కి దొరుకుతోంది. డెల్ 15 ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్ ల్యాప్‌టాప్ రూ.72,990కి విక్రయానికి వచ్చింది. గేమింగ్ ప్రేమికులు, హెవీ టాస్క్స్ చేసేవారి కోసం ఏసర్ ఎల్‌జీ ఇంటెల్ కోర్ 5 మోడల్ రూ.73,990కి లభిస్తోంది. అసుస్ వివోబుక్ 15 రూ.62,990కే సేల్‌లో ఉంది.
డైరెక్ట్ డిస్కౌంట్‌లతో పాటు కార్డ్ ఆఫర్లు వాడుకుంటే రూ.75,000 లోపు ధరలో అద్భుతమైన ఫీచర్లు ఉన్న ల్యాప్‌టాప్‌ను సొంతం చేసుకోవచ్చు. స్టాక్ ముగిసేలోపే మీ అవసరానికి తగ్గ మోడల్‌ను ఎంచుకోవడం మంచిది.
Also Read: గీజర్ కొనే ముందు ఈ ఫీచర్లు చూడకపోతే.. కరెంట్ బిల్లుతో పాటు గీజర్ కూడా త్వరగా పాడవుతుంది!