E-Paper
Advertisement

తెలంగాణలో టార్గెట్ ఫిక్స్ చేసుకున్న బీజేపీ.. ఆ రెండు పనులపై స్పెషల్ ఫోకస్!

తెలంగాణలో టార్గెట్ ఫిక్స్ చేసుకున్న బీజేపీ.. ఆ రెండు పనులపై స్పెషల్ ఫోకస్!
Advertisement

Telangana BJP: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయడంపై అధిష్ఠానం దృష్టి సారించింది. రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలతో పాటు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సంస్థాగతంగా మరింత పటిష్ఠం కావాల్సిన అవసరాన్ని గుర్తించిన అధిష్ఠానం.. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీగా సునిల్ బన్సల్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. సహ ఇన్ చార్జీలుగా అభయ్ పాటిల్‌, రేఖాశర్మకు బాధ్యతలు కేటాయించింది. వీరు రంగంలోకి దిగడమే తరువాయి.. తమ వ్యూహరచనను అమలుచేసేలా ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. వారితో పాటు సంస్థాగత కార్యదర్శి మధుకర్, సంయుక్త కార్యదర్శి దశరథ్‌ కూడా రంగంలోకి దిగనున్నట్లు సమాచారం.

సమన్వయం..

సోమవారం నాంపల్లి బీజేపీ రాష్​ట్ర కార్యాలయంలో నిర్వహించే బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్ లో మధుకర్, దశరథ్, అభయ్ పాటిల్ ఉంటారు. బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, సేవా సంకల్ప్ అభియాన్, పార్టీ సంస్థాగత ఇష్యూస్, తాజా రాజకీయ పరిణామాలుపై చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బీజేపీ శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో బీజేపీ బలాన్ని పెంచేలా ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నట్లు సమాచారం.

వ్యూహాలు సిద్ధం..

Advertisement

రాష్ట్రంలో పార్టీకి అనుకూలంగా ఉన్న రాజకీయ వాతావరణాన్ని మరింతగా ఉపయోగించుకోవడంతో పాటు.. భవిష్యత్ ఎన్నికల్లో బలమైన ఫలితాలు సాధించే దిశగా ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేయాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ఎదురవుతున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించడం, నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంచడం, నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

సమగ్ర కార్యాచరణ..

వచ్చే ఏడాది ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్లగొండ, ఉమ్మడి రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనున్నట్లు సమాచారం. ఈ రెండు స్థానాలను కైవసం చేసుకునేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించనున్నారు. పట్టభద్ర ఓటర్ల నమోదు నుంచి ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల వారీగా పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడం వరకు సమగ్ర కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల ద్వారా పార్టీకి అనుకూల వాతావరణాన్ని మరింత విస్తరించడంతో పాటు.. విద్యావంతులు, ఉద్యోగులు, యువతలో బీజేపీకి మద్దతును పెంచుకోవాలని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Also Read: iPhone 18 Pro కొనే ప్లాన్ ఉందా? బ్యాటరీ టెస్ట్‌లో బయటపడ్డ షాకింగ్ విషయాలివే!

గత ఎన్నికల ఫలితాలు..

ఇదిలాఉండగా ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో ఖైరతాబాద్‌ను కూడా బీజేపీ నాయకత్వం కీలక రాజకీయ అవకాశంగా చూస్తున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండేలా ఇప్పటి నుంచే వ్యూహాన్ని రూపొందించే అవకాశం ఉంది. స్థానికంగా పార్టీ బలాబలాలు, సామాజిక సమీకరణాలు, గత ఎన్నికల ఫలితాలు, ప్రత్యర్థి పార్టీల పరిస్థితిపై సమగ్రంగా అధ్యయనం చేసి అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచార వ్యూహం వరకు కార్యాచరణ రూపొందించనున్నట్లు సమాచారం.

నియోజకవర్గాల స్థాయిలో..

తెలంగాణ బీజేపీలో ఇన్నాళ్లుగా పార్టీలో సంస్థాగతంగా ఎదురవుతున్న సమస్యలను చక్కదిద్దడంపైనా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలు, నియోజకవర్గాల స్థాయిలో నాయకుల మధ్య సమన్వయం, పార్టీ కార్యక్రమాల అమలు, కీలక పదవుల భర్తీ, అసంతృప్తి నేతలను సమన్వయం చేయడం వంటి అంశాలను అధిష్ఠానం పరిశీలించనున్నట్లు సమాచారం. పార్టీ బలోపేతానికి అడ్డుగా మారుతున్న అంశాలను గుర్తించి వాటికి పరిష్కారం చూపే దిశగా ఇన్‌చార్జీల కార్యాచరణ ఉండనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే.. ఇప్పటికే మధుకర్, దశరథ్, అభయ్ పాటిల్ తెలంగాణకు వచ్చేశారు. నేడు జరిగే రాష్ట్ర పదాధికారుల మీటింగ్ లో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, రానున్న ఎన్నికలు, నియోజకవర్గాల వారీగా పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయం తదితర అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశమున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఎన్నికల మోడ్‌..

రానున్న ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని పార్టీ యంత్రాంగాన్ని ఇప్పటి నుంచే ఎన్నికల మోడ్‌లోకి తీసుకెళ్లేలా నాయకత్వం దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా.. తెలంగాణలో బీజేపీని కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా నిరంతరం ప్రజల్లో ఉండే రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధిష్ఠానం కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సంస్థాగత సమస్యలకు పరిష్కారం చూపుతూ, నేతలు, కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకొచ్చి.. రానున్న ప్రతి ఎన్నికను సీరియస్‌గా ఎదుర్కొనేలా పార్టీని సిద్ధం చేయడమే ఈ బృందం ముందున్న ప్రధాన కర్తవ్యంగా కనిపిస్తోంది. మరి వారి వ్యూహరచనతో పార్టీని విజయతీరాలకు చేరుస్తారా? లేదా? అనేది చూడాలి.

Also Read: తెలంగాణ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం.. 35 మంది జూనియర్ లెక్చరర్ల తొలగింపు!

Tags

Related News

పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో పొలిటికల్ హీట్.. చైర్మన్ అభ్యర్థుల లిస్ట్ ఇదే?

ఉన్నత విద్యాశాఖను దడదడలాడించిన బిగ్ టీవీ.. దెబ్బకు 35 మంది నకిలీ ఉద్యోగుల మైండ్ బ్లాక్!

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

Big Stories

Advertisement
×