E-Paper
Advertisement

110 ఇంచుల భారీ స్క్రీన్.. 6,000 నిట్స్ బ్రైట్‌నెస్.. హువావే కొత్త టీవీలు వచ్చేశాయ్!

110 ఇంచుల భారీ స్క్రీన్.. 6,000 నిట్స్ బ్రైట్‌నెస్.. హువావే కొత్త టీవీలు వచ్చేశాయ్!
Advertisement

Huawei Mate TV 2: హువావే సంస్థ చైనాలో నిర్వహించిన ఒక భారీ ఈవెంట్‌లో తమ మోస్ట్ ఎవైటెడ్ మేట్ 90 సిరీస్ ఫోన్లతో పాటు సరికొత్త ‘మేట్ టీవీ 2’ సిరీస్ స్మార్ట్ టీవీలను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త సిరీస్‌లో మేట్ టీవీ 2 ఎంజాయ్, మేట్ టీవీ 2, మేట్ టీవీ 2 ప్రో, మేట్ టీవీ 2 మ్యాక్స్ అనే నాలుగు వేరియంట్లను అందుబాటులోకి తెచ్చింది. హోమ్ థియేటర్ అనుభూతిని ఇంటికే పరిచయం చేసేలా రూపుదిద్దుకున్న ఈ టీవీలు ప్రస్తుతం టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

అద్భుతమైన డిస్‌ప్లే క్వాలిటీ:

ఈ మేట్ టీవీ 2 సిరీస్‌లో డిస్‌ప్లే క్వాలిటీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. సాధారణ మేట్ టీవీ 2 వేరియంట్ 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుండగా.. టాప్ ఎండ్ మోడల్ అయిన మేట్ టీవీ 2 మ్యాక్స్ ఏకంగా 6,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 110 అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇవన్నీ సూపర్ మినీ ఎల్‌ఈడీ ప్యానెల్స్‌తో పనిచేస్తాయి. అంతేకాకుండా 2డీ కంటెంట్‌ను రియల్ టైమ్‌లో 3డీలోకి మార్చే ప్రత్యేక సాంకేతికత కూడా ఇందులో ఉంది.

Advertisement

Also Read: వైర్డ్ vs వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ కాలం మన్నుతుంది?

కిరిన్ ప్రాసెసర్, కొత్త ఓఎస్:

ఈ టీవీలు హువావే సొంత కిరిన్ టీ92 చిప్‌సెట్‌పై పనిచేస్తాయి. అలాగే వీటిలో హార్మోనీ ఓఎస్ 7 సాఫ్ట్‌వేర్ ఇచ్చారు. ఎంజాయ్, స్టాండర్డ్ మోడల్స్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో వస్తుంటే.. ప్రో, మ్యాక్స్ మోడల్స్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తో లభిస్తున్నాయి. హువావే స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లతో వీటిని సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. గేమింగ్, ఎడ్యుకేషన్ యాప్స్ కూడా ఇందులో ఎంచక్కా వాడుకోవచ్చు.

థియేటర్ రేంజ్ సౌండ్:

Advertisement

సౌండ్ విషయంలోనూ హువావే ఎక్కడా తగ్గలేదు. ఎంజాయ్ మోడల్‌లో 130 వాట్స్, స్టాండర్డ్ వేరియంట్‌లో 180 వాట్స్, ప్రో మోడల్‌లో ఏకంగా 240 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్ ఇచ్చారు. 4కే స్క్రీన్ కాస్టింగ్, స్మార్ట్ హోమ్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సినిమా చూస్తున్నప్పుడు మనకు థియేటర్లో కూర్చున్న ఫీలింగ్ స్పష్టంగా కనిపిస్తుంది.

ధరలు ఏ రేంజ్‌‌లో ఉన్నాయంటే?

చైనాలో వీటి ప్రారంభ ధర ఎంజాయ్ 65 అంగుళాల మోడల్ సుమారు రూ.98,000 కాగా, 85 అంగుళాల మోడల్ రూ.1,72,000 వరకు ఉంది. అలాగే మేట్ టీవీ 2 స్టాండర్డ్ మోడల్ రూ.1,23,000 నుంచి రూ.3,32,000 వరకు ఉంది. ప్రో మోడల్స్ రూ.2,09,000 నుంచి రూ.4,30,000 వరకు నిర్ణయించారు. ఇక అత్యంత విలాసవంతమైన 110 అంగుళాల మేట్ టీవీ 2 మ్యాక్స్ ధర దాదాపు రూ.7,99,000గా ఉంది.

Also Read: అబ్బా ఏం ఐడియా భయ్యా.. నెట్‌వర్క్ లేకపోయినా వాకీటాకీలా వాడుకునే వన్‌ప్లస్ సీక్రెట్ ఫీచర్!

Tags

Related News

గూగుల్‌లో ఈ విషయాలను అసలు వెతకొద్దు..సెర్చ్ చేస్తే నేరుగా జైలుకే!

చలికాలంలో వేడి నీళ్ల కోసం ఏ గీజర్ కొనాలి? గ్యాస్ Vs ఎలక్ట్రిక్ పూర్తి గైడ్!

వైర్డ్ vs వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ కాలం మన్నుతుంది?

ఫ్రిజ్ క్లీనింగ్ కష్టమా? ఈ అల్యూమినియం ఫాయిల్ ట్రిక్‌తో మీ పని ఈజీ!

వన్‌ప్లస్ కొత్త ఇయర్ బడ్స్‌పై భారీ డిస్కౌంట్.. ఫీచర్లు తెలిస్తే కొనకుండా ఉండలేరు!

అబ్బా ఏం ఐడియా భయ్యా.. నెట్‌వర్క్ లేకపోయినా వాకీటాకీలా వాడుకునే వన్‌ప్లస్ సీక్రెట్ ఫీచర్!

వింటర్ వచ్చేసింది..గీజర్ సర్వీసింగ్ చేయించకుండా ఆన్ చేస్తే భారీ మూల్యం తప్పదు!

Big Stories

Advertisement
×