Amazon Great Indian Festival 2026: ప్రతి సంవత్సరం టెక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మళ్లీ వచ్చేసింది! ఈ మెగా ఈవెంట్‌లో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్‌సంగ్ తన గెలాక్సీ ట్యాబ్‌లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.ఆన్ లైన్ క్లాసులు, ఆఫీస్ వర్క్, లేదా ఎంటర్ టైన్‌మెంట్ కోసం ఒక మంచి ట్యాబ్ కొనాలని చూస్తున్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్. అమెజాన్ సేల్‌లో తప్పక గమనించాల్సిన.. టాప్ 5 శామ్‌సంగ్ టాబ్లెట్ ఆఫర్లు, వాటి ధరల వివరాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ప్రీమియం ఫీచర్లు కోరుకునే టెక్ లవర్స్ కోసం శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 సిరీస్ అద్భుతమైన ఆప్షన్. అమోలెడ్ డిస్‌ప్లే, ఎస్-పెన్ సపోర్ట్ , పవర్ ఫుల్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్‌తో ఇది వస్తుంది. గేమింగ్ , గ్రాఫిక్ డిజైనింగ్ పనులకు ఇది పర్ఫెక్ట్‌గా సరి పోతుంది. అమెజాన్ సేల్‌లో.. బ్యాంక్ ఆఫర్లతో కలిపి ఈ టాబ్ ప్రారంభ ధర సుమారు రూ.55,000 నుంచి రూ.65,000 వరకు లభించే అవకాశం ఉంది.
తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్ కోరుకునే వారికి గెలాక్సీ.. ట్యాబ్ ఎస్9 ఎఫ్ఈ చక్కటి ఆప్షన్. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, అద్భుతమైన బ్యాటరీ లైఫ్ , స్మూత్ డిస్‌ప్లే దీని ప్రత్యేకతలు. స్టూడెంట్స్ , వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఇది బాగా ఉపయోగ పడుతుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఈ ట్యాబ్ ధర సుమారు రూ.32,000 నుంచి రూ.38,000 మధ్య ఉండే అవకాశం ఉంది.
కుటుంబం మొత్తం కలిసి సినిమా చూసేందుకు, పిల్లల ఆన్‌లైన్ క్లాసుల కోసం ఒక మంచి ట్యాబ్ కావాలంటే.. గెలాక్సీ ట్యాబ్ ఏ9 ప్లస్ బెస్ట్ ఛాయిస్. 11 ఇంచుల పెద్ద స్క్రీన్ , క్వాడ్ స్పీకర్లతో ఇది మంచి మల్టీమీడియా ఫీల్ ఇస్తుంది. అమెజాన్ సేల్ సందర్భంగా.. ఈ ట్యాబ్ ధర కేవలం రూ.16,000 నుంచి రూ.20,000 శ్రేణిలో లభిస్తోంది. ఇది బడ్జెట్ యూజర్లకు సరిగ్గా సరి పోతుంది.
4. Samsung Galaxy Tab S8:
పాత ఫ్లాగ్‌షిప్ మోడల్ అయినప్పటికీ..గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ఇప్పటికీ తన హై-ఎండ్ పెర్ఫార్మెన్స్‌తో అదర గొడుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన స్క్రీన్, పవర్ ఫుల్ కెమెరా సెటప్ దీని సొంతం. అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా.. ఈ మోడల్‌పై భారీ ప్రైస్ కట్ లభిస్తోంది. దీని ధర సుమారు రూ.45,000 నుంచి రూ.50,000 వరకు ఉండొచ్చని అంచనా.
Also Read: ఛార్జర్‌లపై ఉండే.. 5V, 9V, 12V అర్థం ఏంటి? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు
చేతిలో ఇమడగల కాంపాక్ట్ సైజ్, ఈజీ వాడకం కోసం గెలాక్సీ ట్యాబ్ ఏ9 నిలిచింది. చిన్న పిల్లల స్టడీస్, సాధారణ సోషల్ మీడియా బ్రౌజింగ్ కోసం ఇది పర్ఫెక్ట్. అమెజాన్ సేల్‌లో.. ఈ ఎంట్రీ-లెవెల్ ట్యాబ్ ధర అత్యంత ఆకర్షణీయంగా.. రూ.11,000 నుంచి రూ.14,000 మధ్య లభిస్తుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ శామ్‌సంగ్ టాబ్‌లు కొనడానికి అత్యంత అనుకూలమైన సమయం.ఎస్బీఐ లేదా హెచ్‌డీఎఫ్‌సీ వంటి బ్యాంక్ కార్డులను ఉపయోగించి.. అదనపు డిస్కౌంట్లు ,నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను పొందొచ్చు. మీ అవసరాలకు తగిన ట్యాబ్‌ను ముందే ఎంచుకుని ఈ సేల్‌ను సద్వినియోగం చేసుకోండి.