Amazon Prime Day 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 రానే వస్తోంది. జులై 4 నుంచి 6వ తేదీ వరకు జరిగే ఈ మూడు రోజుల మెగా సేల్‌లో ఎలక్ట్రానిక్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు ఉండనున్నాయి. ముఖ్యంగా ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులను ఉపయోగించే వారికి అదనంగా 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఎప్పుడూ లేని విధంగా ప్రైమ్ మెంబర్‌షిప్ ఏడాది ప్లాన్ ధర రూ.1499 నుంచి రూ.999కి తగ్గింది. ఈ సేల్‌లో ప్రీమియం బ్రాండ్ అయిన Sony స్మార్ట్ టీవీలపై అదిరిపోయే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. సేల్ ప్రారంభానికి ముందే లభిస్తున్న కొన్ని బెస్ట్ సోనీ టీవీ ఆఫర్ల వివరాలు మీకోసం.
మీరు మీడియం సైజ్ రూమ్ లేదా హాల్ కోసం ప్రీమియం టీవీని చూస్తుంటే సోనీ 55 ఇంచుల అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ గూగుల్ టీవీ ఒక అద్భుతమైన ఎంపిక. దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేసే 20 వాట్ల స్పీకర్లు ఉన్నాయి. దీని అసలు ధర రూ.1,49,990 కాగా.. ప్రస్తుతం ప్రైమ్ డే ముందస్తు ఆఫర్‌లో భాగంగా 37 శాతం తగ్గింపుతో రూ.94,990కే లభిస్తోంది. యాప్‌లు చాలా వేగంగా రన్ అవ్వడం, గేమింగ్ స్మూత్‌గా సాగడం దీని ప్రత్యేకత.
పెద్ద హాల్ కోసం థియేటర్ లాంటి అనుభూతిని పొందాలనుకునే వారికి సోనీ 65 ఇంచుల మోడల్ పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. దీనిలో పవర్‌ఫుల్ XR ప్రాసెసర్, హెచ్‌డీఆర్ 10, గేమింగ్ కోసం హెచ్‌డీఎమ్ఐ 2.1 వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ధర కొంచెం ఎక్కువే అయినప్పటికీ సోనీ ఇచ్చే పిక్చర్ క్వాలిటీకి ఇది బెస్ట్ అని చెప్పాలి. ప్రస్తుతం దీనిపై 38 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. రూ.1,99,900 విలువైన ఈ టీవీని సేల్ ఆఫర్‌లో రూ.1,23,490 కే సొంతం చేసుకోవచ్చు. దీనికి నో-కాస్ట్ ఈఎమ్ఐ సౌకర్యం కూడా ఉంది.
Also Read: ఫోన్లో ఈ 5 యాప్స్ ఉంటే.. మీ బ్యాంక్ అకౌంట్, పత్రాలు సేఫ్!
చాలామంది ఇళ్లలో 55 ఇంచులు మరీ పెద్దదిగా, 43 ఇంచులు చిన్నదిగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారికి ఈ 50 ఇంచుల టీవీ కరెక్ట్ ఛాయిస్. ఫోర్కే ఎక్స్-రియాలిటీ ప్రో, లైవ్ కలర్ టెక్నాలజీతో వచ్చే ఈ గూగుల్ టీవీ విజువల్స్ పరంగా మిమ్మల్ని అస్సలు నిరాశ పరచదు. దీని అసలు ధర రూ.79,900 కాగా, 19 శాతం తగ్గింపు తర్వాత రూ.64,590కి సేల్‌లో అందుబాటులో ఉంది. నెలకు రూ.2,271 నుంచి ప్రారంభమయ్యే ఈఎమ్ఐ ఆప్షన్లు కూడా దీనిపై ఉన్నాయి.
చిన్న గదులు లేదా బెడ్‌రూమ్‌ల కోసం ఫోర్కే (4K) క్లారిటీతో వచ్చే బెస్ట్ టీవీ కావాలనుకుంటే సోనీ 43 ఇంచుల మోడల్ వైపు వెళ్లవచ్చు. ఈ బడ్జెట్‌లో డాల్బీ అట్మోస్ ఆడియో, గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా అన్ని రకాల ఓటీటీ యాప్‌ల సపోర్ట్ లభిస్తుంది. కలర్ కాంబినేషన్, పిక్చర్ షార్ప్‌నెస్ చాలా బాగుంటాయని యూజర్లు చెబుతున్నారు. రూ.59,900 విలువైన ఈ స్మార్ట్ టీవీపై 20 శాతం ముందస్తు డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో ఈ టీవీని రూ.47,990కే కొనుగోలు చేయవచ్చు.
బడ్జెట్ ధరలో సోనీ బ్రాండ్ నమ్మకాన్ని, క్వాలిటీని కోరుకునే వారికి ఈ 32 ఇంచుల హెచ్‌డీ రెడీ టీవీ చాలా బాగా నచ్చుతుంది. చిన్న సైజ్ టీవీ అయినప్పటికీ ఇందులో గూగుల్ అసిస్టెంట్, ఇన్‌బిల్ట్ క్రోమ్‌కాస్ట్, అలెక్సా సపోర్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. దీని అసలు ధర రూ.34,900 కాగా, ప్రస్తుతం 17 శాతం తగ్గింపుతో రూ.28,900కే లభిస్తోంది. నెలకు రూ.1019 కనీస ఈఎమ్ఐతో పాటు బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా దీనిపై వర్తిస్తాయి.
Also Read: ఈ పెయింట్ వేస్తే ఇల్లు కూల్ కూల్.. 97% వరకు ఎండను అడ్డుకుంటుందట!