E-Paper
Advertisement

హోండా అమేజ్ vs మారుతి డిజైర్.. సేఫ్టీలో ఏ కారు బెస్ట్?

హోండా అమేజ్ vs మారుతి డిజైర్.. సేఫ్టీలో ఏ కారు బెస్ట్?
Advertisement

Honda Amaze Vs Maruti Dzire Safety Comparison: కొత్త కారు కొనాలనుకునే చాలా మంది ముందుగా చూసేది సేఫ్టీ. ఏ కారు ఎక్కువగా సేఫ్ గా ఉంటే, దానికే ప్రయారిటీ ఇస్తారు. కాంపాక్ట్ సెడాన్ విభాగంలో ఎక్కువ మంది కొనుగోలుదారులు హోండా అమేజ్, మారుతి డిజైర్ కార్లను సెలెక్ట్ చేసుకుంటున్నారు. నిజానికి ఈ రెండు కార్లు మంచి ఫీచర్లు, ఆకట్టుకునే  డిజైన్‌తో పాటు మంచి భద్రతను అందిస్తున్నాయి. అయితే, సేఫ్టీ పరంగా ఏ కారు ముందుంది? అనే ప్రశ్న చాలామందిలో ఉంది.

రెండు కార్లకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్

ఇటీవల భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) నిర్వహించిన క్రాష్ టెస్టులో హోండా అమేజ్, మారుతి డిజైర్ రెండూ 5 స్టార్ సేప్టీ రేటింగ్‌ను సాధించాయి. ప్రస్తుతం ఈ రెండు కార్లు కూడా సేఫ్ కార్ల లిస్టులో ప్లేస్ దక్కించుకున్నాయి. హోండా అమేజ్‌ కు అడల్ట్ ప్యాసింజర్స్ ప్రొటెక్షన్ లో(AOP)  32 మార్కులకు 28.33 మార్కులు లభించాయి. పిల్లల భద్రత (COP) విభాగంలో 49 మార్కులకు 40.81 మార్కులు సాధించింది. ఈ స్కోర్లు చూస్తే అమేజ్ మంచి స్థాయి భద్రతను అందిస్తుందని చెప్పవచ్చు. అటు మారుతి డిజైర్ కూడా అద్భుతమైన ఫలితాలు సాధించింది. అడల్ట్ ప్యాసింజర్స్ ప్రొటెక్షన్ లో 32 మార్కులకు గాను 29.46 మార్కులు, పిల్లల రక్షణలో 49 మార్కులకు గాను 41.57 మార్కులు పొందింది. ఈ రెండు విభాగాల్లో కూడా డిజైర్ స్కోర్లు అమేజ్ కంటే కాస్త ముందుంది.  కేవలం BNCAP స్కోర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే, భద్రత పరంగా డిజైర్‌ కాస్త ముందుంది. అదే సమయంలో అమేజ్ భద్రతలో వెనుకబడిందని కాదు. రెండు కార్లు కూడా 5 స్టార్ రేటింగ్‌ తో మంచి భద్రతను అందిస్తున్నాయి.

భద్రతా ఫీచర్ల గురించి..

Advertisement

హోండా అమేజ్‌ లో ADAS టెక్నాలజీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో 6 ఎయిర్‌ బ్యాగ్‌లు, లేన్ వాచ్ కెమెరా, హిల్ స్టార్ట్ అసిస్ట్, రియర్ పార్కింగ్ కెమెరా, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, ABS లాంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ లాంటి ఫీచర్లు డ్రైవింగ్‌ను  మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.  ఇక మారుతి డిజైర్‌ లో 360 డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌ బ్యాగ్‌ లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, ABS లాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లు డ్రైవర్‌ కు అదనపు భద్రతను అందిస్తాయి.

ఫీచర్ల గురించి..

అమేజ్‌లో 8 అంగుళాల టచ్‌ స్క్రీన్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, వైర్‌ లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ తో లభిస్తుంది. దీని ధర సుమారు రూ.8.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మరోవైపు డిజైర్‌ లో 9 అంగుళాల టచ్‌ స్క్రీన్, ఎలక్ట్రిక్ సన్‌ రూఫ్, వైర్‌ లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. దీనిలో కూడా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ తో పాటు సీఎన్‌జీ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ కారు ధర రూ.7.38 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Advertisement

Read Also: ఇక ఈవీ ఛార్జింగ్‌ కోసం నో వెయిటింగ్.. హైస్పీడ్ మెగా ఛార్జింగ్ హబ్ ప్రారంభం!

Related News

అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్ లాంచ్ 2027 లోనే.. ఎందుకు ఆలస్యమైందంటే?

యమహా నుంచి ప్రీమియం బైక్‌ల జోరు.. భారత్‌లో కొత్త మోడళ్లకు ప్లాన్!

టియాగో To హారియర్.. టాటా ఈవీలన్నింటికీ BaaS ఆప్షన్!

హయబుసా కొత్త వెర్షన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

రెనాల్ట్ ట్రైబర్ టర్బో మైలేజ్ రివీల్.. లీటర్ పెట్రోల్ తో ఎంత దూరం ప్రయాణిస్తుందంటే?

30 కిలో మీటర్లకు మించి మైలేజ్.. త్వరలో రాబోతున్న 4 సూపర్ హైబ్రిడ్ SUVలు ఇవే!

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అక్టోబర్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న 11 క్రేజీ కార్లు ఇవే!

ట్రైబర్‌ కు ఇక టర్బో పవర్.. కొత్త వేరియంట్ అదిరింది భయ్యా!

Big Stories

Advertisement
×