E-Paper
Advertisement

ఆఫర్ల వేట షురూ.. వన్‌ప్లస్ కొత్త టాబ్లెట్ కొంటే.. రూ.5,499 విలువైన గిఫ్ట్ ఉచితం!

ఆఫర్ల వేట షురూ.. వన్‌ప్లస్ కొత్త టాబ్లెట్ కొంటే.. రూ.5,499 విలువైన గిఫ్ట్ ఉచితం!
Advertisement

Amazon Prime Day Sale 2026: ప్రముఖ టెక్ సంస్థ వన్‌ప్లస్ ప్రియులకు గుడ్ న్యూస్. త్వరలో ప్రారంభం కానున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ కోసం వన్‌ప్లస్ సంస్థ తమ బంపర్ ఆఫర్లను ప్రకటించింది. జూలై 4 అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే ఈ మూడ్రోజుల ప్రత్యేక సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ఇయర్‌బడ్స్‌పై భారీ తగ్గింపులు లభించనున్నాయి. నేరుగా ధరల తగ్గింపుతో పాటు బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లతో కస్టమర్లు తమకు నచ్చిన ప్రొడక్ట్స్‌ను సొంతం చేసుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్లపై కళ్లుచెదిరే ఆఫర్లు:

ఈ సేల్‌లో వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ మోడల్ ‘వన్‌ప్లస్ 15’పై రూ.4,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో కలిపి రూ.81,999 లభించనుంది. అలాగే ‘వన్‌ప్లస్ 15ఆర్’ మోడల్‌పై రూ.3,000 నేరుగా ధర తగ్గించడంతో పాటు మరో రూ.3,000 బ్యాంక్ ఆఫర్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను రూ.48,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో ‘వన్‌ప్లస్ 13ఎస్’ ఫోన్ రూ.46,999కి, గతేడాది విడుదలైన ఫ్లాగ్‌షిప్ మోడల్ ‘వన్‌ప్లస్ 13’ చరిత్రలోనే అత్యంత తక్కువగా రూ.49,999కే అందుబాటులోకి రానుంది. ఈ ప్రీమియం ఫోన్లపై 6 వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.

Advertisement

Also Read:

బడ్జెట్ ధరల్లో నార్డ్ సిరీస్:

మధ్యతరగతి వినియోగదారులను ఆకట్టుకునే వన్‌ప్లస్ నోర్డ్ సిరీస్‌పై కూడా మంచి తగ్గింపులు ఉన్నాయి. రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో ‘వన్‌ప్లస్ నోర్డ్ 6’ ఫోన్ రూ.39,999కే లభిస్తుంది. వీటితో పాటు ‘వన్‌ప్లస్ నోర్డ్ సీఈ 6’ రూ.29,999కి, ‘వన్‌ప్లస్ నోర్డ్ సీఈ 6 లైట్’ మోడల్ రూ.22,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు సీఈ మోడళ్లపై రూ.2,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.

టాబ్లెట్లతో పాటు ఉచిత యాక్సెసరీలు:

Advertisement

టాబ్లెట్లు కొనాలనుకునే వారి కోసం వన్‌ప్లస్ క్రేజీ డీల్స్ తీసుకొచ్చింది. రూ.55,999 ధర గల ఫ్లాగ్‌షిప్ ‘వన్‌ప్లస్ ప్యాడ్ 4’ కొనుగోలు చేస్తే రూ.5,499 విలువైన వన్‌ప్లస్ స్టైలో ప్రో పెన్ను ఉచితంగా ఇస్తున్నారు. అలాగే రూ.26,499 ధర గల ‘వన్‌ప్లస్ ప్యాడ్ గో 2’తో పాటు రూ.3,999 విలువైన స్టైలో పెన్ ఉచితంగా లభిస్తుంది. ఇక బడ్జెట్ టాబ్లెట్ కావాలనుకునే వారు ‘వన్‌ప్లస్ ప్యాడ్ లైట్’ను రూ.16,999కే దక్కించుకోవచ్చు.

ఇయర్‌బడ్స్‌పై ప్రత్యేక తగ్గింపులు:

ఆడియో ప్రొడక్ట్స్ విభాగంలో ఇటీవల లాంచ్ అయిన ‘వన్‌ప్లస్ నోర్డ్ బడ్స్ 4’ కేవలం రూ.3,099కే లభించనుంది. వీటితో పాటు వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్‌లెస్ జెడ్2 ఏఎన్‌సీ రూ.1,899కి, నోర్డ్ బడ్స్ 3ఆర్ రూ.1,599కి, నోర్డ్ బడ్స్ 4 ప్రో రూ.3,799కి అందుబాటులో ఉంటాయి. ప్రీమియం మోడల్స్ అయిన వన్‌ప్లస్ బడ్స్ 4 ను రూ.5,599కి, వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3ని రూ.9,999కి సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్లన్నీ జూలై 4 నుంచి అమెజాన్, వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, స్టోర్లతో పాటు ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్, మింత్రా వంటి ప్లాట్‌ఫామ్స్‌లోనూ అందుబాటులో ఉంటాయి.

Also Read:

Related News

ఈ పోర్టబుల్ బ్లెండర్‌తో..హెల్దీ జ్యూస్, స్మూతీలు క్షణాల్లో రెడీ

రూ.482కే..పోర్టబుల్ జ్యూసర్, వెంటనే కొనేయండి

సింగిల్ ఛార్జ్‌తో 48 గంటలే పనిచేసే వివో కొత్త ఫోన్.. బడ్జెట్ ధరలోనే వాటర్ ప్రూఫ్ ఫీచర్!

డైమెన్సిటీ 7500 ప్రాసెసర్‌తో తొలి ఫోన్.. iQOO నుంచి అదిరిపోయే కాంబో ఆఫర్!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. బెస్ట్ బ్లూటూత్ స్పీకర్, డోంట్ మిస్

టెక్ లవర్స్ గెట్ రెడీ.. శాంసంగ్, నథింగ్ ఫోన్లపై క్రేజీ డిస్కౌంట్స్.. ఏ గాడ్జెట్ ధర ఎంత తగ్గిందంటే?

200పైగా ఫ్రీ ఛానెల్స్‌తో.. షియోమి 32 ఇంచుల స్మార్ట్ టీవీ

రూ. 30 వేలలోపు నెక్స్ట్ లెవెల్ ఏఐ ఫోన్‌లు.. మధ్యతరగతికి పర్ఫెక్ట్ ఛాయిస్!

Big Stories

Advertisement
×