Steve jobs Wife : అంతర్జాతీయ దిగ్గజం మొబైళ్ల తయారీ సంస్థ యాపిల్ కంపెనీ కో- ఫౌండర్, దివంగత స్టీఫెన్ జాబ్స్ భార్య లారీన్ పావెల్ జాబ్స్ తన పేరును కమల గా మార్చుకున్నారు. చాన్నాళ్లుగా హిందూ ధర్మాన్ని అచరిస్తున్న ఈమె.. భారత దేశ విలువలు, సంప్రదాయలకు ముగ్ధురాలైంది. హిందూ ధర్మంలోని ఆచార, వ్యవహారాలు.. ఇక్కడ ఆధ్యాత్మిక సాధన గురించి తెలుసుకుని.. గతంలోనే హైందవ ధర్మం వైపు అడుగులు వేసిన ఈమె.. ఇప్పుడు అధికారికంగా తన పేరును మార్చుకున్నారు.
నిత్యం హడావిడి జీవితాల్లో హిందుత్వం ద్వారా ప్రశాంతతను పొందుతున్నట్లు తెలిపిన ఆమె.. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో జరుగుతున్న మహా కుంభమేళలో పాల్గొనేందుకు భారత్ కు వచ్చారు. ఆధ్యాత్మిక సాధనలో భాగంగా ఆవిడ భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆకర్షితులయ్యారు. హిందుత్వంలో.. మహిళనే మహా శక్తిగా పూజించే విధానంతో పాటు ప్రతి జీవిలోనూ దైవత్వాన్ని చూసే విధానం.. దైవత్వాన్ని అర్థం చేసుకునేందుకు ఉన్న స్వేచ్ఛకు ఈ పాశ్చాత్య మహిళ.. ఆశ్చర్యానికి గురైనట్లు ఆశ్రయ నిర్వహకులు చెబుతున్నారు. ఆమె భారతీయ విలువల్ని, సంప్రదాయాల్ని గౌరవించేందుకు చాలా ప్రాముఖ్యతనిస్తారని తెలుపుతున్నారు.
భారతదేశ విలువలు, ఇక్కడి పద్ధతులు తెలుసుకున్న లారీన్ జాబ్స్.. వారణాసిలోని ఆశ్రమంలో సాధన చేస్తున్నారు. గతంలోను అనేకసార్లు ఇక్కడికి వచ్చి హిందుత్వం, హిందుత్వంలోనే ఆలోచన విధానాన్ని పరిశీలించి ఆవిడ క్రమంగా హిందూ ధర్మాన్ని ఆచరించటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోని ఆవిడ పూర్తిగా హైందత్వాన్ని తన జీవన విధానంగా ఎంచుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నిరంజన్ ఆఖాడాకు చెందిన మహామండలేశ్వర్ స్వామి కైలాసానందం గిరి మహారాజ్ ఆధ్వర్యంలో తన పేరును లారిన్ పావెల్ జాబ్స్ నుంచి కమల గా మార్చుకున్నారు. గత శుక్రవారం (జనవరి 10న) నామకరణం చేసినట్టు కైలాసానంద గిరి మహారాజ్ వెల్లడించారు.
ధ్యానం చేసేందుకు ఆమె తన ఆశ్రమానికి వచ్చి వెళ్తుంటారని స్వామీజీ తెలిపారు. వారణాసిలోని వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె.. వారణాసిలోని కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భారతలో జరుగుతున్న మహా కుంభమేళా విజయవంతం కావాలని వారణాసి మహాశివుని పూజించినట్లు లారీన్ పావెల్ తెలిపారు.
Also Read : లద్దాఖ్ లో చైనా కాలుదువ్వుతోంది.. దాని కోరలు పీకాల్సిందే.. భారత ఆర్మీ చీఫ్ సంచలన ప్రకటన
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన మహా కుంభమేళలో పాల్గొనేందుకు ప్రయాగ్ రాజ్ చేరుకున్న కమల.. పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 144 ఏళ్లకు ఒకమారు జరిగే ఖగోళ అమరిక వేళ మహా కుంభమేళం జరుగుతుండటంతో కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తుతున్నారు. ఈ పరమ పవిత్రమైన త్రివేణి సంగమంలో నది స్థానం చేసేందుకు లారిన్ పావెల్ జాబ్సల్.. భారత్ రాగా.. ఇక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు నిరంజన్ అఖాడాకు చెందిన స్వామీజీ మహామండలేశ్వర్ స్వామి కైలాసానందం గిరి మహారాజ్ వెల్లడించారు. ప్రస్తుతం తాము ఏర్పాటు చేసిన శిబిరంలో ఆమె చికిత్స తీసుకుంటున్నారని.. ఆరోగ్యం కుదుటపడ్డాక త్రివేణి సంఘంలో పవిత్ర స్థానం ఆచరిస్తారని వెల్లడించారు