E-Paper
Advertisement

Apple Smart Glasses.. రికార్డింగ్ ప్రైవసీ సమస్యలకు చెక్ పెట్టేలా కొత్త పేటెంట్!

Apple Smart Glasses.. రికార్డింగ్ ప్రైవసీ సమస్యలకు చెక్ పెట్టేలా కొత్త పేటెంట్!
Advertisement

Apple Smart Glasses: స్మార్ట్ గ్లాసెస్ అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ప్రైవసీ భయాలే. మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు లేదా ఏదైనా ప్రైవేట్ ప్రదేశంలో ఉన్నప్పుడు, ఎదుటివారు తమ స్మార్ట్ గ్లాసెస్‌తో మనకు తెలియకుండానే వీడియోలు, ఆడియోలు రికార్డ్ చేస్తున్నారేమోననే అనుమానం రావడం సహజం. త్వరలోనే ఈ విభాగంలోకి అడుగుపెట్టబోతున్న దిగ్గజ సంస్థ యాపిల్.. ఈ సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది.

ఆడియో, వైబ్రేషన్ సూచికలు:

సాధారణంగా కెమెరా రికార్డ్ అవుతున్నప్పుడు చిన్న లైట్ వెలుగుతుంది. కానీ, స్మార్ట్ గ్లాసెస్ పరిమాణం చాలా చిన్నదిగా ఉండటం వల్ల అందులో స్పష్టంగా కనిపించే లైట్ అమర్చడం కొంచెం కష్టం. అందుకే యాపిల్ ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. రికార్డింగ్ ప్రారంభమైనప్పుడు ఒక ప్రత్యేకమైన సౌండ్ ప్లే అవ్వడం లేదా వైబ్రేషన్ ద్వారా ధృవీకరించుకోవడం వంటి పద్ధతులను పేటెంట్‌లో పేర్కొంది.

Advertisement

Also Read: iPhone 18లో ఊహించని మార్పులు..చిన్నదైన డైనమిక్ ఐలాండ్, భారీగా ర్యామ్ పెరిగే ఛాన్స్!

హ్యాకింగ్‌కు అడ్డుకట్ట:

కేవలం సౌండ్ ప్లే చేస్తే సరిపోదు.. ఎవరైనా దాన్ని హ్యాక్ చేసి లేదా ట్యాంపరింగ్ చేసి రికార్డ్ చేసే అవకాశం ఉందా అనే అనుమానం రావచ్చు. దీని కోసం యాపిల్ మరో కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తోంది. గ్లాసెస్‌లోని స్పీకర్ ద్వారా ఒక శబ్దం రాగానే, దాని మైక్రోఫోన్ ఆ శబ్దాన్ని విని, అది నిజంగా ఆ గ్లాసెస్ నుంచే వచ్చిందో లేదో నిర్ధారించుకుంటుంది. దీనివల్ల ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లదు.

సరికొత్త పోటీకి సిద్ధం:

Advertisement

ఇప్పటికే మార్కెట్లో ఉన్న మెటా రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్‌కు గట్టిపోటీ ఇచ్చేందుకు యాపిల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సరికొత్త స్మార్ట్ గ్లాసెస్ వచ్చే ఏడాదితో పాటు డెవలపర్ కాన్ఫరెన్స్‌లో అధికారికంగా ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి. వినియోగదారుల ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తూ యాపిల్ తీసుకొస్తున్న ఈ ఫీచర్ ఖచ్చితంగా మార్కెట్లో పెద్ద మార్పుకే నాంది పలుకుతుంది.

Also Read: అబ్బా.. గూగుల్ ఏం ప్లాన్ చేసింది మావా.. Pixel Buds Pro 2లో దిమ్మతిరిగే ఫీచర్లు!

Tags

Related News

మధ్యతరగతి కుటుంబాలకు పర్ఫెక్ట్.. ఈ 5-స్టార్ ఎల్జీ వాషింగ్ మెషీన్స్!

ఆగస్టు 15 స్పెషల్.. BSNL రూ.2,399 ప్లాన్‌పై అదనపు వాలిడిటీ.. ఆఫర్ కొద్దిరోజులే!

సినిమా హాల్ రేంజ్ సౌండ్.. బోట్ కొత్త సౌండ్‌బార్లు వచ్చేశాయ్, ఫీచర్లు, ధరలు ఇవే!

రూ.799కే బోట్ ఇయర్‌బడ్స్.. మ్యూజిక్ లవర్స్‌కు అదిరిపోయే ఆఫర్!

అబ్బా.. గూగుల్ ఏం ప్లాన్ చేసింది మావా.. Pixel Buds Pro 2లో దిమ్మతిరిగే ఫీచర్లు!

iPhone 18లో ఊహించని మార్పులు..చిన్నదైన డైనమిక్ ఐలాండ్, భారీగా ర్యామ్ పెరిగే ఛాన్స్!

ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షనా? బడ్జెట్‌లోనే.. పాకెట్ ఫ్రెండ్లీ పవర్ బ్యాంక్

Big Stories

Advertisement
×