E-Paper
Advertisement

నా దారికే అడ్డొస్తావా ? బంగ్లా బ్యాట‌ర్ మిరాజ్ కు స్టార్క్ వార్నింగ్..వేలు చూపిస్తూ మ‌రీ

నా దారికే అడ్డొస్తావా ? బంగ్లా బ్యాట‌ర్ మిరాజ్ కు స్టార్క్ వార్నింగ్..వేలు చూపిస్తూ మ‌రీ
Advertisement

Mitchell Starc VS Mehidy Hasan Miraz : బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs Bangladesh, 1st Test)
మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఉదయం ఆరు గంటల ప్రాంతంలో డార్విన్ లోని మరారా క్రికెట్ మైదానం  వేదిక‌గాఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కాగా… కంగారులకు కంగారు పెట్టిస్తోంది బంగ్లాదేశ్. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా అదరగొట్టిన బంగ్లాదేశ్, మంచి లీడ్ కూడా సంపాదించింది. విజయం దిశగా దూసుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ క్రికెటర్లను ఒత్తిడికి లోను చేసేందుకు స్లెడ్జింగ్ మొదలుపెట్టారు ఆస్ట్రేలియా క్రికెటర్లు. తాజాగా బంగ్లా బ్యాటర్ మెహిదీ హసన్ మిరాజ్ ( Mehidy Hasan Miraz) పై దాడి చేసేందుకు ఆస్ట్రేలియా డేంజర్ బౌలర్ మిచెల్ స్టార్క్ ప్రయత్నించాడు. అనవసరంగా గొడవ పెట్టుకుని రచ్చ లేపాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

బంగ్లా బ్యాట‌ర్ మిరాజ్ కు స్టార్క్ వార్నింగ్..వేలు చూపిస్తూ మ‌రీ

ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనుకున్న దానికంటే ఎక్కువ బంగ్లాదేశ్ క్రికెటర్లు గట్టి పోటీ ఇస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో స్లెడ్జింగుకు దిగుతున్నారు. స్లెడ్జింగ్ చేసి మ్యాచ్ గెలిచేలా చూస్తున్నారు. ఈ క్రమంలోనే రెండో రోజున మెహిదీ హసన్ మిరాజ్ ( Mehidy Hasan Miraz) ను స్టార్క్ టార్గెట్ చేశాడు. అతని బౌలింగ్ లో సింగిల్ తీసేందుకు మెహిదీ హసన్ మిరాజ్ ప్రయత్నించాడు. ఆ సమయంలో మిరాజ్ పరిగెత్తుతుండగా, స్టార్క్ అడ్డు తగిలి గొడవ పెట్టుకున్నాడు. నా దారిలోకి ఎందుకు వస్తున్నావురా ? అంటూ రెచ్చిపోయాడు.

Advertisement

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

ఈ క్రమంలో మెహిదీ హసన్ మిరాజ్ ను బూతులు కూడా తిట్టాడు. ఇంత జరుగుతున్న మిరాజ్ మాత్రం తన ఏకాగ్రత కోల్పోకుండా ఆ సైలెంట్ గా ఉన్నాడు. అంతలోనే అంపైర్ కుమార ధర్మసేన జోక్యం చేసుకొని, గొడవలు సద్దు సద్దు మణిగేలా చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారని.. అందుకే స్లెడ్జింగుకు దిగారని ఫైర్ అవుతున్నారు. మిరాజ్ తప్పులేకున్నా స్టార్క్ కు ఓవరాక్షన్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వెధవలపై వైన్స్‌ వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

లీడ్ సాధించిన బంగ్లాదేశ్‌

Advertisement

ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ ( Australia vs Bangladesh, 1st Test) మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో రెండు రోజులు ముగిశాయి. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 198 పరుగులకు కుప్పకూలింది. అటు బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. ఆరు వికెట్లు నష్టపోయి 351 పరుగులు సాధించింది. దీంతో 158 ప‌రుగుల లీడ్ సాధించింది.

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

 

 

Related News

బంగ్లాదేశ్ దూకుడు చూస్తే…ఆస్ట్రేలియా ఓడిపోయేలా ఉంది

హ్యారీ బ్రూక్ లాంటి వెధ‌వ‌ల‌ను మ‌ళ్లీ ఐపీఎల్ లోకి రానివ్వొద్దు !

మా పాకిస్తాన్ కెప్టెన్లు ద‌ద్ద‌మ్మ‌లు..400 వికెట్లు తీయ‌డానికి న‌ర‌కం అనుభ‌వించా

విరాట్ కోహ్లీ ఫాలోవర్స్ దెబ్బ అదుర్స్‌..త‌ల‌లు ప‌ట్టుకుంటోన్న పాకిస్తాన్‌

3 రోజుల్లో మ్యాచ్ ఫినిష్ చేసి…టీమిండియా ప్లేయ‌ర్ల‌కు నిద్ర‌లేకుండా చేస్తాం

టీమిండియాలో బాబ‌ర్ ఆజం ఉండింటే… ప్ర‌తీ మ్యాచ్ లోనూ సెంచ‌రీ చేసేవాడు

ఐపీఎల్ ప్రారంభిస్తే, క‌రోనా కంటే వేగంగా టీమిండియా క్రికెట‌ర్లు కోలుకుంటారు

Big Stories

Advertisement
×