E-Paper
Advertisement

1964లో మూసేసిన రైల్వే లైన్.. ఇప్పుడు ఏటా 60 వేల మంది సందర్శించే టూరిస్ట్ స్పాట్.. అలా ఎలా?

1964లో మూసేసిన రైల్వే లైన్.. ఇప్పుడు ఏటా 60 వేల మంది సందర్శించే టూరిస్ట్ స్పాట్.. అలా ఎలా?
Advertisement

Wisconsin Railway: ఒకప్పుడు రైళ్లు పరుగులు పెట్టిన రైల్వే మార్గం ఇప్పుడు ప్రకృతి ప్రేమికులకు, సైక్లిస్టులకు, హైకర్లకు ఇష్టమైన ప్రదేశంగా మారింది. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో ఉన్న ఎల్రాయ్ స్పార్టా రైల్వే కారిడార్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. 1964లో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కానీ, ఆ తర్వాత ఈ ప్రాంతానికి కొత్త గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఇది వినోద మార్గంగానే కాకుండా వన్యప్రాణులకు ఉపయోగపడే నేచురల్ కారిడార్‌ గా మారింది.

1870లో మొదలైన రైల్వే మార్గం

ఎల్రాయ్-స్పార్టా రైల్వే మార్గాన్ని 1870లలో చికాగో అండ్ నార్త్ వెస్ట్రన్ రైల్వే నిర్మించింది. విస్కాన్సిన్‌లోని ప్రత్యేకమైన డ్రిఫ్ట్‌ లెస్ ఏరియా మీదుగా ఈ మార్గం వెళ్లేది. కొండలు, అడవులు, వ్యవసాయ భూముల మీదుగా కొనసాగేది. ఈ మార్గంలో మూడు సొరంగాలు కూడా ఉన్నాయి. అయితే, 20వ శతాబ్దం ప్రారంభంలో రైల్వే సంస్థ మరో లైన్‌ను ఏర్పాటు చేసింది. దీంతో పాత మార్గంలో రైళ్ల రాకపోకలు క్రమంగా తగ్గిపోయాయి. చివరకు 1964లో పూర్తిగా నిలిచిపోయాయి.

రైల్వే నుంచి వినోద మార్గంగా

Advertisement

రైళ్లు ఆగిపోయిన తర్వాత ఈ 32.5 మైళ్ల మార్గం ఖాళీగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. కానీ, విస్కాన్సిన్ ప్రభుత్వం దీనిని మరో విధంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. 1967లో పాత రైల్వే మార్గాన్ని ఎల్రాయ్-స్పార్టా ట్రైల్గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. నాలుగేళ్ల తర్వాత దీనికి నేషనల్ రిక్రియేషన్ ట్రైల్ హోదా కూడా లభించింది. అమెరికాలో పాత రైల్వే మార్గాన్ని అడ్వెంచర్ రూట్ గా మార్చిన తొలి ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది.

రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన తర్వాత ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. గడ్డి, అడవి పూలు, చెట్లు పెరిగాయి. ప్రస్తుతం ఈ ట్రైల్ గడ్డి మైదానాలు, చిత్తడి నేలలు, అడవులు, వ్యవసాయ భూముల మధ్య అద్భుతమైన ప్రాంతంగా వెలుగొందుతోంది. దీంతో ఈ ప్రాంతం మనుషులకు మాత్రమే కాకుండా పక్షులు, జింకలు, చిన్న జంతువులకు కూడా ఉపయోగపడుతోంది. పొలాలు, రహదారులతో విడిపోయిన సహజ ప్రాంతాల మధ్య వన్యప్రాణులు సంచరిస్తూ ఆకట్టుకుంటున్నాయి.

ఏటా 60 వేల మంది సందర్శకులు

Advertisement

ప్రస్తుతం ఎల్రాయ్ స్పార్టా ట్రైల్‌ కు ప్రతి సంవత్సరం దాదాపు 60,000 మంది వస్తున్నారు. సైక్లిస్టులు, నడకకోసం  ఈ మార్గాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. మూడు పాత సొరంగాలు ఈ ట్రైల్‌ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు రైళ్లను నడిపిన మార్గం ఇప్పుడు ప్రజలను ప్రకృతికి దగ్గర చేస్తోంది. అదే సమయంలో వన్యప్రాణులకు కూడా సురక్షితమైన ప్రయాణ మార్గంగా మారింది. రైళ్లు ఆగిపోయినా.. ఈ రైల్వే మార్గం మాత్రం కొత్త రూపంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

Read Also: ఏఐతో ఏనుగులు సేఫ్, ఇక రైలు ప్రమాదాలు ఉండవట!

Tags

Related News

పండుగ రద్దీ వేళ రైల్వే గుడ్‌న్యూస్.. పలు రైళ్లకు అదనపు కోచ్‌లు!

రైలు టికెట్ ఉంటే సరిపోదు.. అక్టోబర్ 1 నుంచి ఈ రూల్స్ పాటించాల్సిందే!

పాలపిట్టను బంధిస్తే కఠిన చర్యలు.. దసరా వేళ ప్రభుత్వం సీరియస్ వార్నింగ్!

LNG రైలు vs హైడ్రోజన్ రైలు.. రెండింటి మధ్య అసలు తేడా ఇదే!

డీజిల్ ఖర్చు తగ్గించేందుకు రైల్వే కొత్త ప్లాన్.. ఫస్ట్ LNG రైలు వచ్చేసింది!

నిందితుల కోసం కదులుతున్న కారుపైకి దూకిన పోలీస్.. ఏకంగా 40 కిలో మీటర్లు కళ్లు చెదిరే ఛేజ్!

బోగీలోనే మూత్రం పోసిన తాగుబోతు, అందులోనే దొర్లించి.. చితక్కొట్టిన ప్రయాణికులు!

గగనతనంలో గల్లి చాయ్.. ఎయిర్ ఇండియా సరికొత్త ప్రయోగం!

Big Stories

Advertisement
×