E-Paper
Advertisement

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!
Advertisement

Apple Watch Series 12 review:  టెక్ ప్రపంచంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఆపిల్ వాచ్ సిరీస్ 12 మార్కెట్లోకి వచ్చి ట్రెండ్ సృష్టిస్తోంది. చూడటానికి ఇది మునుపటి మోడళ్ల లాగా ఉన్నప్పటికీ, లోపల మాత్రం అనేక అద్భుతమైన మార్పులతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా.. హెల్త్ ట్రాకింగ్, రీడినెస్ స్కోర్ , పవర్ ఫుల్ S11 చిప్‌తో ఇది ఒక బీస్ట్ లా పని చేస్తుంది. ఆపిల్ వాచ్ సిరీస్ 12 పూర్తి రివ్యూ , విశేషాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

1. డిజైన్ డిస్‌ప్లే:

ఆపిల్ వాచ్ సిరీస్ 12 డిజైన్ పరంగా పెద్దగా మార్పులు ఏమీ లేవు. అదే స్క్వేర్ కేస్, రైట్ సైడ్ డిజిటల్ క్రౌన్ , స్టైలిష్ లుక్ దీని సొంతం. అయితే.. ఈ సారి అల్యూమినియం మోడల్స్‌లో ‘సెరామిక్ షీల్డ్ 2’ ను వాడటం వల్ల ఇవి మరింత బలంగా తయారయ్యాయి. 42mm , 46mm సైజ్ ఆప్షన్లలో లభించే ఈ వాచ్, కొత్తగా డార్క్ బ్రాంజ్ , లైట్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో ఆకట్టుకుంటోంది.

2. ట్రాకింగ్‌లో బీస్ట్ లాంటి ఫర్మామెన్స్:

Advertisement

ఈ వాచ్‌కి ‘ట్రాక్స్ లైక్ ఎ బీస్ట్’ అనే పేరు రావడానికి ప్రధాన కారణం దీని కొత్త హెల్త్ సెన్సార్లు. ఇందులో ఉండే.. హార్ట్ రేట్ సెన్సార్ మునుపటి కంటే.. చాలా వేగంగా, కచ్చితంగా పని చేస్తుంది. సెకనుకు అనేక సార్లు హార్ట్ రేట్ , HRV ను రికార్డు చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం మన శరీర స్థితిని తెలియజేసే ‘రీడినెస్ స్కోర్’ ఫీచర్ ద్వారా ఇంటెన్స్ వర్కౌట్ చేయాలో.. లేక విశ్రాంతి తీసుకోవాలో ఈజీగా తెలుసుకోవచ్చు.

3. కొత్త S11 చిప్,AI ఫీచర్లు:

ఆపిల్ వాచ్ సిరీస్ 12 సరి కొత్త ‘S11’ ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది వాచ్ పని తీరును అత్యంత వేగంగా మారుస్తుంది. దీని లోని పవర్ ఫుల్ న్యూరల్ ఇంజిన్ కారణంగా సిరి అసిస్టెంట్ పని తీరు మరింత స్మూత్‌గా మారింది. అలాగే ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ ఆడియో ఇంటెలిజెన్స్ ఫీచర్లను ఇందులో చేర్చారు.

Advertisement

Also Read: రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

4. బ్యాటరీ లైఫ్ , ఛార్జింగ్ స్పీడ్:

స్మార్ట్‌వాచ్‌లలో బ్యాటరీ అనేది ఎప్పుడూ ఒక సవాలే. కానీ సిరీస్ 12 ఈ విషయంలో.. మంచి ఇంప్రూవ్‌మెంట్ చూపింది. సాధారణ వాడకంలో.. ఇది ఈజీగా 24 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. అలాగే.. ఔట్‌డోర్ వర్కౌట్ ట్రాకింగ్ సమయం కూడా పెరిగింది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల కేవలం కొద్ది నిమిషాల్లోనే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.

5.ధర:

మార్కెట్లో ఆపిల్ వాచ్ సిరీస్ 12 ప్రారంభ ధర సుమారు రూ. 56,900 నుంచి ప్రారంభమవుతుంది. ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, బెస్ట్ హెల్త్ ట్రాకింగ్ , ఆపిల్ ఎకోసిస్టమ్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

బయటికి చూడటానికి పాత లుక్కే కనిపించినప్పటికీ.. ఆపిల్ వాచ్ సిరీస్ 12 తన ఇంటర్నల్ అప్‌డేట్స్‌తో , బెస్ట్ హెల్త్ ఫీచర్లతో నిజంగానే ఒక బీస్ట్ లా ప నిచేస్తుంది. మీరు ఒక బెస్ట్, హై-ఎండ్ స్మార్ట్‌వాచ్ కొనాలనుకుంటే.. ఇది బెస్ట్ ఛాయిస్!

Related News

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

10నిమిషాల ఛార్జింగ్‌తో..200 నిమిషాల ప్లేటైమ్ ఇయర్ బడ్స్

ఇంతకీ ఈ LTPO డిస్‌ప్లే కథేంటి? స్మార్ట్‌ఫోన్లలో ఇది ఉంటే బ్యాటరీ లైఫ్ డబుల్ అవుతుందా?

రూ.499కే బ్లూటూత్ స్పీకర్..పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో ట్రెండీ మోడల్

Big Stories

Advertisement
×