Asus Chromebook CX15: ప్రముఖ అసుస్ సంస్థ భారత మార్కెట్లోకి కొత్తగా Chromebook CX15 ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. రోజూ ఆఫీస్ పనులు చేసుకునేవారికి, ఆన్‌లైన్ క్లాసెస్, ప్రాజెక్ట్ వర్క్ చేసేకునే విద్యార్థులకు, ప్రయాణాల్లో ల్యాప్‌టాప్ వాడేవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టైలిష్‌గా ఉండే ప్యూర్ గ్రే రంగులో లభించే ఈ ల్యాప్‌టాప్‌ను ప్రముఖ స్టోర్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలు చేయవచ్చు. నెలకు రూ.3,999 నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది. దీంతోపాటు ఒక ఏడాది వారంటీ, యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ లభిస్తాయి.
ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 అంగుళాల ఫుల్ HD IPS డిస్‌ప్లే ఇచ్చారు. సన్నని అంచులు, మంచి బ్రైట్‌నెస్‌తో వీడియోలు చూడటానికి ఇది చాలా బాగుంటుంది. ఇందులో ఇన్ఫినిటీ లుక్ కోసం 87 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ వేగంగా ప్రాసెస్ అవ్వడానికి ఇంటెల్ N50 ప్రొసెసర్, ఇంటెల్ UHD గ్రాఫిక్స్ ఉపయోగపడతాయి. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో పాటు ఆటోమేటిక్ సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇచ్చే క్రోమ్‌ఓఎస్ (ChromeOS) ఆధారంగా ఇది పనిచేస్తుంది.
Also Read: యూజర్లు నిద్రపోతున్నా బ్యాగ్రౌండ్‌లో వర్క్ కంప్లీట్ చేసే Google Gemini Spark.. భారత్‌లో లాంచ్!
ఈ క్రోమ్‌బుక్ కొనుగోలు చేసే వారికి ఉచితంగా 3 నెలల Google AI Pro మెంబర్‌షిప్ లభిస్తుంది. దీంతో Gemini AI Assistant, Gemini Notebook, Gmail, Docsలో స్మార్ట్ AI ఫీచర్లు వాడుకోవచ్చు. అలాగే Nano Banana AI ఇమేజ్ జనరేషన్, Goole Flow, Youtub Premium Lite, గూగుల్ ఫొటోస్‌లో అధునాతన ఎడిటింగ్ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. వీటితో పాటు ఏకంగా 5TB క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది.
ఈ Asus Chromebook CX15లో వైఫై 6, బ్లూటూత్ 5.4లతో పాటు రెండు టైప్-సి పోర్టులు, ఒక టైప్-ఎ పోర్ట్, HDMI, హెడ్‌ఫోన్ జాక్ ఇచ్చారు. ఇక సెక్యూరిటీ విషయానికొస్తే.. డేటా భద్రత కోసం టైటాన్-సి సెక్యూరిటీ చిప్, ప్రైవసీ షట్టర్‌తో కూడిన 720p HD వెబ్‌క్యామ్ అందించారు.
Asus Chromebook CX15ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 12.5 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బరువు కేవలం 1.59 కేజీలు మాత్రమే ఉండటం వల్ల ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. వాటర్ చిందినా పాడవని స్పిల్-రెసిస్టెంట్ కీబోర్డ్, అమెరికన్ మిలిటరీ గ్రేడ్ (MIL-STD-810H) నాణ్యతతో రావడం వల్ల ఇది చాలా గట్టిగా, మన్నికగా ఉంటుంది.
Also Read: సోనీ నుంచి రెండు కొత్త ఆడియో డివైజెస్ లాంచ్.. ఏఐ ఫీచర్లతో అదిరిపోయే సౌండ్ క్వాలిటీ!