E-Paper
Advertisement

డ్రెస్సింగ్ రూంలో ధోని న‌ర‌కం చూపించేవాడు…ముఖంపైనే డోర్లు వేసేవాడు

డ్రెస్సింగ్ రూంలో ధోని న‌ర‌కం చూపించేవాడు…ముఖంపైనే డోర్లు వేసేవాడు
Advertisement

Ajinkya Rahane On Ms Dhoni:  అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అజింక్య రహానే (Ajinkya Rahane).. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పై (MS Dhoni) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని గదిలోకి వెళ్లాలంటే కొన్ని కండీషన్స్ ఉండేవని.. అవి పాటించకపోతే ధోని గదిలోకి నో-ఎంట్రీ అంటూ ఘాటుగా స్పందించేవాడ‌ని గుర్తు చేశారు ర‌హానే. పైకి మహేంద్ర సింగ్ ధోని మిస్టర్ కూల్ గానే కనిపిస్తాడని.. రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం తాట తీస్తాడని హెచ్చరించారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అజింక్య రహానే, తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీమిండియాలో అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అజింక్య రహానే.

డ్రెస్సింగ్ రూంలో న‌ర‌కం చూపించేవాడు…ముఖంపైనే డోర్లు వేసేవాడు

మహేంద్ర సింగ్ ధోని అద్భుతమైన కెప్టెన్ అంటూ ప్రశంసించారు అజింక్య రహానే. అతని హయాంలో టీమిండియా అద్భుతమైన ఫలితాలను రాబట్టిందని వెల్లడించారు. అలాంటి కెప్టెన్ ఉండడం టీమిండియా అదృష్టమని కొనియాడారు. అయితే డ్రెస్సింగ్ రూమ్ లో మాత్రం ధోని కొన్ని కండీషన్స్ పెట్టేవాడని బాంబు పేల్చాడు. డ్రెస్సింగ్ రూమ్ లోని ధోని గది డోర్ ఓపెన్ ఉంటే.. ప్లేయర్లు ఎవరైనా లోపలికి వెళ్లి… సలహాలు, సూచనలు చేయవచ్చన్నారు. ఆ సమయంలో ధోని నుంచి కీలకమైన విషయాలు కూడా నేర్చుకోవచ్చని పేర్కొన్నారు. మ్యాచ్ లో ముందుకు ఎలా వెళ్లాలి ? అనే దాని పైన అన్వేషణ కూడా చేసే ఛాన్స్ ఉంటుందని వివరించారు.

Advertisement

Tanveer Ahmed On Babar Azam: టెస్టులను టీ20ల్లా బాబ‌ర్ ఆజం ఆడుతున్నాడు..ప్ర‌పంచ క్రికెట్ ను శాసిస్తాడు!

ధోని డోర్లు ఓపెన్ గా ఉంటే… 11 మంది ప్లేయర్లు లోపలికి వెళ్లినా అతడు.. చాలా ఓపికగా సలహాలు, సూచనలు చేస్తాడని వివరించారు. అదే ధోని డోర్లు క్లోజ్ గా ఉన్నప్పుడు.. లోపలికి ఎవరు వెళ్లకూడదని అర్థం అన్నారు. అలా డోర్లు క్లోజ్ చేసి ఉంటే.. ఎవరు లోపలికి రాకూడదని ధోని కండిషన్లు పెట్టేవాడని గుర్తు చేశారు. ఆ సమయంలో తాను రెస్ట్ మూడ్ లో ఉన్నానని అర్థం వచ్చేలా డోర్లు వేసేవాడని వెల్లడించారు అజింక్య రహానే. ఆ స‌మ‌యంలో అత‌ని గ‌దిలోకి వెళితే, సీరియ‌స్ అయ్యేవాడ‌ని షాకింగ్ వాస్త‌వాల‌ను బ‌య‌ట పెట్టారు అజింక్య ర‌హానే. ఇక తాను ఒత్తిడిలో ఉన్నప్పుడు నెట్ ఫ్లిక్స్ చూడడం, పుస్తకాలు చదవడం లేదా మరుసటి రోజు మ్యాచ్ కోసం బట్టలు ఇస్త్రీ చేసుకోవడం లాంటివి చేసేవాడినని… అది తనకు అలవాటైపోయిందని అజింక్య రహానే పేర్కొన్నారు. 2017 ఐపీఎల్ సమయంలో బెన్ స్టోక్స్ ఇచ్చిన సలహా మేరకు సోషల్ మీడియా యాప్స్ పూర్తిగా డిలీట్ చేశానని కూడా వివరించారు.

Advertisement

Rana Naved On Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్ ను రెండు బంతుల్లోనే ఔట్ చేస్తా..పాక్ బౌల‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

 

Related News

వైభ‌వ్ కు టెక్నిక్ లేదు…క‌ళ్లు మూసుకుని బ్యాట్ ఊపుతున్నాడు

అభిషేక్ శర్మ తండ్రికి ఘోర అవమానం..షాకింగ్ వీడియో వైర‌ల్

ధోని వల్లే రెండు వ‌ర్డ‌ల్ క‌ప్ ట్రోఫీలు వ‌చ్చాయి..కానీ ఆ ద‌ద్ద‌మ్ముల వ‌ల్ల కాదు !

భ‌యంక‌రంగా ఆడుతున్న అభిషేక్ శ‌ర్మపై ఐసీసీ విచార‌ణ చేయాలి..!

జై షా కాళ్ల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన రిజ్వాన్‌.. PCBపై ఫిర్యాదు చేస్తూ లేఖ‌

ఆసియా క్రీడల్లో భారత్ తో మ్యాచ్ ఉంటే, పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోతుంది

నన్ను దించేసి, PCB కుర్చీలో కూర్చునేందుకు కుట్ర‌లు చేస్తూనే ఉన్నారు

హర్మన్‌ప్రీత్ కౌర్ కు అస‌లు సిగ్గుందా? షేక్ హ్యాండ్ ఎలా ఇచ్చావంటూ ట్రోల్స్‌

Big Stories

Advertisement
×