E-Paper
Advertisement

సోనీ నుంచి రెండు కొత్త ఆడియో డివైజెస్ లాంచ్.. ఏఐ ఫీచర్లతో అదిరిపోయే సౌండ్ క్వాలిటీ!

సోనీ నుంచి రెండు కొత్త ఆడియో డివైజెస్ లాంచ్.. ఏఐ ఫీచర్లతో అదిరిపోయే సౌండ్ క్వాలిటీ!
Advertisement

Sony Headphones: మంచి క్వాలిటీ సౌండ్ కోరుకునే ఆడియో లవర్స్ కోసం సోనీ రెండు సూపర్ గ్యాడ్జెట్స్‌ను భారత్‌లో విడుదల చేసింది. WH1000XX హెడ్‌ఫోన్స్‌తో పాటు WF1000XM6 ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. మైండ్ బ్లోయింగ్ ఏఐ ఫీచర్లు, బయటి సౌండ్‌ను అస్సలు రానివ్వని నాయిస్ క్యాన్సిలేషన్‌తో ఇవి మ్యూజిక్ ప్రేమికులకు సరికొత్త అనుభూతిని అందించడానికి వచ్చేసాయి.

WH1000XX హెడ్‌ఫోన్స్ విశేషాలు:

సోనీ WH1000XX హెడ్‌ఫోన్స్ పవర్‌ఫుల్ సౌండ్ క్వాలిటీతో రూపొందించారు. వీటిలో సరికొత్త QN3 నాయిస్ క్యాన్సిలింగ్ ప్రాసెసర్, V3 ఇన్టిగ్రేటెడ్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇవి బయటి శబ్దాలను పూర్తిగా అడ్డుకొని మనం వినే సంగీతంపై మాత్రమే దృష్టి పెట్టేలా చేస్తాయి. ఏఐ వాయిస్ ప్రాసెసింగ్ ద్వారా ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు బయటి గోల వినపడదు. దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే.. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో ఏకంగా 24 గంటలు, అది లేకుండా 32 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తాయి.

Advertisement

Also Read: యూజర్లు నిద్రపోతున్నా బ్యాగ్రౌండ్‌లో వర్క్ కంప్లీట్ చేసే Google Gemini Spark.. భారత్‌లో లాంచ్!

WF1000XM6 ఇయర్ బడ్స్ ప్రత్యేకతలు:

ఈ WF1000XM6 ఇయర్ బడ్స్‌ మునుపటి మోడల్ కంటే దాదాపు 25 శాతం మెరుగైన నాయిస్ రిడక్షన్ అందిస్తాయని కంపెనీ చెప్తోంది. వీటిలో బోన్ కండక్షన్ సెన్సార్లు, ఏఐ పవర్డ్ వాయిస్ పికప్ ఫీచర్లను అందించారు. దీంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా అవతలి వారికి మీ వాయిస్ క్లియర్‌గా వినిపిస్తుంది. ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఇవి 24 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఇస్తాయి. కేవలం 5 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో దాదాపు 50 నిమిషాల పాటలు వినవచ్చు. ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెంట్ కూడా వీటి ప్రత్యేకత.

ధరల వివరాలు ఇలా:

Advertisement

ఇక ధరల విషయానికి వస్తే.. WH1000XX హెడ్‌ఫోన్స్ ధరను రూ.9,990గా, WF1000XM6 ఇయర్ బడ్స్ ధరను రూ.29,990గా నిర్ణయించారు. ఇవి ఆగస్టు 7 నుంచి సోనీ అధికారిక స్టోర్లు, ప్రముఖ ఆన్‌లైన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. అద్భుతమైన డిజైన్, మెరుగైన ఆడియో ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి ఇవి సరైన ఎంపిక అని చెప్పవచ్చు.

Also Read: ఒక్క TTE‌కి ఎన్ని కోచ్‌లు కేటాయిస్తారు? ఇండియన్ రైల్వే రూల్స్ ఏం చెబుతున్నాయి?

Related News

బెస్ట్ బ్లూటూత్ స్పీకర్..ఏఐ సౌండ్‌తో ఇల్లు దద్దరిల్లిపోతుంది

పాత టీవీ రిమోట్ పారేస్తున్నారా? ఈ 6 ట్రిక్స్ తెలిస్తే.. ఇంకెప్పుడు ఆ తప్పు చేయరు!

శాంసంగ్ A18 4G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, ఏఐ టూల్స్.. అదిరిపోయింది మామ!

థియేటర్‌ను మించిన సౌండ్ &పిక్చర్ క్వాలిటీ..తక్కువ ధరకే అదిరిపోయే టీవీ

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.51 కే అపరిమిత 5G డేటా.. ఇది కదా ప్లాన్ అంటే!

ఛార్జింగ్ టెన్షన్‌కు ఎండ్‌ కార్డ్‌..రూ.1275కే MIOX మ్యాజిక్ పవర్ బ్యాంక్!

జియో సెన్సేషనల్ ఆఫర్.. ఫ్రీగా ‘కాన్వా ప్రో’ సేవలు.. డిజైనర్ అవ్వడం ఇక చాలా ఈజీ!

యూట్యూబ్ సంపాదన ఇక మరింత టఫ్..కొత్త నిబంధనల పూర్తి వివరాలు!

Big Stories

Advertisement
×