Amazon Freedom Sale: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ నిర్వహిస్తున్న ‘గ్రేట్ ఫ్రీడమ్ సేల్’లో భాగంగా విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రియుల కోసం రకరకాల ట్యాబ్లెట్లపై మంచి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రూ.30,000 బడ్జెట్ పరిధిలో లభించే టాప్ మోడళ్లపై ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అర్హత ఉన్న HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.1,750 వరకు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.
చౌక ధరలో మంచి ట్యాబ్లెట్ కావాలనుకునే వారికి Lenovo IdeaTab, Samsung Galaxy Tab A11 Plus మంచి ఆప్షన్లు. లెనోవా మోడల్ రూ.24,999కి లభిస్తుండగా.. బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ.23,249కే సొంతం చేసుకోవచ్చు. ఇది 11 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే శాంంసంగ్ ఎ11 ప్లస్ సేల్ ధర రూ.23,999గా ఉంది. బ్యాంక్ ఆఫర్‌తో దీనిని రూ.22,249కి సొంతం చేసుకోవచ్చు. ఆన్‌లైన్ క్లాసులు, సాధారణ పనులకు ఇవి బాగా ఉపయోగపడతాయి.
Also Read: క్వాల్కమ్ ప్రాసెసర్‌తో HP OmniPad 12 వచ్చేసింది.. రూ. 5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఎలా పొందాలంటే?
కొంచెం ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి Samsung Galaxy Tab S10 Lite, Redmi Pad 2 Proలను పరిశీలించవచ్చు. శాంంసంగ్ ఎస్10 లైట్ రూ.29,999కి లభిస్తుండగా.. డిస్కౌంట్‌తో రూ.28,249కి వస్తుంది. మరోవైపు పెద్ద స్క్రీన్, 12000mAh పెద్ద బ్యాటరీ కోరుకునే వారికి Redmi Pad 2 Pro బెస్ట్ ఆప్షన్. దీని సేల్ ధర రూ.27,999 కాగా, బ్యాంక్ ఆఫర్‌తో రూ.26,249కే లభిస్తుంది. సినిమాలు చూడటానికి, గేమింగ్‌కు ఇది చాలా బాగుంటుంది.
బడ్జెట్‌ను కాస్త పెంచుకోగలిగితే OnePlus Pad 2 మంచి ఎంపిక. దీని సేల్ ధర రూ.31,999 కాగా.. బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ.30,249కి అందుబాటులోకి వస్తుంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, 12GB ర్యామ్, 256GB స్టోరేజ్, 144Hz రీఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే లభిస్తాయి. హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్ చేసేవారికి ఇది సెట్ అవుతుంది.
Also Read: రూ.2 లక్షలా? ఈ ఫోన్లలో అంతలా ఏముంది భయ్యా.. శాంసంగ్ లేటెస్ట్ ఫోల్డబుల్స్ సేల్స్ షురూ!