E-Paper
Advertisement

కాలేజ్ స్టూడెంట్స్ కోసం బెస్ట్ బడ్జెట్ ల్యాప్‌టాప్స్.. ఏది కొంటే బెటర్?

కాలేజ్ స్టూడెంట్స్ కోసం బెస్ట్ బడ్జెట్ ల్యాప్‌టాప్స్.. ఏది కొంటే బెటర్?
Advertisement

Best budget laptop for college students 2026: కాలేజ్ లేదా యూనివర్సిటీకి వెళ్లే.. విద్యార్థులకు ల్యాప్‌ టాప్ అనేది ఇప్పుడు నిత్యావసర వస్తువుగా మారి పోయింది. ఆన్‌లైన్ క్లాసులు, అసైన్‌ మెంట్లు,కోడింగ్ ప్రాజెక్ట్‌‌లు, ఎంటర్‌ టైన్‌మెంట్ కోసం ప్రతి స్టూడెంట్‌కూ ఒక మంచి ల్యాప్‌ టాప్ అవసరం. అయితే తక్కువ బడ్జెట్‌లో ..ఎక్కువ ఫీచర్లు ఇచ్చే ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. స్టూడెంట్స్ బడ్జెట్‌కు.. సరి పోయేలా మార్కెట్‌లో లభిస్తున్న టాప్ ల్యాప్‌ టాప్‌లు , వాటి ధరల వివరాలు ఇప్పుడు చూద్దాం.

కాలేజీల విద్యార్థులు తమ ప్రాజెక్ట్‌లు, ప్రెజెంటేషన్లు, ఆన్‌లైన్ లెర్నింగ్ కోసం బెస్ట్ ఇచ్చే ల్యాప్‌ టాప్‌ను కోరుకుంటారు. ముఖ్యంగా..తక్కువ బడ్జెట్‌లో.. ఎక్కువ బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ ఉండే.. మోడల్స్ మార్కెట్లో ట్రెండ్‌లో ఉన్నాయి. తాజా మార్కెట్ అప్‌డేట్స్ ప్రకారం స్టూడెంట్స్‌‌కు బెస్ట్ ఆప్షన్స్‌గా నిలుస్తున్న కొన్ని ల్యాప్‌ టాప్‌ల లిస్ట్..

స్టూడెంట్స్‌‌కు బెస్ట్ ల్యాప్ ట్యాప్స్: 

1. Lenovo IdeaPad Slim 3:

Advertisement

స్టూడెంట్స్ బడ్జెట్ ల్యాప్‌ టాప్‌ల లిస్ట్‌లో లెనోవో ఐడియాప్యాడ్ సిరీస్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇది తేలికైన.. డిజైన్‌తో పాటు స్టైలిష్ లుక్‌ను కలిగి ఉంటుంది. ఇంటెల్ కోర్.. i3 లేదా AMD్రైజెన్ 3 ప్రాసెసర్‌తో.. వచ్చే ఈ ల్యాప్‌టాప్, రోజూవారీ కాలేజ్ వర్క్, డాక్యుమెంట్ ఎడిటింగ్ , బ్రౌజింగ్‌కు అద్భుతంగా పని చేస్తుంది. మంచి బ్యాటరీ బ్యాకప్ ఉండటం వల్ల క్లాసులకు తీసుకెళ్లడం చాలా ఈజీ.

ధర: సుమారు రూ.32,000 నుంచి రూ.38,000 మధ్య లభిస్తుంది.

2. HP 15s:

Advertisement

హెచ్‌పీ బ్రాండ్ క్వాలిటీ, కస్టమర్ సపోర్ట్‌కు పెట్టింది పేరు. HP 15s మోడల్ పెద్ద స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. అంతే కాకుండా ఇది నోట్స్ చదువుకోవడానికి, వీడియో క్లాసులు వినడానికి సౌకర్యంగా ఉంటుంది. దీనిలో ఎస్‌డీడీ స్టోరేజ్ ఉండటం వల్ల ల్యాప్‌ టాప్ బూట్ అవ్వడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. స్పీడ్ కూడా బాగుంటుంది.

ధర: కాన్ఫిగరేషన్‌ను బట్టి సుమారు రూ. 35,000 నుంచి రూ.42,000 వరకు ఉంటుంది.

3. ASUS Vivobook 14:

యూత్ ట్రెండ్‌కు తగ్గట్టుగా అట్రాక్టివ్ లుక్‌లో.. లభించే ఆసుస్ వివోబుక్ స్టూడెంట్స్‌ను ఎంత గానో ఆకట్టుకుంటోంది. పవర్ ఫుడ్ ప్రాసెసర్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ , ఎర్గోనామిక్ కీబోర్డ్ దీని ప్రత్యేకతలు. ఎక్కువ సేపు టైపింగ్ చేసే విద్యార్థులకు ఈ కీబోర్డ్ చాలా సౌకర్యంగా ఉంటుంది.

ధర: దాదాపు రూ.33,000 నుంచి రూ.39,000 వరకు ఉంది.

4. Acer Aspire Lite:

తక్కువ బడ్జెట్‌లో హై-ఎండ్ స్పెసిఫికేషన్స్ కోరుకునే వారికి ఏసర్.. ఆస్పైర్ లైట్ పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది మెటల్ ఫినిషింగ్‌తో ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. కోడింగ్ నేర్చుకునే.. ఇంజనీరింగ్ విద్యార్థులకు, మల్టీ టాస్కింగ్ చేయాలనుకునే వారికి ఇది చక్కగా సరి పోతుంది. పలు రకాల పోర్ట్స్ అందుబాటులో.. ఉండటం వల్ల పెన్‌డ్రైవ్‌లు, ప్రొజెక్టర్లు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.

ధర: సుమారు రూ.30,000 నుంచి రూ.36,000 వరకు లభిస్తుంది.

Also Read: లేటెస్ట్ వాషింగ్ మెషీన్లు..ఆటో రీస్టార్ట్ ఫీచర్‌తో అదుర్స్!

5. Chuwi / Realme Book:

మీ బడ్జెట్ చాలా తక్కువగా ఉండి, కేవలం బేసిక్ కాలేజ్ వర్క్స్, పీడీఎఫ్ రీడింగ్,బ్రౌజింగ్ కోసం మాత్రమే ల్యాప్‌ టాప్ కావాలంటే.. ఈ కేటగిరీలోని ల్యాప్‌ టాప్‌లు మంచి ఆప్షన్. తక్కువ బరువుతో.. పాటు మంచి డిస్‌ప్లే క్వాలిటీని ఇవి అందిస్తాయి.

ధర: సుమారు రూ. 24,000 నుంచి రూ. 28,000 వరకు లభిస్తుంది.

Related News

వింటర్ వచ్చేసింది..గీజర్ సర్వీసింగ్ చేయించకుండా ఆన్ చేస్తే భారీ మూల్యం తప్పదు!

పాటలు వినొచ్చు, ఫోన్ కాల్స్ మాట్లాడొచ్చు.. హ్యాండ్స్‌ఫ్రీ ఎక్స్‌పీరియన్స్‌తో శాంసంగ్ ఏఐ గ్లాసెస్!

నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?ఇంట్లోనే ఇలా రీసెట్ చేసుకోండి!

ఫ్రిజ్ దగ్గర గ్యాస్ సిలిండర్ ఉందా? వెంటనే ఈ తప్పు సరిదిద్దుకోండి!

సంచలనం సృష్టిస్తున్న Google Pixel 11a లీక్స్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

ఎయిర్‌టెల్ vs వీఐ.. ఒకే ధరకు రూ.3,999 వార్షిక ప్లాన్.. ఏది రీఛార్జ్ చేస్తే ఎక్కువ బెనిఫిట్?

BSNL సంచలన ఆఫర్.. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్లతో ఉచితంగా ఇన్సూరెన్స్.. పూర్తి వివరాలు ఇవే!

Big Stories

Advertisement
×