E-Paper
Advertisement

తెలంగాణ సచివాలయానికి మంచినీటి స‌ర‌ఫ‌‌రా బంద్!

తెలంగాణ సచివాలయానికి మంచినీటి స‌ర‌ఫ‌‌రా బంద్!
Advertisement

Secretariat: పాలనకే గుండెకాయ లాంటి తెలంగాణ సచివాలయంలో ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం బిజీ బిజీగా ఉండే సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి ఇప్పుడు తాగునీటి తిప్పలు వచ్చిపడ్డాయి. ఏళ్లుగా మంచినీటి బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు సరఫరాను ఉన్నపళంగా నిలిపివేయడమే దీనికి ప్రధాన కారణం.

రూ. 50 లక్షల బకాయిలు..

Advertisement

సచివాలయానికి మంచినీటి క్యాన్లను సరఫరా చేసే నాలుగు ప్రైవేటు ఏజెన్సీలకు ప్రభుత్వం సుమారు రూ. 50 లక్షలకు పైగా బాకీ పడింది. ఒక్కో డిపార్ట్‌మెంట్ పరిధిలో రూ. లక్షల్లో బిల్లులు పెండింగ్‌లో  ఉండటంతో ఏజెన్సీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నాయి. దీంతో పాత బకాయిలు పూర్తిగా క్లియర్ చేస్తేనే మళ్లీ వాటర్ క్యాన్లు సరఫరా చేస్తాం అని కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తూ సరఫరాను నిలిపివేశారు.

ఇంటి నుంచే బాటిళ్లు తెచ్చుకోండి..

Advertisement

నీటి సరఫరా ఆగిపోవడంతో ప్రత్యామ్నాయం లేక ఆయా శాఖల పేషీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది ఎవరికి వారే ఇళ్ల నుంచి నీళ్ల బాటిళ్లు తెచ్చుకోవాలని అంతర్గతంగా సూచించినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వానికి వేల కోట్ల బడ్జెట్ ఉన్నా, కనీసం తాగే నీటి బిల్లులు కూడా చెల్లించకపోవడం ఏంటని ఉద్యోగులు లోలోపల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ బకాయిలను విడుదల చేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Also Read: కేంద్రంతో తెలంగాణ రోడ్ల ముచ్చట.. నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక భేటీ!

Tags

Related News

కేంద్రంతో తెలంగాణ రోడ్ల ముచ్చట.. నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక భేటీ!

ఒక్కో అధికారికి 10 మండలాలా? తెలంగాణ ఉద్యాన శాఖలో ఏం జరుగుతోంది!

తెలంగాణ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం.. 35 మంది జూనియర్ లెక్చరర్ల తొలగింపు!

కేటీఆర్‌కు మతిస్థిమితం లేదు.. ఎర్రగడ్డకు పంపాల్సిందే!- గజ్జెల కాంతం

బీఆర్ఎస్ నేతలకు కొత్త టెన్షన్.. వచ్చే ఎన్నికల్లో 40 మందికి టికెట్లు కట్? వెనుక ఏం జరిగింది?

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మారిన మున్సిపల్ నిబంధనలు.. ఈ కొత్త క్యూర్‌ మార్పులు మీకోసమే!

ఖైరతాబాద్‌పై కన్నేసిన తలసాని.. బీఆర్‌ఎస్‌లో ఊహించని షాక్ ఎదురైందా?

Big Stories

Advertisement
×