E-Paper
Advertisement

స్మార్ట్ ఫీచర్స్,ఎక్కువ స్పేస్! మీ ఇంటికి తగ్గ డబుల్ డోర్ ఫ్రిజ్‌లు

స్మార్ట్ ఫీచర్స్,ఎక్కువ స్పేస్! మీ ఇంటికి తగ్గ డబుల్ డోర్ ఫ్రిజ్‌లు
Advertisement

Double Door Refrigerator 300L: నేటి కాలంలో ప్రతి ఇంట్లోనూ ఫ్రిజ్ ఒక ముఖ్యమైన భాగమైపోయింది. ముఖ్యంగా 3 నుంచి 5 మంది సభ్యులు ఉండే మిడ్-సైజ్ ఫ్యామిలీకి సరైన స్పేస్, మెరుగైన కూలింగ్ ఇచ్చే ఫ్రిజ్ ఎంతో అవసరం. పాతకాలపు చిన్న ఫ్రిజ్‌లలో కూరగాయలు, వంటకాలు సర్దడం పెద్ద సర్కస్ ఫీట్ లాంటిదే! అందుకే.. మీ శ్రమ తగ్గించి, ప్రెష్‌నెస్‌ని పెంచే 300 లీటర్లకు పైగా కెపాసిటీ ఉన్న టాప్ 5 డబుల్ డోర్ ఫ్రిజ్ ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బెస్ట్ 300L+ డబుల్ డోర్ ఫ్రిజ్‌లు:

ఇంట్లో ఫ్రిజ్ కొనేటప్పుడు డిజైన్ ఎంత ముఖ్యమో, అందులోని స్పేస్, టెక్నాలజీ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ మోడల్స్, వాటి వివరాలు..

1.LG 322L 3-Star Double Door Refrigerator:

Advertisement

మీరు తక్కువ కరెంట్ బిల్లుతో ఎక్కువ పర్ఫార్మెన్స్ కోరుకుంటే ఎల్జీ బ్రాండ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇందులోని ఫీచర్ ‘కరెంట్ ఖర్చును చాలా వరకు తగ్గించడమే కాకుండా చాలా నిశ్శబ్దంగా పని చేస్తుంది. ఇందులోని ప్రత్యేకమైన మరో ఫీచర్ వల్ల ఫ్రిజ్ డోర్ వైపు ఉన్న వస్తువులకు, బాటిళ్లకు కూడా చాలా వేగంగా సమానమైన కూలింగ్ అందుతుంది. 300 లీటర్లకు పైగా కెపాసిటీ ఉండటంతో పెద్ద పెద్ద పాత్రలను కూడా చాలా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.

ధర రూ.34,990 నుంచి రూ. 38,000 వరకు ఉంటుంది.

2.Samsung 324L Double Door Refrigerator:

Advertisement

సామ్‌సంగ్ కన్వర్టబుల్ ఫ్రిజ్‌లకు ప్రస్తుతం మార్కెట్‌లో చాలా ఫుల్ డిమాండ్ ఉంది. ఇందులో ఉన్న ‘5-in-1 కన్వర్టబుల్’ మోడ్స్ సహాయంతో మీ ఇంట్లో పండగలు లేదా ఫంక్షన్ల సమయంలో ఫ్రీజర్ భాగాన్ని కూడా సాధారణ ఫ్రిజ్‌గా మార్చుకోవచ్చు. ఇందులోని టెక్నాలజీ ఆహారం త్వరగా పాడవకుండా చూస్తూ, తేమ శాతాన్ని ఎల్లప్పుడూ సరైన స్థాయిలో కాపాడుతుంది. అంతేకాకుండా ఫ్రిజ్‌లో ఇతర వంటకాల చెడు వాసన రాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా డీఓడరైజర్ కూడా అందుబాటులో ఉంది.

ధర: రూ.36,990 నుంచి రూ. 41,000 వరకు ఉంటుంది.

3.Whirlpool 340L 3-StarDouble Door Refrigerator:

ఎక్కువ స్టోరేజ్ , దీర్ఘకాలిక కూలింగ్ రిటెన్షన్ కోరుకునే వారికి వర్ల్‌పూల్ సరైన ఎంపిక. ఇందులోని లేటెస్ట్ ఫ్రిజ్ లోపల ఉన్న లోడ్‌ను బట్టి కూలింగ్‌ను తానంతట తానే అడ్జస్ట్ చేసుకుంటుంది. హఠాత్తుగా కరెంట్ పోయినప్పటికీ దాదాపు 18 గంటల పాటు ఆహార పదార్థాలు పాడవకుండా కూలింగ్‌ను కాపాడే ప్రత్యేక సామర్థ్యం దీనికి ఉంది. అలాగే ఇందులోని టెక్నాలజీ కూరగాయలు, పండ్లపై బాక్టీరియా చేరకుండా చూస్తుంది.

ధర: రూ.35,490 నుంచి రూ.39,000 వరకు ఉంటుంది.

4.Haier 325L 3-Star Double Door Refrigerator:

హైయర్ అందించే ఈ బాటమ్ మౌంటెడ్ ఫ్రిజ్ ప్రస్తుతం చాలా ట్రెండింగ్‌లో ఉంది. సాధారణంగా మనం రోజువారీ ఎక్కువగా వాడే ఫ్రిజ్ భాగం పైన, ఐస్ ఫ్రీజర్ భాగం కింద ఉంటుంది. దీని వల్ల ప్రతిసారీ కూరగాయలు లేదా పాలు తీయడానికి కిందకు వంగాల్సిన అవసరం లేకుండా హాయిగా వాడుకోవచ్చు. ఇందులో ఉన్న ’14-in-1 కన్వర్టబుల్’ మోడ్స్ సహాయంతో స్టోరేజ్‌ను మన అవసరాలకు తగినట్లు మార్చుకోవచ్చు. అలాగే అత్యవసర సమయంలో ‘టెక్నాలజీ ద్వారా కేవలం గంటలోనే ఐస్ ప్రొడ్యూస్ అవుతుంది.

ధర: రూ.33,990 నుంచి 37,500 వరకు ఉంటుంది.

5.Godrej 311L 3-Star Double Door Refrigerator:

ఈ మోడల్‌లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఆహార పదార్థాలపై 95% కంటే ఎక్కువ బాక్టీరియా చేరకుండా రక్షణ లభిస్తుంది. ఇందులో చాలా పెద్దగా ఉండే వెజిటెబుల్ ట్రే, ప్యాంట్రీ స్పేస్ , ఇన్వర్టర్ కంప్రెసర్ ఫీచర్లు ఉన్నాయి. తక్కువ కరెంట్ ఖర్చుతో పాటు ఎక్కువ స్థలం కావాలనుకునే మిడ్-సైజ్ కుటుంబాలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

ధర: రూ.31,990 నుంచి 35,000 వరకు ఉంటుంది.

ఫ్రిజ్ కొనేముందు గమనించాల్సిన అంశాలు:

స్టార్ రేటింగ్: కనీసం 3-స్టార్ లేదా అంతకంటే.. ఎక్కువ ఉన్న ఫ్రిజ్‌లను ఎంచుకుంటే కరెంట్ బిల్లు ఆదా అవుతుంది.

కన్వర్టిబుల్ మోడ్స్: పండగలు, ఫంక్షన్ల సమయంలో ఎక్కువ స్పేస్ కావాలనుకునే వారికి కన్వర్టిబుల్ ఫ్రిజ్‌లు బాగా ఉపయోగపడతాయి.

వారంటీ: ఫ్రిజ్ కొనేముందు కంప్రెసర్ పై 10 ఏళ్ల వారంటీ ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు.

Related News

పవర్‌ఫుల్ కెమెరా, బిగ్ బ్యాటరీ.. Sony Xperia 1 IX లోని స్పెషల్ ఫీచర్లు ఇవే!

Galaxy Watch 4, Classic యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఇక సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు!

వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. రూ.13,000 ఆదా చేసుకునే ఛాన్స్, ఆఫర్ లిమిటెడ్!

తక్కువ ధరలో అదుర్స్ అనిపించే వాచ్ కావాలా? ఈ స్మార్ట్‌వాచ్ మిస్ కావద్దు!

80ల్లో ఫోన్ కాల్.. త్వరగా మాట్లాడకపోతే జేబు ఖాళీ, ఇంట్లో ల్యాండ్‌లైన్ ఉంటే.. అదో స్టేటస్

రూ.30వేలలోపు బెస్ట్..కూకా Y74 ప్లస్ 55 ఇంచుల టీవీ రివ్యూ!

తక్కువ ధరలో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్.. రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ ఇంట్లోనే

అంతరిక్షంలో అడుగుపెట్టి.. సొంత శాటిలైట్లతో సత్తా చాటి.. 80ల్లో ISRO అంటే ఫ్లవర్ కాదు ఫైర్!

Big Stories

Advertisement
×