E-Paper
Advertisement

కొత్త టయోటా హిలక్స్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదా కావాల్సిందే!

కొత్త టయోటా హిలక్స్ వచ్చేసింది..  ఫీచర్లు చూస్తే ఫిదా కావాల్సిందే!
Advertisement

2026 Toyota Hilux India Launch: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2026 హిలక్స్ పికప్ ట్రక్కును  టయోటా భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. న్యూ జెనరేషన్ హిలక్స్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.31.99 లక్షలుగా నిర్ణయించింది. కొత్త డిజైన్, క్యాబిన్‌లో అత్యాధునిక ఫీచర్లు, మెరుగైన టెక్నాలజీతో ఈ మోడల్‌ను తీసుకొచ్చింది. బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభం కాగా, ఆగస్టు రెండో వారం నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

మూడు వేరియంట్లలో అందుబాటులోకి!

కొత్త హిలక్స్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. GX 4×2 AT ధర రూ.31.99 లక్షలు, GX 4×4 AT ధర రూ.33.69 లక్షలు, టాప్ ఎండ్ VX 4×4 AT ధర రూ.36.69 లక్షలుగా నిర్ణయించింది. ఈ పికప్ ట్రక్ మార్కెట్ లో ఇసుజు V-క్రాస్‌ కు పోటీగా నిలవనుంది.

డిజైన్ గురించి..

Advertisement

డిజైన్ పరంగా కొత్త హిలక్స్ మరింత క్రేజీ లుక్ ను సంతరించుకుంది. ముందు భాగంలో పెద్ద హనీకోంబ్ గ్రిల్‌పై  TOYOTA అక్షరాలు కనిపిస్తున్నాయి. కొత్త LED హెడ్‌ ల్యాంప్స్, డే టైమ్ రన్నింగ్ లైట్స్, వెడల్పాటి ఎయిర్ ఇన్‌ టేక్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్ వాహనానికి మరింత ఆకర్షణీయమైన రూపాన్ని అందిస్తున్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో కొత్త 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, బ్లాక్ వీల్ ఆర్చ్ క్లాడింగ్, రోల్ బార్‌లు, ఫుట్‌ బోర్డ్‌ లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఫోల్డబుల్ ORVMలు, షార్క్ ఫిన్ యాంటెన్నా కూడా ఉంది. వెనుక భాగంలో C-ఆకారపు LED టెయిల్ లైట్లు, టెయిల్‌ గేట్‌పై TOYOTA అక్షరాలు, కార్గో బెడ్‌ లోకి ఎక్కడానికి ప్రత్యేక స్టెప్‌తో కూడిన కొత్త బంపర్ ఉన్నాయి.

ప్రీమియం ఇంటీరియర్

ఇంటీరియర్ కూడా పూర్తిగా అప్‌డేట్ అయింది. కొత్త డ్యాష్‌ బోర్డ్‌ తో పాటు 12.3 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్టీరింగ్ వీల్‌ ను అందించారు. వైర్‌ లెస్ ఆపిల్ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌ లెస్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్, 8 స్పీకర్ ఆడియో సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా లాంటి ఫీచర్లు  ఉన్నాయి. ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు డ్రైవ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

అత్యాధునిక భద్రతా ఫీచర్లు

Advertisement

భద్రత విషయంలో మాత్రం టయోటా ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో 7 ఎయిర్‌ బ్యాగ్‌లు, ABS, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్,  ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్లు లాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

ఇంజిన్ గురించి..

ఇంజిన్ పరంగా 2.8 లీటర్ నాలుగు సిలిండర్ల డీజిల్ ఇంజిన్‌ను అలాగే కొనసాగించింది. ఇది 204 హెచ్‌పీ పవర్, 500 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈసారి మాన్యువల్ గేర్‌బాక్స్‌ను తొలగించి, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్‌ ను మాత్రమే అందిస్తోంది. అలాగే 4×4 వేరియంట్‌తో పాటు కొత్తగా 4×2 ఆటోమేటిక్ వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. 2026 టయోటా హిలక్స్ కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లు, మంచి ఆఫ్ రోడ్ సామర్థ్యాలతో ప్రీమియం పికప్ సెగ్మెంట్‌ లో సత్తా చాటనుంది.

Read Also: థార్ రాక్స్ స్టైల్ స్క్రీన్లతో స్కార్పియో N.. లీక్‌లో బయటపడ్డ క్రేజీ డీటైల్స్!

Related News

హోండా సంచలన నిర్ణయం.. భారత్ నుంచే ప్రపంచానికి కొత్త బైక్స్ ఎగుమతులు!

థార్ రాక్స్ స్టైల్ స్క్రీన్లతో స్కార్పియో N.. లీక్‌లో బయటపడ్డ క్రేజీ డీటైల్స్!

కొత్త ఫీచర్లు.. కొత్త డిజైన్.. ఆగస్టులో వస్తున్న 3 సూపర్ మోడళ్లు ఇవే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ డబుల్ గేమ్.. ఒకవైపు ఈవీలు.. మరోవైపు పెట్రోల్ బైక్‌లు!

నిస్సాన్ టెక్టన్, బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ డెలివరీలు స్టార్ట్.. కస్టమర్లకు తాళాలు అందజేత!

ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌ లో సంచలనం.. అవోర్ నుంచి ఒకేసారి ఏకంగా 3 కొత్త మోడళ్లు లాంచ్!

ఫోన్ టచ్ చేయాల్సిన పనిలేదు.. ఈ హెల్మెట్ అన్నీ చూసుకుంటుంది!

Big Stories

Advertisement
×