AP Rain Alert: బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఏర్పింది. దీంతొ ఏపీ వ్వాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల తెలిపారు. ఈ నేపథ్యంలో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్షనిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలు, విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, ఉన్నత అధికారులతో మంత్రి అనిత అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
అల్పపీడనం ఎల్లుండి నాటికి తీవ్రవాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో రాష్టంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత అన్నారు. వర్ష ప్రభావిత జిల్లాల అధికారులకు సూచనలు జారీ చేసిన హోంమంత్రి.
Also read: 190 ఎకరాల భూ కబ్జా.. ఆధారాలు ఉన్నాయి.. తాడిపత్రిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఒడిశాలో వర్షాలతో వంశధార, నాగావళి నదులకు పొంగే అవకాశం ఉందని అన్నారు. బోర్డర్ ఒడిశా జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి తెలిపారు. సహాయక చర్యల కోసం SDRF, NDRF బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశాలిచ్చారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి అనిత ఆదేశాలిచ్చారు అవసరమైతే తీరం వెంబడి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు.
వాగులు, పొంగిపొర్లే కాజ్‌వేలు, ముంపు ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. కంట్రోల్ రూమ్‌లను 24 గంటలూ అందుబాటులో ఉంచి, పరిస్థితిని నిరంతరం సమీక్షించాలన్నారు. తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెట్లు, భారీ హోర్డింగ్స్ , శిధిలావస్థలో ఉన్న ఇళ్ళ వద్ద ప్రజలు ఉండరాదని క్లారిటీ ఇచ్చారు. ప్రజలు ప్రభుత్వ వాతావరణ హెచ్చరికలు పాటించాలని తగిన జాగ్రత్తులు తీసుకోవాలని హోం మంత్రి అనిత అన్నారు.
Also read: చిన్న కార్లు.. పెద్ద రేంజ్.. ఇండియన్ మార్కెట్ లోకి 5 చౌకైన ఈవీలు!