E-Paper
Advertisement

ఒకే ఒక్క తప్పిదం.. ఎడారిలో ఏర్పడ్డ ‘బుల్లి సముద్రం’.. సరిగ్గా 100 ఏళ్ల క్రితం ఏం జరిగింది?

ఒకే ఒక్క తప్పిదం.. ఎడారిలో ఏర్పడ్డ ‘బుల్లి సముద్రం’.. సరిగ్గా 100 ఏళ్ల క్రితం ఏం జరిగింది?
Advertisement

Salton Sea: నూరేళ్ల క్రితం కాలిఫోర్నియా ఎడారిలో ఇంజనీర్లు చేసిన ఒక చిన్న పొరపాటు ఒక మహా నది దిశను మార్చేసింది. సముద్ర మట్టానికి అత్యంత దిగువన ఉన్న ఒక మైదాన ప్రాంతంలోకి కొలరాడో నది ఉప్పొంగి ప్రవహించడంతో ఎవరూ ఊహించని రీతిలో ఒక సముద్రం లాంటి సరస్సు వెలిసింది. అదే ‘సాల్టన్ సీ’ (Salton Sea). కాలిఫోర్నియాలోనే అత్యంత వైశాల్యం కలిగిన సరస్సుగా పేరుగాంచిన ఈ జలాశయం.. అసలు ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది కాదు. మానవ తప్పిదంతో పుట్టుకొచ్చిన ఒక అద్భుతం.

కాలువ తొవ్వి.. వరదను ఆహ్వానించి!

ఈ ఆసక్తికర విషయం 1905లో ప్రారంభమైంది. ఎడారి ప్రాంతమైన ‘ఇంపీరియల్ వ్యాలీ’ని సేద్యానికి అనువుగా మార్చేందుకు ‘కాలిఫోర్నియా డెవలప్‌మెంట్ కంపెనీ’ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందుకోసం కొలరాడో నది నుంచి నీటిని మళ్లించేందుకు ఒక నీటిపారుదల కాలువను తవ్వారు. అయితే ఆ సమయంలో కొలరాడో నదిలో ఊహించని స్థాయిలో నీటి ఉధృతి పెరిగింది. ప్రవాహ వేగానికి కాలువ తట్టుకోలేకపోయింది. హెడ్‌వర్క్స్ విరిగిపోయి, నీరు కట్టలు తెంచుకుని సముద్ర మట్టానికి దాదాపు 200 అడుగుల దిగువన ఉన్న ‘సాల్టన్ సింక్’ అనే పల్లపు ప్రాంతాన్ని ముంచెత్తింది.

రెండేళ్ల పాటు ఆగని ఉప్పెన..

Advertisement

నీటిని నియంత్రించేందుకు చేసిన ప్రయత్నాలు కాస్తా మహా వరదకు దారితీశాయి. దీంతో ఏకంగా రెండేళ్ల పాటు కొలరాడో నది నీరు నిరంతరాయంగా ఆ పల్లపు ప్రాంతంలోకి పారుతూనే వచ్చింది. ఫలితంగా ప్రవాహాన్ని అడ్డుకోవడానికి తాత్కాలికంగా వేసిన కట్టలన్నీ కొట్టుకుపోయాయి. దక్షిణ కాలిఫోర్నియాలోని వ్యవసాయ భూములు, నివాసాలు, మౌలిక వసతులు ఈ వరద దెబ్బకు నీట మునిగాయి. చివరికి సదరన్ పసిఫిక్ రైల్‌రోడ్ పట్టాల దాకా నీరు చేరడంతో రైల్వే వ్యవస్థను కాపాడుకోవడానికి ఎమర్జెన్సీ బృందాలు అప్పట్లో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టాల్సి వచ్చింది.

బయటకు వెళ్లే దారి లేక..

చివరకు వరద ప్రవాహం ఆగినా ఆ నీరు మాత్రం పల్లపు ప్రాంతం నుంచి బయటకు పోలేకపోయింది. సాల్టన్ సింక్ అనేది చుట్టూ మూసివేసి ఉన్న పల్లపు ప్రాంతం కావడం వల్ల నీరు బయటకు ప్రవహించేందుకు ఎలాంటి మార్గం లేకపోయింది. దీంతో ఆ ప్రవాహమంతా అక్కడే ఇంకిపోకుండా ఉండిపోయి ‘సాల్టన్ సీ’గా రూపాంతరం చెందింది. యుఎస్ జియోలాజికల్ సర్వే నివేదికల ప్రకారం.. సముద్ర మట్టానికి దాదాపు 235 అడుగుల లోతులో ఉన్న ఈ ప్రాంతం.. కాలిఫోర్నియాలోనే అత్యంత తక్కువ ఎత్తు ఉన్న ప్రాంతంగా నమోదైంది. ఆ తర్వాత ఇంపీరియల్, కోచెల్లా లోయల నుంచి వచ్చిన సాగునీటి వ్యర్థాల వల్ల ఈ సరస్సు దశాబ్దాల పాటు ఎండిపోకుండా కొనసాగుతూ వచ్చింది.

పర్యాటక ప్రాంతంగా రూపాంతరం

Advertisement

1950, 60ల నాటికి ఈ సరస్సు రూపురేఖలే మారిపోయాయి. ప్రమాదవశాత్తు ఏర్పడిన సరస్సు కాస్తా కాలిఫోర్నియాలోనే అత్యంత సంపన్న పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. సరస్సు చుట్టూ మెరీనాలు, యాచ్ క్లబ్‌లు, రిసార్టులు వెలిశాయి. చేపల వేట, వాటర్ స్పోర్ట్స్ కోసం సెలబ్రిటీలు, పర్యాటకులు భారీగా తరలివచ్చేవారు. వ్యాపారవేత్తలు కూడా ఈ ప్రాంతాన్ని ఒక మోడల్ రిసార్ట్ నగరంగా మార్చాలని భారీ ప్లాన్లు వేశారు.

పెరిగిన ఉప్పుశాతం.. మళ్లీ పాత రూపానికి!

అయితే ఈ సరస్సు నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడమే దానికి శాపంగా మారింది. ఎండకు నీరు ఆవిరైపోతున్న కొద్దీ అందులోని ఖనిజాలు, లవణాలు లోపలే ఉండిపోయాయి. కాలక్రమేణా సరస్సులో ఉప్పు శాతం విపరీతంగా పెరిగిపోయి, చేపలు, ఇతర జీవులు చనిపోవడం ప్రారంభమైంది. దీంతో పర్యాటక వైభవం క్రమంగా తుడిచిపెట్టుకుపోయింది.

Also Read: జియో యూజర్లకు పండగే పండగ.. ఏడాది పాటు ఫ్రీగా అమెజాన్ ప్రైమ్.. 18 నెలల గూగుల్ జెమిని ప్రో!

ముంచుకొస్తున్న పర్యావరణ సమస్య

నేడు సాల్టన్ సీ రూపురేఖలు పూర్తిగా మారిపోయినప్పటికీ పర్యావరణపరంగా ఇది ఇప్పటికీ ఎంతో కీలకమైనది. ఉత్తర అమెరికాలో పక్షుల వలస మార్గమైన ‘పసిఫిక్ ఫ్లైవే’లో ఇదీ ఒక భాగం. లక్షలాది వలస పక్షులకు ఇది ప్రధాన ఆవాసంగా నిలుస్తోంది. అయితే ప్రస్తుతం కొలరాడో నది నుంచి నీటి రాక తగ్గడంతో సరస్సు మట్టం వేగంగా పడిపోతోంది. నీరు తగ్గుతుండటంతో సరస్సు అడుగున ఉన్న నేల బయటపడి, చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రమాదకరమైన ధూళి విస్తరిస్తోంది. ఇది చిన్నపాటి ధూళి తుఫాన్లకు కారణమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక శతాబ్దం క్రితం ఒక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్‌లో జరిగిన చిన్న పొరపాటు, కాలిఫోర్నియా ఎడారి స్వరూపాన్నే శాశ్వతంగా మార్చేసి, వంద ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఒక మహా సరస్సుకు జన్మనిచ్చిందని చెప్పవచ్చు.

Also Read: బ్రాండెడ్ vs జనరిక్.. తక్కువ ధరకే లభించే జనరిక్ మందులు.. నిజంగా పనిచేస్తాయా?

Tags

Related News

హోటల్లో అడుగుపెట్టగానే.. గదిని ఎందుకు ఫొటోలు తీయాలి? లేకపోతే జరిగే నష్టం ఏంటి?

డ్రైవర్ అవసరం లేదు.. గంటకు 90 కి.మీ వేగం.. కొత్త మెట్రో రైళ్లు వచ్చేస్తున్నాయ్!

భారత్‌లోని లాంగెస్ట్ నాన్‌స్టాప్ రైలు ఇదే.. వామ్మో.. అన్ని వందల కిలో మీటర్లు ఆగకుండా వెళ్తుందా?

పదో తరగతి కూడా పాస్ కాలేదు.. అయినా, బోయింగ్, రోల్స్ రాయిస్ నమ్మిన కంపెనీకి అధిపతిగా ఎదిగాడు!

ఢిల్లీలో అడుగు పెట్టబోతున్న హైడ్రోజన్ రైలు.. అసలు ప్లాన్ ఇదే!

ఇండియన్ బుల్లెట్ రైలు భూకంపాన్ని ముందే పసిగడుతుందా? అదిరిపోయే సేఫ్టీ సీక్రెట్ ఇదే!

రైలు టికెట్ కన్ఫర్మ్ కావడం లేదా? పండుగ వేళ ఇలా బుక్ చేసుకోండి!

Big Stories

Advertisement
×