E-Paper
Advertisement

మైలేజీ ఎక్కువ.. ఖర్చు తక్కువ.. 5 బెస్ట్ బడ్జెట్ స్కూటర్లు ఇవే!

మైలేజీ ఎక్కువ.. ఖర్చు తక్కువ..  5 బెస్ట్ బడ్జెట్ స్కూటర్లు ఇవే!
Advertisement

Cheapest Scooters: స్కూటర్ కొనేటప్పుడు చాలామంది ముందుగా చూసేది డిజైన్ తోపాటు ఫీచర్లు కాదు. రోజూ ఎంత దూరం ప్రయాణించాలి? నెలకు పెట్రోల్ కోసం ఎంత ఖర్చవుతుంది? మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? అనే విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా మంచి మైలేజీ ఇచ్చే సరసమైన స్కూటర్ కోసం చూస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. విద్యార్థులు, ఉద్యోగులు, కుటుంబ అవసరాల కోసం స్కూటర్ కొనేవారికి మార్కెట్లో బెస్ట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.85 వేల లోపు ధరలో లభించే వాటిలో మైలేజీ, సౌకర్యం, ఇంజిన్ పనితీరు లాంటి అంశాల్లో ఒక్కో స్కూటర్‌ కు ఒక్కో ప్రత్యేకత ఉంది.

హీరో ప్లెజర్ ప్లస్

హీరో ప్లెజర్ ప్లస్ 110cc స్కూటర్. దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.69,766 నుంచి ప్రారంభమవుతుంది. వేరియంట్‌ను బట్టి 55 నుంచి 59 కి.మీ వరకు మైలేజీని ఇస్తుంది. తక్కువ బరువు కారణంగా ట్రాఫిక్‌లో ఈజీగా నడిపే అవకాశం ఉంటుంది. ఎక్కువ ఫీచర్ల కంటే తక్కువ ధర, సింపుల్ రైడింగ్ కోరుకునేవారికి ఇది బాగా నచ్చుతుంది.

టీవీఎస్ జూపిటర్ 110

Advertisement

టీవీఎస్ జూపిటర్ 110 ధర రూ.73,550 నుంచి ఉంటుంది. ఇందులో 113.3cc ఇంజిన్ ఉంటుంది. ఈ మోడల సుమారు 40 నుంచి 46 కి.మీ మైలేజ్ ఇస్తుంది. జూపిటర్ సౌకర్యం కూడా చాలా బాగుంటుంది. పెద్ద సీటు, 22 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్, టాప్ వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

హోండా యాక్టివా 110

యాక్టివా 110 ధర రూ.74,369 నుంచి ప్రారంభమవుతుంది. 110cc ఇంజిన్‌తో వస్తున్న ఈ స్కూటర్‌కు మంచి మైలేజీతో పాటు నమ్మకం, రీసేల్ వ్యాల్యూను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ 45 నుంచి 55 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. హోండా సర్వీస్ నెట్‌ వర్క్ కూడా యాక్టివాకు పనికి వచ్చే అవకాశం ఉంది.

యమహా రేజెడ్ఆర్ 125

Advertisement

మైలేజీ విషయానికి యమహా రేజెడ్ఆర్ 125 Fi హైబ్రిడ్ కూడా ముందుంటుంది. దీని ధర రూ.74,960 నుంచి మొదలవుతుంది. 125cc ఇంజిన్‌కు హైబ్రిడ్ అసిస్ట్ టెక్నాలజీ యాడ్ కావడంతో మంచి మైలేజ్ ఇస్తుంది. కంపెనీ 71.33 కి.మీ మైలేజ్ ఇస్తున్నట్లు చెప్పినా.. వాస్తవంగా 58 కి.మీ వరకు వస్తుంది. అండర్‌ సీట్ స్టోరేజ్ 21 లీటర్లు ఉంటుంది.

హీరో డెస్టిని 125

125cc విభాగంలో మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్లలో హీరో డెస్టిని 125 ఒకటి. దీని ధర సుమారు రూ.80,242 నుంచి ఉంటుంది. 124.6cc ఇంజిన్ 9.12 PS పవర్‌ను అందిస్తుంది.  కంపెనీ 60 కి.మీ మైలేజ్ ఇస్తుందని చెప్పినా, 55 వరకు ఇచ్చే అవకాశం ఉంది.

Read Also: సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

Tags

Related News

వాగన్ఆర్ To ఎలక్ట్రిక్ MPV.. మారుతి నుంచి రాబోతున్న 4 క్రేజీ ఫ్యూచర్ కార్లు ఇవే!

కేరెన్స్, క్లావిస్‌ కు CNG పవర్.. ధరలు ఎంతో తెలుసా?

మైలేజీకి మారుతి కొత్త ప్లాన్.. బాలెనో CNG-AMT వచ్చేసింది!

టిగోర్ స్థానంలో టాటా ఏరిస్.. డిజైర్, అమేజ్‌ కు గట్టి పోటీ తప్పదా?

థార్ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

అపాచీ బైక్‌లకు బిగ్ అప్‌డేట్.. కొత్త వేరియంట్లు, అదిరిపోయే ఫీచర్లు ఇవే!

మారుతి బాలెనో vs టాటా ఆల్ట్రోజ్.. టాప్ వేరియంట్లలో ఏది బెస్ట్?

Big Stories

Advertisement
×