Noise Alt Buds Open review: మార్కెట్లో దొరికే చాలా వరకు ఇయర్‌బడ్స్ అన్నీ ఒకే లాంటి డిజైన్‌తో బోర్ కొడుతున్నాయా? గంటల తరబడి చెవుల్లో.. పెట్టుకుంటే నొప్పి పుడుతోందా? అయితే మీ కోసమే సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తూ లాంచ్ అయింది Noise Alt Buds Open. ఇది సాధారణ ఇన్-ఇయర్ బడ్స్ లాగా చెవి లోపలికి వెళ్లదు. చెవికి పక్కన ఒక క్లిప్‌లా తగిలించుకునే వినూత్నమైన “సి-షేప్” డిజైన్‌తో వస్తుంది. రెడ్ డాట్ డిజైన్ అవార్డును సొంతం చేసుకున్న ఈ లేటెస్ట్ ఓపెన్-ఇయర్ ఆడియో గ్యాడ్జెట్ అసలు పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ? ఇది ఎవరెవరికి పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
డిజైన్‌లోనే డిఫరెంట్:
ప్రస్తుతం ఆడియో మార్కెట్లో సరికొత్త విప్లవం నడుస్తోంది. అదే ‘Open-Ear Stereo’. దీని అర్థం ఏంటంటే.. పాటలు వింటున్నప్పుడు మీ చెవులు పూర్తిగా మూసుకుపోవు. చుట్టు పక్కల జరిగే శబ్దాలను కూడా గమనిస్తూనే.. సేఫ్‌గా మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు. ఈ కాన్సెప్ట్‌తోనే ప్రముఖ స్మార్ట్ వేరబుల్స్ బ్రాండ్ ‘నోయిస్’ తమ ప్రీమియం ఎకోసిస్టమ్‌లో భాగంగా Noise Alt Buds Open ని ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని లాంచ్ ప్రైస్ సుమారు రూ.4,499 గా ఉంది.
డిజైన్, కంఫర్ట్:
ఈ బడ్స్ చూడటానికి చాలా విభిన్నంగా, ఒక పిల్-షేప్ (మాత్ర ఆకారం) ఛార్జింగ్ కేస్‌తో వస్తాయి. దీని మెయిన్ హైలైట్ ఏంటంటే.. ఇయర్‌బడ్స్ చివర లిక్విడ్ సిలికాన్ కోటింగ్‌తో కూడిన ఫ్లెక్సిబుల్ మెమరీ వైర్ హుక్ ఉంటుంది. ఇది మీ చెవి వెనక భాగం నుంచి లూప్‌లా చుట్టుకొని, మెయిన్ డ్రైవర్‌ను చెవి రంధ్రం బయట కరెక్ట్‌గా ప్లేస్ చేస్తుంది.
నో పెయిన్ – ఆల్ డే గెయిన్: ఇవి చెవి లోపలికి వెళ్లవు కాబట్టి, ఎంతసేపు వాడుకున్నా చెవులు అస్సలు నొప్పి పెట్టవు.
జారిపడే ప్రసక్తే లేదు: రన్నింగ్, జిమ్ వర్కౌట్స్ లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇవి చెవిని గట్టిగా పట్టుకుంటాయి. కింద పడిపోతాయనే భయం అస్సలు ఉండదు.
ఇందులో 13mm హైబ్రిడ్ డయాఫ్రాగమ్ డ్రైవర్లు ఇచ్చారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఈ బడ్జెట్ రేంజ్‌లో హై-రెజల్యూషన్ ఆడియో స్ట్రీమింగ్ కోసం LHDC ఆడియో కోడెక్ సపోర్ట్‌ను అందించారు.
వోకల్స్ & పాడ్‌కాస్ట్స్: మాటలు చాలా స్పష్టంగా వినబడతాయి. క్లాసికల్ సాంగ్స్, మెలోడీలు, యూట్యూబ్ వీడియోలు, ఆడియో బుక్స్ వినేవారికి ఇది అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
బేస్ పరిస్థితి ఏంటి?: ఓపెన్-ఇయర్ డిజైన్ కావడం వల్ల దీనికి ఎలాంటి ఇయర్ సీల్ ఉండదు. అందుకే హెవీ బేస్, డీప్ సబ్-బేస్ ఆశించే హిప్-హాప్ లేదా ఈడీఎం లవర్స్‌కు ఇది కొంచెం డిసప్పాయింట్ చేయవచ్చు. బేస్ లైట్‌గా ఉంటుంది.
ఆఫీస్ కాల్స్, జూమ్ మీటింగ్స్ ఎక్కువగా మాట్లాడేవారి కోసం ఇందులో.. AI DNN ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ తో కూడిన 4-మైక్రోఫోన్ సిస్టమ్ ఇచ్చారు. ఇండోర్ లేదా ఆఫీస్ రూముల్లో కాలింగ్ క్వాలిటీ క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. కనెక్టివిటీ కోసం లేటెస్ట్ Bluetooth 5.3 , డ్యూయల్ డివైజ్ పెయిరింగ్ సపోర్ట్ ఉంది. అంటే ఒకేసారి లాప్‌టాప్ , మొబైల్‌కు కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు.
యాప్ సపోర్ట్: ‘Noise Audio’ యాప్ ద్వారా టచ్ కంట్రోల్స్ మార్చుకోవచ్చు, అలాగే మన టేస్ట్‌కు తగ్గట్టుగా ‘కస్టమ్ ఈక్వలైజర్’ సెట్టింగ్స్ సెట్ చేసుకోవచ్చు.
Also Read: రూ.9,999కే ఆండ్రాయిడ్ 15, ఫ్రీ హోమ్ సర్వీస్.. లావా స్మార్ట్ 4 ప్లస్ ఫీచర్లు ఇవే!
ఈ బడ్స్ బ్యాటరీ లైఫ్ విషయంలో.. మిమ్మల్ని పూర్తిగా సర్‌ప్రైజ్ చేస్తాయి. కేస్‌తో కలిపి ఇది ఏకంగా 35 గంటల ప్లేబ్యాక్ టైమ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే వారం రోజులు హ్యాపీగా వాడుకోవచ్చు. ఇందులో ఇన్‌స్టాఛార్జ్ టెక్నాలజీ ఉంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు.. ఏకంగా 200 నిమిషాల (దాదాపు 3 గంటల పైనే) పాటు పాటలు వినవచ్చు.
మీరు ఎక్కువగా ఆఫీస్ కాల్స్ మాట్లాడేవారైనా.. ట్రావెలింగ్ లేదా వాకింగ్ చేస్తూ చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనిస్తూ సేఫ్‌గా మ్యూజిక్ వినాలనుకునే వారైనా.. ఈ Noise Alt Buds Open పర్‌ఫెక్ట్ ఆప్షన్. ముఖ్యంగా కంఫర్ట్ , ట్రెండీ లుక్ కోరుకునే యూత్ ఈ లేటెస్ట్ గ్యాడ్జెట్‌ను హ్యాపీగా ట్రై చేయవచ్చు.