Best refrigerators for Indian homes: మన దేశంలో వాతావరణం ఎలా ఉంటుందో తెలిసిందే వంట వండి పక్కన పెడితే కొన్ని గంటల్లోనే.. పాడైపోయే ఛాన్స్ ఉంది. అందుకే ప్రతి ఇంట్లోనూ ఫ్రిజ్ అనేది లగ్జరీ కాదు, ఒక నిత్యావసర వస్తువు. అయితే చాలా ఫ్రిజ్‌లలో పైన ఉన్న వస్తువులు చల్లగా ఉండి, కింద ఉన్న కూరగాయలు కుళ్ళిపోతుంటాయి. అలా కాకుండా.. ఫ్రిజ్ అంతటా ఒకేలా సమానంగా చల్లదనాన్ని అందిస్తూ, మన ఇండియన్ కిచెన్స్ కోసం పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే 5 బెస్ట్ రిఫ్రిజిరేటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సమానంగా కూలింగ్ ఇచ్చే టాప్ 5 ఫ్రిజ్‌లు:
మనం ఫ్రిజ్ కొనేటప్పుడు.. కేవలం డిజైన్, బడ్జెట్ చూస్తే సరిపోదు. అందులో కూలింగ్ టెక్నాలజీ ఎలా ఉందనేది చాలా ముఖ్యం. ఫ్రిజ్ లోపల ప్రతి షెల్ఫ్, ప్రతి మూలకు గాలి సమానంగా.. అందినప్పుడే ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. మన దేశంలోని ఫుడ్ హాబిట్స్, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని అద్భుతమైన ‘ఈవెన్ కూలింగ్’ ఫీచర్‌తో వస్తున్న టాప్ 5 రిఫ్రిజిరేటర్స్ డీటెయిల్స్ మీకోసం.
1. శామ్‌సంగ్ కన్వర్టిబుల్ 5-ఇన్-1 రిఫ్రిజిరేటర్ :
ఈ డబుల్ డోర్ ఫ్రిజ్‌లో ఉండే ‘ట్విన్ కూలింగ్ ప్లస్’ టెక్నాలజీ ఫ్రిజ్ అంతటా ఒకేలా చల్లదనాన్ని ఇస్తుంది. ఇది ఫ్రిజ్ లోపల 70% వరకు తేమను కాపాడుతుంది. దీని వల్ల కూరగాయలు అస్సలు వాడిపోవు. ఇందులో 5 కన్వర్టిబుల్ మోడ్స్ ఉంటాయి. అంటే అవసరాన్ని బట్టి ఫ్రీజర్‌ను కూడా నార్మల్ ఫ్రిజ్‌గా మార్చుకోవచ్చు.
2. ఎల్‌జీ ఫ్రాస్ట్ ఫ్రీ స్మార్ట్ ఇన్వర్టర్ ఫ్రిజ్ (LG):
ఎల్‌జీ హోమ్ అప్లయెన్సెస్ లో ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. దీని ‘డోర్ కూలింగ్ ప్లస్’ టెక్నాలజీ దీని ప్రత్యేకత. సాధారణంగా ఫ్రిజ్ డోర్ వైపు ఉండే.. బాటిల్స్ త్వరగా కూల్ అవ్వవు. కానీ ఈ టెక్నాలజీ వల్ల డోర్ వైపు కూడా వేగంగా, సమానంగా చల్లదనం అందుతుంది. దీని స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ పవర్‌ను చాలా బాగా సేవ్ చేస్తుంది.
3.వర్ల్‌పూల్ ఇంటెలిఫ్రెష్ ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్ (Whirlpool):
వర్ల్‌పూల్ ఫ్రిజ్‌లలో ఉండే ‘మైక్రోబ్లాక్’ (MicroBlock) టెక్నాలజీ బ్యాక్టీరియా చేరకుండా చూస్తుంది. దీని ‘ఇంటెలిసెన్స్ ఇన్వర్టర్’ టెక్నాలజీ.. లోపల ఉన్న లోడ్‌ను బట్టి కూలింగ్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. ఫ్రిజ్ నిండా వస్తువులు పెట్టినా సరే.. లోపల ఉండే వెదర్ సెన్సార్లు ప్రతి మూలకు సమానమైన చల్లదనాన్ని పంపిస్తాయి.
4. గాడ్రెజ్ ఈయాన్ కన్వర్టిబుల్ రిఫ్రిజిరేటర్ (Godrej):
మన దేశీయ బ్రాండ్ అయిన గాడ్రెజ్ తక్కువ ధరలో ఎక్కువ లైఫ్ ఇస్తుంది. దీని ‘మల్టీ ఎయిర్ ఫ్లో'(Multi Air Flow) సిస్టమ్ ప్రతి షెల్ఫ్ వెనుక నుంచి చల్లటి గాలిని పంపిస్తుంది. దీని వల్ల ఫ్రిజ్ మొత్తం ఒకే టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. ఫ్యామిలీస్ కోసం ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్.
Also Read: అదిరిపోయే ఫీచర్లతో.. వన్‌ప్లస్ కొత్త బడ్జెట్ ఈయర్‌బడ్స్ లాంచ్!
5. హయ్యర్ ట్విన్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్ ఫ్రీ ఫ్రిజ్ (Haier):
హయ్యర్ బ్రాండ్ ఫ్రిజ్‌లు వాటి లేటెస్ట్ ఫీచర్లతో.. యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. దీని ‘ట్విన్ ఇన్వర్టర్ టెక్నాలజీ’ వల్ల కంప్రెసర్ , ఫ్యాన్ మోటార్ రెండూ ఇన్వర్టర్ పైనే నడుస్తాయి. ఇది ఫ్రిజ్ లోపల టెంపరేచర్ అస్సలు మారకుండా కాపాడుతుంది. దీనివల్ల ఐస్ క్రీమ్స్ మెల్ట్ అవ్వవు, పాలు కూడా ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి.
స్మార్ట్ టిప్:
మీరు ఫ్రిజ్ కొనేటప్పుడు ఖచ్చితంగా ‘ఫ్రాస్ట్ ఫ్రీ’ (Frost-Free), ఇన్వర్టర్’ (Inverter) మోడల్స్ నే ఎంచుకోండి. ఇవి ఫ్రిజ్ లోపల ఐస్ గడ్డకట్టకుండా చూస్తాయి. మీ కరెంట్ బిల్లును కూడా సగానికి సగం తగ్గిస్తాయి.
ఈ ఐదు రిఫ్రిజిరేటర్లు కూడా ఇండియన్ కిచెన్స్‌కు పర్ఫెక్ట్ మ్యాచ్. మీ ఫ్యామిలీ సైజ్ , బడ్జెట్‌ను బట్టి బెస్ట్ బ్రాండ్‌ను సెలెక్ట్ చేసుకోండి. ఈ స్మార్ట్ ఫ్రిజ్‌లతో మీ హెల్తీ ఫుడ్‌ని ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంచుకోండి.