Best Samsung smartwatches India: ఈ రోజుల్లో ఫిట్‌గా ఉండటం ఒక ట్రెండ్ మాత్రమే కాదు. లైఫ్‌స్టైల్‌గా మారిపోయింది. మన రోజు వారీ యాక్టివిటీస్, హార్ట్ రేట్, స్లీప్ సైకిల్స్ అన్నీ మన చేతి మణికట్టు పైనే చూపిస్తూ మోటివేట్ చేసే గ్యాడ్జెట్ స్మార్ట్‌వాచ్. ప్రీమియం బ్రాండ్ శామ్‌సంగ్ నుంచి వస్తున్న స్మార్ట్‌వాచ్‌లు స్టైల్‌తో పాటు ఖచ్చితమైన ఫిట్‌నెస్ అప్‌డేట్స్ ఇస్తూ ఇండియాలో దూసుకుపోతున్నాయి. మీ బడ్జెట్ , అవసరాలకు తగ్గట్టుగా అందుబాటులో ఉన్న బెస్ట్ 3 శామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్‌ల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 8 (Samsung Galaxy Watch 8):
శామ్‌సంగ్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన గెలాక్సీ వాచ్ 8 ప్రస్తుతం టెక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో కంపెనీ సరికొత్త బయో-యాక్టివ్ సెన్సార్ , అడ్వాన్స్‌డ్ గెలాక్సీ ఏఐ సపోర్ట్‌ను అందించింది. దీని వల్ల మీ రోజువారీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలిపే ‘ఎనర్జీ స్కోర్’ ఫీచర్‌ను ఇది చాలా ఖచ్చితంగా లెక్కిస్తుంది. మీ హార్ట్ రేట్, ఈసీజీ , బ్లడ్ ప్రెజర్, స్లీప్ అప్‌డేట్స్‌ను నిరంతరం ట్రాక్ చేస్తూ హెల్త్ అలర్ట్స్ ఇస్తుంది. లేటెస్ట్ 3nm ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌వాచ్ ఇండియాలో సుమారుగా రూ.32,999 ధరతో అందుబాటులో ఉంది.
2. శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా (Samsung Galaxy Watch Ultra):
మీరు అడ్వెంచర్స్ , హెవీ వర్కౌట్స్ ఇష్టపడేవారైతే మీకు ‘వాచ్ అల్ట్రా’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి కఠినమైన యాక్టివిటీస్ చేసే వారి కోసం దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇది గట్టిదైన టైటానియం బాడీతో రావడం వల్ల చాలా బలంగా ఉంటుంది, అలాగే దీని బ్యాటరీ లైఫ్ ఏకంగా 100 గంటల వరకు వస్తుంది. ఇందులో డ్యూయల్ జీపీఎస్ సిస్టమ్ ఉండటం వల్ల అవుట్‌డోర్ రన్నింగ్ లేదా ట్రెకింగ్ చేసేటప్పుడు లొకేషన్ , డిస్టెన్స్‌ను చాలా ఖచ్చితంగా ట్రాక్ చేస్తుంది. దీని అంచనా ధర సుమారుగా రూ. 59,999 గా ఉంది.
Also Read: బెస్ట్ పవర్ బ్యాంక్ కొనాలా? వైర్‌లెస్,ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లతో అదరగొడుతున్న బ్రాండ్స్!
3. శామ్‌సంగ్ గెలాక్సీ ఫిట్ 3 (Samsung Galaxy Fit 3):
ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా, కేవలం బేసిక్ ఫిట్‌నెస్ ట్రాకింగ్ , స్మార్ట్ ఫీచర్స్ కావాలనుకునే వారికి గెలాక్సీ ఫిట్ 3 ఒక బెస్ట్ ఆప్షన్. ఇది చేతికి పెట్టుకుంటే అసలు బరువు తెలియనంత లైట్ వెయిట్‌గా ఉంటుంది. ఇందులో ప్రీమియం అల్యూమినియం బాడీ , స్పష్టమైన అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ ప్రత్యేకత ఏంటంటే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 13 రోజుల పాటు నిరంతరాయంగా బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఇందులో 100 కి పైగా ఎక్సర్‌సైజ్ మోడ్స్‌తో పాటు స్లీప్ మానిటరింగ్ కూడా ఉంది. ఇండియాలో దీని ధర రూ.3,499 మాత్రమే.
మీరు మీ లైఫ్‌స్టైల్‌ని మార్చుకుని, హెల్త్‌పై ఫోకస్ పెట్టాలనుకుంటే.. బడ్జెట్‌ను బట్టి ఈ మూడింటిలో ఒక బెస్ట్ శామ్‌సంగ్ వాచ్‌ని ఇప్పుడే సెలెక్ట్ చేసుకోండి.