E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

రామ్ చరణ్ సినిమాపై కావాలనే కుట్ర.. లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు!

రామ్ చరణ్ సినిమాపై కావాలనే కుట్ర.. లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Peddi Negative Politics: ప్రముఖ సినిమా పాటల రచయిత అనంత శ్రీరామ్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్‌లో జరుగుతున్న నెగిటివ్ పాలిటిక్స్‌పై ముక్కుసూటిగా స్పందించారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ (Peddi) చుట్టూ, అలాగే చిత్ర బృందంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక పద్ధతి ప్రకారమైన దాడులు, కుట్రలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా సక్సెస్ సాధిస్తున్న తరుణంలో కావాలనే కొందరు నెగిటివిటీని ఎలా స్ప్రెడ్ చేస్తున్నారో వివరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

Read also-బాలీవుడ్ నటుడు సోదరుడిపై దాడి.. పరిస్థితి విషమం.. నిందితుల కోసం పోలీసుల గాలింపు!

పాటలపై కావాలనే నెగిటివిటీ

Advertisement

‘పెద్ది’ సినిమాలోని “రాయ్ రాయ్ రా రా” సాంగ్ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో ఒక వర్గం దీనిపై తీవ్రమైన విమర్శలు, ట్రోలింగ్స్ చేయడం ప్రారంభించింది. దీనిపై అనంత శ్రీరామ్ గట్టిగా స్పందిస్తూ.. “దాదాపు 50 రోజులు రాత్రింబవళ్లు కష్టపడి రాసిన సాహిత్యం అది. కేవలం సినిమా రేంజ్‌ను, క్రేజ్‌ను తగ్గించాలనే కుట్రతోనే కొందరు కావాలనే ఆ పాటపై నెగటివ్ ప్రచారం చేశారు” అంటూ మండిపడ్డారు.

సృజనాత్మక స్వేచ్ఛపై దాడి

ఈ చిత్రంలో హీరోయిన్ (జాన్వీ కపూర్ – అచ్చియమ్మ పాత్ర) పోషించిన కొన్ని సీన్స్, కెమెరా యాంగిల్స్ పై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో దర్శకుడు బుచ్చిబాబు సానా క్షమాపణలు చెప్పి, కొన్ని సీన్లను రీ-ఎడిట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ధోరణిని అనంత శ్రీరామ్ తప్పుబట్టారు. ‘ఒక కళను సృష్టించినప్పుడు దర్శకుడు ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఒక పద్ధతి ప్రకారం (Organized) జరిగే ఇలాంటి ట్రోలింగ్స్, సృజనాత్మక స్వేచ్ఛను దెబ్బతీస్తాయి. చిత్ర బృందాన్ని మానసిక ఒత్తిడిలోకి నెట్టడమే వీరి ముఖ్య ఉద్దేశం.’ అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

Read also-బాలయ్య బాబు ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. కొరటాల శివ ‘NBK112’ ముహూర్తం ఫిక్స్..

బురదజల్లే “ఐటమ్ గాళ్ళు”!

సినిమాలోని స్పెషల్ సాంగ్స్ గురించి మాట్లాడుతూ ఆయన మరింత ఘాటుగా స్పందించారు. ఐటమ్ సాంగ్స్ వస్తే థియేటర్లలో, బయట ఆస్వాదించేవాళ్లు కోట్లలో ఉన్నారని.. కానీ అదే సమయంలో వాటిపై కావాలనే బురదజల్లే కొందరు “ఐటమ్ గాళ్ళు” సోషల్ మీడియాలో తయారయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. రామ్ చరణ్ వంటి ఒక పెద్ద స్టార్ సినిమా సక్సెస్ అవుతున్న తరుణంలో, ఆ విజయాన్ని ఓర్వలేక నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం, నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం వెనుక పెద్ద వ్యూహాలే నడుస్తుంటాయని ఇండస్ట్రీ అంతర్గత విషయాలను బయటపెట్టారు. ఒక పెద్ద ప్రాజెక్ట్‌ను లేదా ఒక స్టార్ హీరోను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా జరిగే ప్రచారాలు సినిమా పరిశ్రమకు మంచిది కాదని అనంత శ్రీరామ్ హెచ్చరించారు. ‘పెద్ది’ సినిమా విజయాన్ని అడ్డుకోవడానికి, దాని స్థాయిని తగ్గించడానికి కొందరు చేసిన కుట్రలను, విమర్శలను ఆయన తనదైన శైలిలో తిప్పికొట్టారు.

Related News

సమంత ‘మా ఇంటి బంగారం’ 3 రోజుల గ్రాస్ ఎంతో తెలిస్తే?.. హీరోలు ఇక సద్దుకోవాల్సిందే..

‘లవ్ వైరస్–2’ సాంగ్ విడుదల చేసిన దర్శకుడు వి.వి. వినాయక్.. 36 గంటల్లో షూటింగ్..

బాలయ్య బాబు ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. కొరటాల శివ ‘NBK112’ ముహూర్తం ఫిక్స్..

బాలీవుడ్ నటుడు సోదరుడిపై దాడి.. పరిస్థితి విషమం.. నిందితుల కోసం పోలీసుల గాలింపు!

మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ మైథలాజికల్ మూవీకి పాతికేళ్లు.. అప్పుడే ఆ రూల్ బ్రేక్…

‘లవ్ అండ్ వార్’ సెట్‌లో ప్రమాదం.. కార్మికుడి మృతి.. పరిహారం డిమాండ్..

హీరోయిన్ శ్రీలీలకు ఘోర అవమానం.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!

Big Stories

×