E-Paper
Advertisement

సమంత ‘మా ఇంటి బంగారం’ 3 రోజుల గ్రాస్ ఎంతో తెలిస్తే?.. హీరోలు ఇక సద్దుకోవాల్సిందే..

సమంత ‘మా ఇంటి బంగారం’ 3 రోజుల గ్రాస్ ఎంతో తెలిస్తే?.. హీరోలు ఇక సద్దుకోవాల్సిందే..
Advertisement

Maa Inti Bangaram: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు లీడ్ రోల్‌లో నటించిన తాజా యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం.. వీకెండ్‌లో భారీ వసూళ్లను సాధించి సంచలనం సృష్టిస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ సినిమా కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది.

Read also-బాలయ్య బాబు ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. కొరటాల శివ ‘NBK112’ ముహూర్తం ఫిక్స్..

ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం

Advertisement

సమంతకు ఉన్న లేడీ ఫ్యాన్ బేస్‌తో పాటు, ఈ చిత్రంలో ఉన్న బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా శని, ఆదివారాల్లో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. ఫ్యామిలీస్ అంతా ఓన్ చేసుకోవడంతో ఈ వీకెండ్‌లో ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద లీడింగ్ పొజిషన్‌లో నిలిచింది.

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ రిపీట్

‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ వంటి ఫీల్ గుడ్ చిత్రాల దర్శకురాలు బి.వి. నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. సమంత, నందిని రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓ బేబీ’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడో చిత్రం ‘మా ఇంటి బంగారం’ కూడా అదే స్థాయిలో బ్లాక్‌బస్టర్ హిట్ వైపు దూసుకెళ్తోంది.

Advertisement

Read also-హీరోయిన్ శ్రీలీలకు ఘోర అవమానం.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!

ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు (రాజ్ & డికె) అందించిన కథ, స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. సమంత తన సొంత బ్యానర్ ‘త్రలాలా మూవింగ్ పిక్చర్స్’ పై అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక సాధారణ గృహిణిగా కనిపిస్తూనే.. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం సమంత చేసిన యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ పర్‌ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఇక సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ కలెక్షన్ల పోస్టర్ ట్రెండ్ అవుతోంది. రాబోయే రోజుల్లో వర్కింగ్ డేస్‌లోనూ ఇదే విధమైన పట్టు సాధిస్తే, ఈ చిత్రం సమంత కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

రణ్‌బీర్ కంటే ముందే రాముడిగా సల్మాన్.. కానీ చివరికి జరిగింది ఇదే!

బ్లడ్‌బాత్‌తోనే పాన్ ఇండియా హీరో అవుతావా నాని ?

జి.డి. నాయుడు ఎవరో తెలుసా?.. ఆయన కథ ఇప్పుడు వెండితెరపై!

‘కొరియన్ కనకరాజు’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

51 షోలు ఓపెన్.. 48 హౌస్‌ఫుల్..దుమ్మురేపుతున్న కొరియన్ కనకరాజు !

‘ది పారడైజ్’ టీజర్ చూసారా?.. నాని రచ్చ స్టార్ట్!

పట్టు చీరల నుంచి డిజైనర్ వేర్ వరకు.. హీరోయిన్ల ఖరీదైన కలెక్షన్స్!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో గోల్డెన్ ఆఫర్!

Big Stories

Advertisement
×