E-Paper
Advertisement

జస్ట్ రూ. 3 లక్షలకే క్యూట్ ఈవీ.. ఒకే ఛార్జ్ తో 300 కిలో మీటర్లు హ్యాపీగా వెళ్లొచ్చు!

జస్ట్ రూ. 3 లక్షలకే క్యూట్ ఈవీ.. ఒకే ఛార్జ్ తో 300 కిలో మీటర్లు హ్యాపీగా వెళ్లొచ్చు!
Advertisement

Wuling Hongguang Mini EV: ప్రపంచ వ్యాప్తంగా తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ కార్లలో వులింగ్ హాంగ్‌ గ్వాంగ్ మినీ EV ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. చైనాకు చెందిన SAIC GM Wuling సంస్థ తయారు చేస్తున్న ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు సిటీలో రోజువారీ ప్రయాణాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. తాజాగా వచ్చిన ఫిఫ్త్ జెనరేషన్ 4 డోర్ మోడల్ అందుబాటులో ఉంది. కానీ, రెండు డోర్ల మోడల్ బాగా పాపులర్ అయ్యింది. అత్యాధునిక డిజైన్, మెరుగైన ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం మోడల్ సుమారు రూ.5.1 లక్షల నుంచి రూ.6.2 లక్షల మధ్య ఉంటుంది. కానీ, రెండు డోర్ల మోడల్ ధర జస్ట్ రూ. 3 లక్షలకే లభిస్తుంది. తక్కువ ధరలోనే మంచి రేంజ్, ఆధునిక ఫీచర్లు అందించడంతో ఈ కారు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ  దక్కించుకుంది.

ఒకే ఛార్జ్ తో 300 కి.మీ రేంజ్

ఈ కారులో 30 kW పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ ఎలక్ట్రిక్ మోటార్ అందించారు. ఇది సుమారు 42 హార్స్‌ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. నగరాల్లో ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా వేగంగా స్పందించేలా దీనిని రూపొందించారు. కేవలం 4.5 సెకన్లలో 0 నుంచి 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు 205 కిలోమీటర్లు,  301 కిలోమీటర్ల CLTC రేంజ్ అనే రెండు ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. రోజువారీ ప్రయాణాలకు ఈ రేంజ్ చాలామందికి సరిపోతుంది. అంతేకాదు, DC ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. దీని ద్వారా బ్యాటరీని కేవలం 35 నిమిషాల్లో 30 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. దీంతో ఎక్కువసేపు ఛార్జింగ్ కోసం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.

Advertisement

చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ఈ కారు లోపల మంచి స్థలాన్ని అందిస్తుంది. కొత్త మోడల్ లో 4 డోర్లు ఉన్నా, పాత మోడల్ లో 2 డోర్లు మాత్రమే ఉన్నాయి. 4 సీట్లు ఉన్నాయి. 10.1 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, స్మార్ట్‌ ఫోన్ యాప్ ద్వారా రిమోట్ ఏసీ కంట్రోల్ లాంటి స్మార్ట్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. చిన్న కుటుంబాల అవసరాలకు, షాపింగ్, లగేజీ తీసుకెళ్లడానికి కూడా ఈ కారు ఉపయోగపడుతుంది.

చూడ్డానికి అందంగా..

డిజైన్ పరంగా కూడా ఈ కారు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. గుండ్రని స్టార్ రింగ్ LED హెడ్‌లైట్లు, స్మూత్ బాడీ లైన్లు, రెట్రో స్టైల్‌ తో కూడిన లేటెస్ట్ డిజైన్ ప్రత్యేక లుక్‌ను తీసుకొచ్చాయి. నగరాల్లో నడిపేందుకు అనువుగా చిన్న సైజులో ఉండటంతో పాటు 4.5 మీటర్ల టర్నింగ్ రేడియస్ ఉండటం వల్ల ఇరుకైన రోడ్లలో కూడా సులభంగా నడిపే అవకాశం ఉంటుంది. పార్కింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. భద్రత విషయంలో కూడా కంపెనీ రాజీ పడలేదు. ఈ కారును 67 శాతం హై స్ట్రెంగ్త్ స్టీల్ ఉపయోగించి తయారు చేశారు. ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ముందు భాగంలో ఎయిర్‌ బ్యాగ్‌ లు, డిస్క్ బ్రేకులు లాంటి కీలక భద్రతా ఫీచర్లు ఉన్నాయి.  తక్కువ ధరలో మంచి రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, ఆధునిక టెక్నాలజీ, చక్కటి డిజైన్ కోరుకునే వారికి వులింగ్ హాంగ్‌గ్వాంగ్ మినీ EV ఒక మంచి ఎంపికగా చెప్పవచ్చు.

Advertisement

Read Also: రూ.9 లక్షల నుంచే లగ్జరీ ఫీచర్.. వెంటిలేటెడ్ సీట్లతో వచ్చే చీప్ అండ్ బెస్ట్ కార్లు ఇవే!

Related News

స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవే!

BE 07 TO విజన్ T.. మహీంద్రా నుంచి రాబోతున్న పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ SUVలు ఇవే!

హోండా కార్లపై అక్టోబర్‌ లో అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.2.34 లక్షల తగ్గింపు!

మారుతి స్విఫ్ట్‌ లో కొత్త టర్బో ఇంజిన్.. కళ్లు చెదిరే పవర్‌ తో మార్కెట్ లోకి ఎంట్రీ!

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

టాటా కార్లపై కళ్లు చెదిరే అక్టోబర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల బెనిఫిట్!

Big Stories

Advertisement
×