Vacuum Cleaners: సోఫాలు, పరుపులు ఎంతో అందంగా కనిపిస్తూ ఇంటి లుక్ ను లగ్జరీగా మార్చేస్తాయి. అయితే చూడటానికి బాగానే ఉన్నప్పటికీ వాటి పొరల్లో సన్నటి దుమ్ము, కంటికి కనిపించని కీటకాలు, పెంపుడు జంతువుల వెంట్రుకలు దాగుంటాయి. అవి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటాయి. అలాగనీ వీటిని సాధారణ పద్దతుల్లో తుడవడం, శుభ్రం చేయడం అసాధ్యం. సోఫాలు, పరుపులకు ఉండే మొండి మురికిని వదిలించి ఇంటిని పరిశుభ్రంగా మార్చడానికి మార్కెట్లో కొన్ని రకాల వ్యాక్యూమ్ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలోని టాప్ – 5 క్లీనర్లు, వాటి ప్రధాన ఫీచర్లను ఈ కథనంలో చూద్దాం.
మంచాలు, సోఫాలు, దిండ్లు, ఇతర ఫ్యాబ్రిక్ వస్తువులను శుభ్రం చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. 12kPa శక్తివంతమైన సక్షన్ పవర్‌తో పనిచేసే ఈ క్లీనర్‌లో ‘సైక్లోనిక్ టెక్నాలజీ’ ఉంది. ఇది దుమ్మును సమర్థవంతంగా లాగేస్తుంది. దీనిలోని UV లైట్ స్టెరిలైజేషన్ టెక్నాలజీ ఫ్యాబ్రిక్‌లోని హానికరమైన బ్యాక్టీరియా, మైట్స్ (కీటకాలు)ను నిర్మూలిస్తుంది.
ఇంటిని ప్రొఫెషనల్ స్థాయిలో క్లీన్ చేయాలనుకునే వారికి ఇది బాగా సరిపోతుంది. 13KPA సక్షన్ పవర్, 45000Rpm వేగంతో పనిచేసే ఈ క్లీనర్‌లో వైబ్రేషన్ సిస్టమ్ ఉంది. ఇది సోఫా, పరుపుల్లో లోతుగా పేరుకుపోయిన దుమ్మును సైతం ఎంతో ఈజీగా బయటకు లాగేస్తుంది. అంతేకాకుండా ఇందులో UV-C లైట్, అల్ట్రాసోనిక్ వేవ్స్, 60°C వేడి గాలి ఫీచర్లు ఉన్నాయి. ఇవి అలర్జీలను కలిగించే కీటకాలను పూర్తిగా తొలగిస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ వాక్యూమ్ క్లీనర్.. 700 వాట్స్ పవర్‌తో పనిచేస్తుంది. ఇది కేవలం దుమ్మును లాగడమే కాకుండా సందుల్లో ఉన్న చెత్తను బయటకి తరిమికొట్టడానికి బ్లోయర్ (Blower) సదుపాయాన్ని కూడా కలిగి ఉంది. దీంతో పాటు 6 రకాల విభిన్న యాక్సెసరీలను కంపెనీ అందిస్తోంది. ఇది తక్కువ బరువు ఉండటం వల్ల ఇంట్లోని పెద్దలు, వృద్దులు తేలిగ్గా దీన్ని వినియోగించవచ్చు. దీనిలోని HEPA ఫిల్టర్‌ను సులభంగా కడిగి మళ్లీ వాడుకోవచ్చు.
కార్, ఇల్లు రెండింటి క్లీనింగ్ పనికొచ్చే వాక్యూమ్ క్లీనర్ కోరుకుంటే.. దీనిని ట్రై చేయవచ్చు. ఇది 2-ఇన్-1 వ్యాక్యూమ్ క్లీనర్ & బ్లోయర్ గా పనిచేస్తుంది. వైర్ తోపాటు వైర్ లేకుండా (Cordless & Corded) కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఏకంగా 18,000 Pa అత్యధిక సక్షన్ పవర్‌తో వచ్చే ఈ మోడల్‌లో.. ఎల్ఈడీ డిస్‌ప్లే, బిల్ట్-ఇన్ ఫ్లాష్‌లైట్ ఉన్నాయి. వన్-ప్రెస్ డస్ట్ రిలీజ్ బటన్ ద్వారా సేకరించిన దుమ్మును సులభంగా పడేయచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: మీ ఫోన్ స్క్రీన్ ఈ 5 సంకేతాలు చూపిస్తోందా? అస్సలు నిర్లక్ష్యం చేయెుద్దు.. భారీ నష్టం జరగొచ్చు!
సోఫాలు, కార్ సీట్లు, కార్పెట్లపై పడిన మొండి మరకలను తొలగించడానికి దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇది కేవలం దుమ్మును మాత్రమే కాకుండా ద్రవ పదార్థాల వల్ల ఏర్పడిన మరకలను కూడా క్లీన్ చేస్తుంది. పెంపుడు జంతువుల వ్యర్థాలు, ఇతర మరకలను వదిలించడానికి ఇందులో ‘పెట్ స్టెయిన్ వ్యాక్యూమ్’ ఫీచర్ కూడా ఉంది. దీంతో పాటు విభిన్న రకాల రీప్లేస్‌మెంట్ హెడ్స్ ను కంపెనీ అందిస్తోంది.
Also Read: వర్క్ స్ట్రెస్ ఎక్కువైందా మామ? ఈ స్మార్ట్ గ్యాడ్జెట్స్‌తో.. ఆఫీస్ లైఫ్‌ను హ్యాపీగా మార్చేయ్!