Shireesha Murder: ఎస్‌ఆర్ నగర్ గోకుల్ ప్రైడ్ హోటల్‌లో జరిగిన శిరీష మర్డర్ కేసును పోలీసులు చేధించారు. నిందితుడు శ్రీనివాస్‌ను జేబీఎస్ దగ్గర పట్టుకున్నారు. ఇక వాడిని విచారిస్తే. వాడు ఎంత డేంజర్ మనిషో తేలింది. శ్రీనివాస్ ఇప్పటికే మూడు ముళ్లు ముగ్గురికి వేశాడట. వీడు అసలు రంగు తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. శ్రీనివాస్ టార్గెట్ ఎవరో తెలుసా? జీవితంలో ఇప్పటికే ఎన్నో కష్టాలు చూసిన మహిళలు.. భర్త నుంచి విడిపోయినవాళ్లు.. భర్తను కోల్పోయినవాళ్లతో పరిచయం పెంచుకుంటాడు. మాటలతో దగ్గరవుతాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తాడు. చివరకు డబ్బులు దోచుకొని ముఖం చాటేస్తాడు. ఇదే వీడి లైఫ్‌స్టైల్. ఇదే వీడి బిజినెస్.
కానీ శిరీష విషయంలో ఈ దందా.. నెత్తురు మలుపు తిరిగింది. వికారాబాద్ జిల్లా నాగసముద్రం అమ్మాయి శిరీష వీడి మాటలు నమ్మింది. అడిగిన ప్రతిసారీ డబ్బులు చేతిలో పెట్టింది. కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెంచింది. సెప్టెంబర్ 28న రాత్రి ఎస్సార్ నగర్‌లోని ఓయో హోటల్ గోకుల్ ప్రైడ్‌కి తీసుకొచ్చాడు. తెల్లవారుజాము అందరూ నిద్రలో ఉన్న టైమ్ శిరీష ఒకటే అడిగింది. పెళ్లి చేసుకో అని వెంటనే వాడి అసలు ముఖం బయటపడింది. రూమ్‌లో ఉన్న రాడ్డు తీసుకొని శిరీష తలపై బలంగా కొట్టాడు. అంతే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ తర్వాత? ఆమె దగ్గరున్న నాలుగు లక్షలు జేబులో వేసుకుని ఏమీ జరగనట్టు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కానీ చట్టం నుంచి ఎంతకాలం పరుగెత్తగలడు? జేబీఎస్ దగ్గర వాడి పరుగుకు పోలీసులు బ్రేక్ వేశారు. మరి ఆ మూడు పెళ్లిళ్లు ఏమయ్యాయి? ఆ ముగ్గురి పరిస్థితి ఏంటి? ఇంకెంతమంది వీడి వలలో పడ్డారు? ఇవన్నీ పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది..!
Also read: ఆంధ్రా యూనివర్సిటీలో కొకైన్ కలకలం.. పోలీసుల రికార్డుల్లో షాకింగ్ నిజాలు!