E-Paper
Advertisement

వేసవిలో ఇంకా ఫ్యాన్లే వాడుతున్నారా? మార్కెట్లోని బెస్ట్ కిటికీ ఏసీలు.. మెరుపు కూలింగ్‌తో హాయిగా ఉండొచ్చు!

వేసవిలో ఇంకా ఫ్యాన్లే వాడుతున్నారా? మార్కెట్లోని బెస్ట్ కిటికీ ఏసీలు.. మెరుపు కూలింగ్‌తో హాయిగా ఉండొచ్చు!
Advertisement

Best Window ACs: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇళ్ల నుంచి అడుగు తీసి బయటపెట్టలేని పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తోంది. అయితే వేసవి స్టార్ట్ అయినా ఇంకా కొందరు ఇంట్లోని ఫ్యాన్లతోనే అడ్జస్ట్ అవుతున్నారు. మరికొందరు సరికొత్త ఏసీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ.50,000 లోపున్న అత్యుత్తమ విండో ఏసీలు, వాటి ప్రధాన ఫీచర్లను ఈ కథనంలో పరిశీలించండి.

ఎల్జీ 1.5 టన్ 5 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్

ఎల్జీ కంపెనీకిం చెందిన ఈ విండో ఏసీ.. శక్తివంతమైన డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్ ను కలిగి ఉంది. ఇది గది ఉష్ణోగ్రత ఆధారంగా తన వేగాన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇందులోని ఏఐ కన్వర్టిబుల్ 4 ఇన్ 1 మోడ్స్ ను ఉపయోగించి.. అవసరానికి అనుగుణంగా ఏసీ పనితీరును మార్చుకోవచ్చు. సముద్ర తీర ప్రాంతాల్లోని ఉప్పుగాలికి కంప్రెసర్ దెబ్బతీనకుండా ఓషియన్ బ్లాక్ ప్రొటెక్షన్ ను ఈ ఏసీ కలిగి ఉంది.

వోల్టాస్ 1.5 టన్ 5 – స్టార్ ఇన్వర్టర్

Advertisement

వోల్టాస్ ఏసీలు.. భారత ఉష్ణోగ్రతలకు అనుగుణంగా సమర్థవంతంగా పనిచేస్తాయన్న పేరుంది. ఈ వోల్టాస్ విండో ఏసీలో టర్బో మోడ్ ఫీచర్ ఉంది. ఇది గదిని మెరుపువేగంతా కూలింగ్ చేసేస్తుంది. అలాగే దీనికి అందించిన ఐస్ వాష్ టెక్నాలజీ.. కాయిల్స్ పై ఉన్న మురికిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంది. తద్వారా స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. 54 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ ఈ ఏసీ సమర్థవంతంగా కూలింగ్ ను అందించగలదని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.

లాయిడ్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్

స్మార్ట్ ఫీచర్లు కలిగిన బెస్ట్ విండో ఏసీ కోరుకుంటే దీనిని ట్రై చేయవచ్చు. దీనిలోని స్మార్ట్ వై-ఫై ఫీచర్ ను ఉపయోగించి.. ఫోన్ లోని యాప్ ద్వారానే ఏసీని కంట్రోల్ చేయవచ్చు. అంతేకాకుడా గూగుల్ అసిస్టెంట్, అలెక్సా వంటి వాయిస్ కంట్రోల్ యాప్స్ ను ఉపయోగించి మాటలతోనే నియంత్రించొచ్చు. ఇందులో 6 ఇన్ 1 కన్వర్టిబుల్ కూలింగ్ మోడ్స్, 4 వే ఎయిర్ స్వింగ్ ఫీచర్లు సైతం ఉన్నాయి. ఇవి గదిలోని ప్రతి మూలకు చల్లని గాలిని పంపిస్తాయి.

పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్

Advertisement

పానాసోనిక్ కంపెనీకి చెందిన ఈ విండో ఏసీ.. స్మార్ట్ ఏఐ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఇది యూజర్ల అలవాట్లను గుర్తించి.. దానికి అనుగుణంగా ఆటోమేటిక్ గా గది టెంపరేచర్ ను అడ్జస్ట్ చేస్తుంది. అంతేకాకుండా దీనిలోని పవర్ ఫుల్ ఫిల్టర్లు గాలిలోని హానికారక దుమ్ము, దూళిని తొలగించి.. స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి.

Also Read: AC Buying Guide: ఎండ నేరుగా పడే పైఅంతస్తులకు.. ఎలాంటి ఏసీ కొంటే బెస్ట్.. సూటిగా సూత్తి లేకుండా..!

క్యారియర్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్

క్యారియర్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ విండో ఏసీ.. స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ తో వర్క్ చేస్తుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల కలిగే నష్టాలకు ఈ ఫీచర్ చెక్ పెడుతుంది. అటు దీనిలోని సెల్ఫ్ డయాగ్నోసిస్ ఫీచర్ కారణంగా.. ఏసీలో ఏదైనా సమస్య ఉంటే డిస్ ప్లే మీద ఎర్రర్ కోడ్ల రూపంలో చూపిస్తుంది. ఇది చాలా తక్కువ శబ్దంలో పనిచేయడం వల్ల.. రాత్రిళ్లు హాయిగా నిద్రపోవచ్చు.

Also Read: జియో vs ఎయిర్‌టెల్.. రూ.355 ప్లాన్ల మధ్య గట్టి పోటీ.. రెండింట్లో ఏది బెస్ట్ అంటే?

Related News

నాయిస్ సరికొత్త స్మార్ట్ వాచ్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో రచ్చ

రూ.5,247లకే.. బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్, వెంటనే కొనేయండి

కరోనాను ఖతం చేసే బ్రెజిల్ చెట్టు.. ఆకుల పవర్ చూసి సైంటిస్టులే షాక్!

రూ.889కే స్మార్ట్ వాచ్.. ఫీచర్లకు ఎవ్వరైనా ఫిదా!

మ్యూజిక్ లవర్స్‌కి గుడ్‌న్యూస్..రూ.899లకే అదిరిపోయే బ్లూటూత్ స్పీకర్

‘రెడ్‌మి నోట్ 17 5జీ’ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు.. ధర ఎంతంటే?

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. హాఫ్ ప్రైస్‌కే బెస్ట్ ట్యాబ్స్! డోంట్ మిస్

చావుదెబ్బ కొట్టిన Airtel.. మీకిష్టమైన బడ్జెట్ ప్లాన్ డిలీట్.. తెరపైకి మరో చౌకైన రీఛార్జ్!

Big Stories

Advertisement
×