Best work from home laptop models: ఇంటి నుంచే పని చేసే ఉద్యోగులకు సరైన ల్యాప్‌టాప్ చాలా ముఖ్యం. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో రోజంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేయడానికి ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇచ్చే డివైజ్‌లు ఎంత గానో ఉపయోగపడతాయి. పవర్ కట్స్ టెన్షన్ లేకుండా.. ప్రశాంతంగా ఆఫీస్ పనులు పూర్తి చేసుకోవడానికి మార్కెట్లో కొన్ని అద్భుతమైన బడ్జెట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో.. బెస్ట్ బ్యాటరీ బ్యాకప్, ఆకర్షణీయమైన ఫీచర్లు అందించే ల్యాప్‌టాప్ మోడల్స్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగుల మొదటి ఆప్షన్ గా ఈ ల్యాప్ టాప్ నిలుస్తోంది. దీని సుమారు ధర రూ.45,000 నుంచి రూ.50,000 మధ్య ఉంటుంది. ఇది Intel Core i5 లేదా AMD Ryzen ప్రాసెసర్‌తో వస్తుంది. దీనిలో 16 జీబీ రామ్ , 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఇవ్వడం ద్వారా మల్టీటాస్కింగ్ చాలా ఈజీ అవుతుంది. అలాగే.. దీని 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే కొన్ని గంటల పాటు ఎలాంటి కంటి నొప్పి లేకుండా.. పనిచేయడానికి సహాయ పడుతుంది. సింగిల్ ఛార్జ్‌తో దాదాపు 7 నుంచి 8 గంటల పాటు నిరంతరం బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది.
ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లడానికి వీలుగా ఉండే తక్కువ బరువు ఉండే ల్యాప్‌టాప్ కోరుకునే వారికి ఇది చక్కటి మోడల్. మార్కెట్లో దీని ధర సుమారు రూ.42,000 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 13th Gen Intel Core i5 ప్రాసెసర్ , 16 జీబీ రామ్‌తో పని చేస్తుంది. ఆఫీస్ మీటింగ్స్, జూమ్ కాల్స్ , ఎక్సెల్ షీట్ల నిర్వహణకు ఇది అద్భుతంగా పని చేస్తుంది. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్ కోరుకునే రిమోట్ ఉద్యోగులకు ఈ మోడల్ చక్కటి అనుభవం ఇస్తుంది.
టైపింగ్ ఎక్కువగా.. ఉండే ఉద్యోగుల కోసం ఈ మోడల్ ప్రత్యేకంగా రూపొందించబడింది.దీని ధర సుమారు రూ.40,000 పరిధిలో లభిస్తుంది. దీని కీబోర్డ్ టైపింగ్ సౌకర్యం చాలా ఈజీగా ఉంటుంది. H-Series ప్రాసెసర్ శక్తితో పని చేసే ఈ ల్యాప్‌టాప్ భారీ సాఫ్ట్‌వేర్‌లను కూడా ఈజీగా రన్ చేయగలదు. మెరుగైన బ్యాటరీ లైఫ్ , వేగవంతమైన ఎస్ఎస్‌డీ స్టోరేజ్ దీని సొంతం, ఇది రోజంతా ఎలాంటి ఛార్జింగ్ టెన్షన్ లేకుండా పని చేయడానికి సహకరిస్తుంది.
Also Read: ఇంతవరకూ ఏ టీవీలో లేని ఫీచర్లతో.. కొత్త మోడల్ లాంచ్
4.Dell Inspiron 15:
దీర్ఘకాలిక, నమ్మకమైన సర్వీస్ కోరుకునే వారికి ఈ ల్యాప్‌టాప్ మోడల్ బెస్ట్. దీని ధర రూ. 48,000 నుంచి ప్రారంభం అవుతుంది. పెద్ద స్క్రీన్ కోరుకునే రిమోట్ ఉద్యోగులకు దీని 15.6 అంగుళాల డిస్‌ప్లే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. Intel Core ప్రాసెసర్, బలమైన బిల్డ్ క్వాలిటీ, రోజంతా వచ్చే బ్యాటరీ బ్యాకప్ దీని ప్రత్యేకతలు. టెక్నికల్ సమస్యలు వస్తే తక్షణ సర్వీస్ లభించడం ఈ బ్రాండ్ ప్రధాన ప్లస్ పాయింట్.
సరైన ల్యాప్‌టాప్ మోడల్ ఎంపిక:
మార్కెట్లో లభించే ఈ బడ్జెట్ ల్యాప్‌టాప్ మోడల్స్‌లో మీ పని స్వభావాన్ని బట్టి ఎంచుకోవడం బెస్ట్. కొనేటడు కనీసం 16 జీబీ రామ్ , 512 జీబీ ఎస్ఎస్‌డీ ఉండేలా చూసుకోవడం భవిష్యత్తు అవసరాలకు మంచిది. సరైన బ్యాటరీ లైఫ్ ,తక్కువ ధర కలిగిన పర్ఫెక్ట్ ల్యాప్‌టాప్ మోడల్‌ను ఎంచుకోవడం ద్వారా మీ వర్క్ ఫ్రమ్ హోమ్ మరింత ఈజీ చేస్తాయి.