Jawa 42 FJ All Stars Launched: జావా సరికొత్త బైక్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. నియో క్లాసిక్ రోడ్‌స్టర్ 42 FJ ఆల్ స్టార్స్ కొత్త శ్రేణిని తీసుకొచ్చింది. ఈ బైక్ ధరలు రూ.2.02 లక్షల నుంచి ప్రారంభమై రూ.2.16 లక్షల వరకు ఉన్నాయి. కొత్త ఆల్ స్టార్స్ శ్రేణిలో ప్రధానంగా కలర్ ఆప్షన్లపైనే దృష్టి పెట్టారు. ఇప్పటికే ఉన్న మెకానికల్ సెటప్ లో పెద్దగా మార్పులు చేయకుండా, బైక్ కు కొత్త లుక్ అందించేలా ఆరు రంగులను తీసుకొచ్చారు.
జావా 42 FJ ఆల్ స్టార్స్ ను మొత్తం ఆరు రంగుల్లో అందిస్తోంది. ఇందులో క్రోమ్, నెబ్యులా బ్లూ, మ్యాట్ బ్లాక్ విత్ రెడ్ క్లాడ్, మ్యాట్ బ్లాక్ విత్ బ్లాక్ క్లాడ్, అరోరా గ్రీన్, రెడ్ ఉన్నాయి. ఈ అన్ని వేరియంట్ల ఫ్యూయల్ ట్యాంక్ కు ఇరువైపులా ప్రత్యేకమైన స్టార్ గుర్తును ఇచ్చారు. దీంతో సాధారణ 42 FJతో పోలిస్తే ఆల్ స్టార్స్ వెర్షన్‌కు కొంత స్పెషల్ లుక్ కనిపిస్తుంది. ఆరు రంగుల్లో క్రోమ్ వేరియంట్ అత్యంత ఖరీదైనది. దీని ధర రూ.2.16 లక్షలు. నెబ్యులా బ్లూ, రెండు మ్యాట్ బ్లాక్ వేరియంట్ల ధర రూ.2.08 లక్షలుగా ఉంది. అరోరా గ్రీన్, రెడ్ వేరియంట్లు రూ.2.02 లక్షల ప్రారంభ ధరలో లభిస్తాయి.
జావా 42 FJ ఆల్ స్టార్స్ లో అదే 334cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజన్‌ను కొనసాగించారు. ఈ మోటార్ 7,500rpm వద్ద 29.17hp పవర్, 5,500rpm వద్ద 29.62Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్ బాక్స్ ను యాడ్ చేశారు. జత చేశారు. అంటే కొత్త ఆల్ స్టార్స్ శ్రేణిలో ప్రధాన మార్పు ఇంజన్ లేదా మెకానికల్ సెటప్‌లో కాకుండా, డిజైన్ మరియు కలర్ ఆప్షన్లలోనే ఉంది.
42 FJ ఆల్ స్టార్స్ లో డబుల్ క్రాడిల్ ఫ్రేమ్ ను ఉపయోగించారు. ముందువైపు 41mm టెలిస్కోపిక్ ఫోర్క్ ఉండగా, వెనుక భాగంలో గ్యాస్ ఛార్జ్డ్ ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. వెనుక షాక్ అబ్జార్బర్లలో ఐదు దశల్లో ప్రీలోడ్‌ను సర్దుబాటు చేసుకునే సదుపాయం ఉంది. రైడర్ అవసరాన్ని బట్టి సస్పెన్షన్‌ను మార్చుకునే అవకాశం ఉంటుంది. బైక్‌లో 42 FJ మోడల్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన బ్రష్డ్ అల్యూమినియం ట్యాంక్ ప్యానెల్స్ కూడా కొనసాగించారు. ఇవి మోటార్ సైకిల్ కు రెట్రోతో పాటు కొంత ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.
కొత్త జావా 42 FJ ఆల్ స్టార్స్ ధరల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆల్ స్టార్స్ క్రోమ్: రూ.2.16 లక్షలు
ఆల్ స్టార్స్ నెబ్యులా బ్లూ: రూ.2.08 లక్షలు
మ్యాట్ బ్లాక్ విత్ రెడ్ క్లాడ్: రూ.2.08 లక్షలు
మ్యాట్ బ్లాక్ విత్ బ్లాక్ క్లాడ్: రూ.2.08 లక్షలు
ఆల్ స్టార్స్ అరోరా గ్రీన్: రూ.2.02 లక్షలు
ఆల్ స్టార్స్ రెడ్: రూ.2.02 లక్షలు
జావా 42 FJ ఆల్ స్టార్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న జావా యెజ్డీ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.
Read Also: లాంగ్ రైడర్లకు అదిరిపోయే బైక్.. కవాసకి వెర్సిస్ 650 కొత్త వెర్షన్ వచ్చేసింది!