E-Paper
Advertisement

ఇంట్లోనే థియేటర్ వైబ్స్ బ్రో! రూ.5,999కే మీ స్మార్ట్ టీవీకి పర్ఫెక్ట్ జోడి

ఇంట్లోనే థియేటర్ వైబ్స్ బ్రో! రూ.5,999కే మీ స్మార్ట్ టీవీకి పర్ఫెక్ట్ జోడి
Advertisement

Boat aavante bar 1500: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో స్మార్ట్ టీవీలు అయితే ఉంటున్నాయి కానీ.. వాటిలో వచ్చే సౌండ్ మాత్రం అస్సలు నచ్చడం లేదు. సన్నటి సౌండ్ వల్ల సినిమా చూస్తున్నప్పుడు ఆ ‘థియేటర్ ఫీల్’ అస్సలు రాదు. మరి జేబు ఖాళీ అవ్వగుండా.. ఇంట్లోనే ఓ రేంజ్‌లో సినిమా హాల్ వైబ్స్ ఎంజాయ్ చేయాలంటే.. మనకు కావాల్సింది ఒక పవర్‌ఫుల్ సౌండ్‌బార్. అందుకే బోట్ బ్రాండ్ నుండి కేవలం రూ.5,999 బడ్జెట్ ధరలో లభిస్తున్న boAt Aavante Bar 1500 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మిడిల్ క్లాస్ హోమ్స్ , బ్యాచిలర్ రూమ్స్‌కు బడ్జెట్ ఫ్రెండ్లీ హోమ్ థియేటర్ల డిమాండ్ బాగా పెరిగింది. ఈ కేటగిరీలో ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్న మోడల్ ఈ బోట్ ఆవాంతే బార్ 1500.

Boat aavante bar 1500 ఫీచర్ల వివరాలు:

1.120W ఆర్ఎమ్‌ఎస్ సౌండ్:

ఈ సౌండ్‌బార్ ఏకంగా 120W RMS పవర్‌ఫుల్ సౌండ్ అవుట్‌పుట్‌ని ఇస్తుంది. దీని అర్థం ఏంటంటే.. మీ హాల్ లేదా బెడ్‌రూమ్‌లో వాల్యూమ్ పెంచితే చుట్టుపక్కల రూమ్‌లు కూడా దద్దరిల్లిపోవాల్సిందే. ఇందులో 2.1 ఛానల్ సౌండ్ సిస్టమ్ ఉంది. అంటే ఒక పొడవాటి సౌండ్‌బార్‌తో పాటు ఒక భారీ వైర్డ్ సబ్‌వూఫర్ వస్తుంది. దీని వల్ల వచ్చే డీప్ బేస్ మ్యూజిక్ లవర్స్‌కు మరియు యాక్షన్ సినిమాలు చూసేవాళ్లకు నెక్స్ట్ లెవెల్ కిక్ ఇస్తుంది.

2. ప్రీమియం డిజైన్ & లుక్:

Advertisement

కేవలం రూ.5,999 కే వస్తున్నప్పటికీ దీని బిల్డ్ క్వాలిటీ చాలా ప్రీమియంగా ఉంటుంది. స్లీక్ అండ్ గ్లోసీ బ్లాక్ ఫినిషింగ్‌తో వచ్చే ఈ సౌండ్‌బార్‌ను మీ స్మార్ట్ టీవీ కింద పెడితే హాల్ లుక్కే మారిపోతుంది. దీనిని మీరు హ్యాపీగా టీవీ కింద టేబుల్ పైన పెట్టుకోవచ్చు లేదా గోడకు వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు.

3. కనెక్టివిటీ ఆప్షన్స్ :

కొన్ని పాత సౌండ్‌బార్లలో కనెక్టివిటీ సమస్యలు ఉంటాయి. కానీ బోట్ ఇందులో ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇందులో బ్లూటూత్ v5.0 ఉంది, దీనివల్ల మీ ఫోన్ లేదా లాప్‌టాప్‌ను ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ చేసి సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. టీవీకి కనెక్ట్ చేయడానికి HDMI (ARC) పోర్ట్, Optical పోర్ట్, AUX ఇన్పుట్ కూడా ఇచ్చారు. మీ టీవీ రిమోట్‌తోనే సౌండ్‌బార్ వాల్యూమ్‌ను కూడా కంట్రోల్ చేయడానికి HDMI ARC చాలా హెల్ప్ అవుతుంది.

4. మల్టిపుల్ ఈక్యూ మోడ్స్:

Advertisement

మీరు చూసే కంటెంట్‌ను బట్టి సౌండ్ ప్రొఫైల్‌ను మార్చుకోవడానికి రిమోట్‌లో ఆప్షన్స్ ఉన్నాయి. సినిమాలు చూసేటప్పుడు ‘Movie Mode’, పాటలు వినేటప్పుడు ‘Music Mode’, మరియు న్యూస్ లేదా టాక్ షోస్ చూసేటప్పుడు డైలాగ్స్ క్లియర్‌గా వినపడటానికి ‘News Mode’ సెలెక్ట్ చేసుకోవచ్చు.

Also Read: కరెంట్ పోయినా 40 గంటల నాన్‌స్టాప్ మ్యూజిక్.. బోట్ లేటెస్ట్ ఇయర్‌బడ్స్ 219 లాంచ్

ధర:

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సౌండ్‌బార్ ప్రైస్ పాయింట్ దీనికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.

సాధారణ ధర: రూ.19,990

అఫీషియల్ డీల్ ధర: ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ , బోట్ వెబ్‌సైట్లలో ఈ boAt Aavante Bar 1500 కచ్చితంగా రూ.5,999 కే అందుబాటులో ఉంది.

ఈ బడ్జెట్‌లో 120W అవుట్‌పుట్, సబ్‌వూఫర్, HDMI ARC పోర్ట్ రావడం అంటే డెఫినెట్‌గా వాల్యూ ఫర్ మనీ డీల్ అని చెప్పొచ్చు. మీకు రూ.6,000 లోపు బడ్జెట్ ఉంది, ఇంటిని ఒక మినీ థియేటర్‌గా మార్చాలి, బేస్ హెవీగా ఉండాలి అనుకుంటే boAt Aavante Bar 1500 కొనేయండి. వీకెండ్స్‌లో నెట్‌ఫ్లిక్స్ లేదా ఆహా లో సినిమాలు చూసేటప్పుడు ఈ సౌండ్‌బార్ ఇచ్చే ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం ఆన్‌లైన్ స్టోర్లలో దీనిపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. స్టాక్ అయిపోయేలోపే మీ టీవీకి ఈ సూపర్ జోడీని యాడ్ చేసేయండి.

Related News

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

మీ ఛార్జింగ్ కేబుల్ తరచూ పాడవుతోందా?ఈ చిన్న మిస్టేక్స్ వెంటనే సరిదిద్దుకోండి!

బట్టలు ఉతకడమే కాదు.. 49% వేగంగా ఆరబెడుతుంది కూడా.. షియోమీ కొత్త వాషింగ్ మ్యాజిక్ ఇదే!

పార్శిల్ బాక్సులు చెత్తలో పడేస్తున్నారా?దొంగ చేతికి తాళాలిస్తున్నట్లే జాగ్రత్త!

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆడియోను.. ఫోన్ రింగ్‌టోన్‌గా సెట్ చేయండిలా!

రీఛార్జ్ ధరల విషయంలో TRAI కీలక నిర్ణయం.. డేటా వద్దంటే ఇక ఈ ప్లాన్స్‌ను ఎంచుకోవచ్చు!

Jio, Airtel, Vi యూజర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. 5 కీలక విషయాలివే!

Big Stories

Advertisement
×