E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పాక్ మ‌హిళ క్రికెట‌ర్ల‌ను హేళ‌న చేస్తే చెప్పు తెగుద్ది..అఫ్రిదికి సనా మిర్‌ కౌంట‌ర్‌

పాక్ మ‌హిళ క్రికెట‌ర్ల‌ను హేళ‌న చేస్తే చెప్పు తెగుద్ది..అఫ్రిదికి సనా మిర్‌ కౌంట‌ర్‌
Advertisement

Sana Mir ON Pakistan Womens Team :  ఉమెన్స్‌ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026) నేపథ్యంలో పాకిస్తాన్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయిన పాకిస్తాన్ మహిళల టీమ్, టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఇక గ్రూప్ స్టేజిలో చివరి మ్యాచ్ లో గెలిచి పరువు దక్కించుకుంది. అయితే టి20 మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్ అయిన నేపథ్యంలో… ఆ దేశ మాజీ క్రికెటర్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. మహిళా క్రికెటర్లకు ఏది చేతకావడం లేదంటూ షాహిద్ అఫ్రిది లాంటివాళ్ళు కారు కూతలు కూశారు. వంటింట్లో వంటలు వండుకోవడానికి తప్ప దేనికి పనికిరారని ఎద్దేవా చేశారు. అయితే, పాకిస్తాన్ మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టుపై షాహిద్ అఫ్రిది లాంటి వాళ్లు చేసిన వ్యాఖ్య‌లకు మాజీ కెప్టెన్ సనా మిర్ (Sana Mir) కౌంట‌ర్ ఇచ్చారు. పాక్ మ‌హిళ క్రికెట‌ర్ల‌ను హేళ‌న చేస్తే చెప్పు తెగుద్ది అంటూ అఫ్రిదికి వార్నింగ్ ఇచ్చారు.

Also Read: Heated argument between Gautam Gambhir and Shreyas Iyer after losing the match: ఐర్లాండ్, ఇంగ్లండ్ ల‌పై గెల‌వ‌క‌పోతే కెప్టెన్సీ పీకేస్తా..శ్రేయ‌స్ కు గంభీర్ వార్నింగ్ !  

పాక్ మ‌హిళ క్రికెట‌ర్ల‌ను హేళ‌న చేస్తే చెప్పు తెగుద్ది..అఫ్రిదికి సనా మిర్‌ కౌంట‌ర్‌

Advertisement

టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో పాకిస్తాన్ ఎలిమినేట్ కావడంపై రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మహిళల జట్టుపై విమర్శలు చేసిన వాళ్లకు మాజీ కెప్టెన్ సనా మిర్ తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. చాలా మంది మాజీ పురుష క్రికెటర్లు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ మహిళా క్రికెటర్ల పై మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చెప్పు తెగుద్ది అంటూ వార్నింగ్ ఇచ్చారు. పురుషుల పాకిస్తాన్ జట్టు కంటే మెరుగైన ఫలితాలను మహిళలు సాధించారని గుర్తు చేశారు. 2012 అలాగే 2016 టీ20 ప్రపంచ కప్లలో ఇండియాను ఓడించిన మొదటి పాకిస్తాన్ జట్టుగా మహిళలు నిలిచారని గుర్తు చేశారు. గత దశాబ్ద కాలంలో పాకిస్తాన్ మహిళా క్రికెట్ అనేక విజయాలను సాధించినట్లు వివరించారు.

ఆసియా క్రీడాల్లో బంగారు పతకాలు సాధించిన తొలి మహిళా జట్టుగా పాకిస్తాన్ ఉమెన్స్ టీం నిలిచిందని వివరించారు. ఇంగ్లాండు వెస్టిండీస్ న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్లపైన కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయన్నారు. పాకిస్తాన్ మహిళల జట్టు అందరికంటే బాగానే రాణిస్తుంది.. గత ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయన్నారు. కేవలం టి20 మహిళల ప్రపంచకప్ టోర్నమెంటు సందర్భంగా విఫలమైనంత మాత్రాన, ఆ క్రికెటర్లను కించపరుస్తూ మాట్లాడడం చాలా తప్పని ఫైర్ అయ్యారు. అమ్మాయిలకంటే పురుషులు ఎక్కువగా జీతాలు తీసుకుంటూ… టీమిండియా చేతిలో ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయని పరువు తీశారు. మొన్న ఫిబ్రవరిలో జరిగిన పురుషుల టి20 ప్రపంచ కప్ లో టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిన సంగతిని గుర్తు చేశారు.

Advertisement

Also Read: LeT Terrorists Caught On-Cam At The Funeral of Shoaib Akhtar’s Brother:  షోయ‌బ్ అక్త‌ర్ సోద‌రుడి అంత్య‌క్రియ‌లు..హాజ‌రైన‌ పహల్గామ్ సూత్రధారి

 

Related News

సంజుపై మెడ మీద క‌త్తి వేలాడుతోంది…వైభ‌వ్ తో త‌స్మాత్ జాగ్ర‌త్త‌

ఆసియాలోనే ఫాతిమా స‌నా ఐరెన్ లేడీ…పాకిస్తాన్ కోసం ప్రాణాలు కూడా ఇస్తుంది

Tanveer Ahmed: వైభ‌వ్ కాదు, దేవుడు దిగివ‌చ్చినా రెండో టీ20లో గెల‌వ‌రు

లేడీ ప్రైవేట్ పార్ట్ పై ఆటోగ్రాఫ్ ఇచ్చిన అభిషేక్ శ‌ర్మ‌

టీమిండియా సెమీ ఫైనల్ కు వెళ్లేలా ఐసీసీ కుట్ర‌లు…మ‌హిళా క్రికెట‌ర్ల ఆరోప‌ణ‌లు

ఐర్లాండ్, ఇంగ్లండ్ ల‌పై గెల‌వ‌క‌పోతే కెప్టెన్సీ పీకేస్తా..శ్రేయ‌స్ కు గంభీర్ వార్నింగ్ !

టీమిండియా పాలిట శాపంగా మారిన ప్ర‌కృతి..ఐర్లాండ్ చేతిలో సిరీస్ దొబ్బిన‌ట్టే !

Big Stories

×